ఇద్దరి మధ్య బొమ్మ కోసం డిస్కషన్ జరుగుతుంది. ఈ బొమ్మ గీసింది రిషి కాదని తేల్చేస్తుంది వసుధార. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో మీకు తెలుసని.. కానీ చెప్పడం లేదంటుంది. నేను కాదని ఎలా చెప్పగలవని ప్రశ్నిస్తాడు రిషి. స్వచ్ఛమైన వ్యక్తులు మాత్రమే గీయలగలరని మీకు అంత ఖాళీ లేదని తేల్చేస్తుంది వసుధార. మొత్తానికి ఆ డిస్కషన్ ఆపి ఇద్దరూ కారులో తిరుగు పయనమవుతారు.
కారులో కూర్చున్న వసుధార ఏదో మల్లె పూల స్మెల్ వస్తుందని గుర్తిస్తుంది. వెనుక సీట్లో ఉన్న మల్లె పూలు చూస్తుంది. వాటిని చేతిలోకి తీసుకున్న వసుధార... అసలు వాటిని ఎందుకు కొన్నారు అని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పే ముందు బొమ్మ గురించి చెప్పేస్తాడు రిషి. ఆ బొమ్మ గీసింది తనేనని చెప్పేస్తాడు. ఇంతలో వసుధార సార్ సార్ అని పిలుస్తూ ఉంటుంది. వెంటనే డ్రీమ్ నుంచి ప్రెజెంట్‌లోకి వస్తాడు. పూలు ఎందుకు కొన్నాడో చెప్తాడు. ఆ బామ్మ చెప్పినట్టుగానే వసుధార మల్లెపూల గురించి చెబుతుంది. ఇంతలో కారు దిగిన వసుధార పూలు తీసుకుంటానని చెప్పి వెళ్లిపోతుంది. పూలు ఎవరికి చేరాలో వాళ్లకే చేరుతాయని బామ్మ చెప్పిన విషయం రిషికి గుర్తుకు వస్తుంది.
బెడ్‌రూమ్‌లో కూర్చొని వసుధార కోసం ఆలోచిస్తుంటాడు రిషి. బొమ్మ తను గీసిన సంగతి చెప్పకుండా తప్పు చేశానని అనుకుంటాడు.
ఇక్కడ వసుధార కూడా బొమ్మ, ప్రేమ లేఖ గురించి ఆలోచిస్తుంది. మల్లె పూలు రిషి సార్ ఇచ్చారని... ఈ రెండూ రిషి సారే చేసి ఉంటారా అని అనుకుంటుంది. ప్రేమ లేఖ రాసిన వారి హ్యాండ్ రైటింగ్ చెక్ చేయాలని అనుకుంటుంది. బొమ్మ గీసిందెవరో రిషి సార్‌కు తెలుసని అయినా చెప్పడం లేదంటుంది. ఇదే విషయాన్ని రిషికి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. బొమ్మ గీసిందెవరో కనుక్కోవడమే నా శపథమని చెబుతుంది.
తీసుకొచ్చిన మల్లె పూలతో హార్ట్ సింబల్ క్రియేట్ చేసి బొమ్మ వేసిన వ్యక్తికి పంపించమని రిషికి సెండ్ చేస్తుంది. భరత్ అనే నేను రేంజ్‌లో శపథం చేస్తుంది వసుధార.
జగతి, మహేంద్ర కాలేజీకి వస్తారు... రిషిలో మార్పు వచ్చిందని అందుకే దేవయానికి గట్టిగా సమాధానం చెప్తున్నాడని మహేంద్ర అంటాడు. ఆ బలమేంటో ఇద్దరికీ తెలుసని అంటుంది జగతి. ఇంతలో రిషి పిలిచాడని జగతి తన రూమ్‌కి వెళ్తుంది.
స్కాలర్‌షిప్ టెస్టు కోసం వసుధారను బాగా ప్రిపేర్ చేయాలని జగతికి రిషి చెప్తాడు. తను చదువుతుంది కానీ... మీరు గైడ్ చేస్తా ఇంకా బాగా చదువుతుందని అంటాడు. ఇంతలో అక్కడికి సాక్షి వస్తుంది. ఆమెను చూసి షాక్ అవుతాడు రిషి. రిషీ పద వెళ్దామంటూ సాక్షి అడుగుతుంది. ఎప్పుడూ పనేనా... కాస్త ఫన్ ఉండాలని చెబుతుంది. సినిమాకు వెళ్దామని అడుగుతుంది. ఆ మాటతో క్లాస్ తీసుకుంటాడు రిషి. అంత టైం లేదు.. తీరిక లేదని చెప్పేస్తాడు. కాలేజీకి వచ్చి సినిమాకు వెళ్దామని అడగటం కరెక్ట్ కాదని చెప్పేస్తాడు. ఎవరు ఎక్కడ ఉండాలో తెలుసుకోమంటాడు రిషి. ఆఫీస్ అసిస్టెంట్‌ను పిలిచి ఎవర్ని పడితే వాళ్లను లోపలికి ఎందుకు రానిస్తున్నావని మందలిస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
రేపటి ఎపిసోడ్...
హ్యాండ్ రైటింగ్ చెక్ చేసుకోవాడనికి ప్రేమ లేఖను బుక్స్‌లో పెట్టుకొని తిరుగుతుంటుంది వసుధార. దాన్ని చూసి సీరియస్ అవుతాడు రిషి. వసుధారను తీసుకొని ఇంటికి వస్తాడు రిషి. ఇంతలో సాక్షి పంచాయితీ పెడుతుంది. నా కంటే వసుధార ఎక్కువైపోయిందని అంటుంది.