తేదీలు, రోజుల కన్నా తిథుల ఆధారంగానే పండుగలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు, ఇతర ముహూర్తాలు నిర్ణయించేవారు. ఇప్పుడు తిథులపై పెద్దగా అవగాహన లేక డేట్స్ హడావుడి మొదలైంది. ఇప్పటికీ దేవతల పుట్టిన రోజులన్నీ జన్మతిథిని బట్టి నిర్ణయిస్తారు. అంటే ప్రతి తిథికి ఓ దేవుడు ప్రాతినిథ్యం వహిస్తాడన్నమాట. మరి ఏ తిథి రోజు ఏ దేవుడిని పూజించాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం...


మొత్తం తిథులు 16
పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి,షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య . అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 15 రోజులను శుక్ల పక్షం అని, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు  15 రోజులను కృష్ణపక్షం అని పిలుస్తారు.


ఏ తిథిరోజు ఏ దేవుడిని పూజించాలంటే



  • పాడ్యమి రోజు అగ్ని దేవుడిని పూజించడం వల్ల అపరిమితమైన సంపద కలుగుతుంది.

  • విదియ రోజు బ్రహ్మదేవుడిని పూజిస్తే అన్ని రకాల విద్యల్లో ముందుంటారు

  • తదియ రోజు గౌరీదేవిని ఆరాధిస్తారు. గౌరీ కళ్యాణం తదియనాడు జరిగినందున ఈ తిథి అంటే అమ్మవారికి ఇష్టం

  • చవితి రోజు వినాయకుడిని పూజిస్తే తలపెట్టిన పనుల్లో విఘ్నాలు తొలగి విజయం సాధిస్తారు

  • పంచమి రోజు నాగదేవతను ఆరాధిస్తే..సర్పదోషాలు తొలగిపోతాయి

  • షష్టి రోజు కార్తికేయుడిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారు

  • సప్తమి సూర్యభగవానుడికి ఇష్టమైన తిథి. ఈ రోజు సూర్యారాధన చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి

  • అష్టమి దుర్గాదేవి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి. అష్టమాతృకలను, దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.

  • నవమి రోజు దుర్గామాతను పూజిస్తే చెడును నశింపచేసి విజయాన్నిస్తుంది

  • దశమి రోజు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాదిదేవతలు ఈ దిక్కులకు పాలకులు. అష్టదిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగిపోతాయి

  • ఏకాదశి రోజు కుబేరుడిని పూజిస్తే సిరిసంపదలు కలుగుతాయి. ఎందుకంటే కుబేరుడు సంపదకు మూలకారకుడు

  • ద్వాదశి రోజు విష్ణువుకు ఇష్టమైన తిథి. ఈ తిథిరోజే విష్ణుమూర్తి, వామన రూపంలో జన్మించాడు. ద్వాదశినాడు ఆవునెయ్యితో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది.

  • త్రయోదశి యమధర్మరాజు పుట్టిన తిథి.ఈ రోజు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మరణబాధలు తప్పిపోతాయి.

  • చతుర్దశి- రుద్రుని తిథి. ఈ రోజు రుద్రాభిషేకం చేస్తే శివానుగ్రహం లభిస్తుంది

  • పౌర్ణమి కి చంద్రుడు అధిపతి. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజిస్తే ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.

  • అమావాస్య పితృదేవతలకు ఇష్టమైన తిథి. దర్భలు, నువ్వులు, నీళ్ళతో పితృదేవతలకు తర్ణణమిస్తే వారు సంతోషించి సంతానసౌఖ్యం అనుగ్రహిస్తారు.


నోట‌్: కొన్ని పుస్తకాలు, పండితుల సూచనల మేరకు రాసిన వివరాలివి...వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం


Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి


Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే


Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది