2024 నవంబరు 15 శుక్రవారం కార్తీక పౌర్ణమి..


ఈ ఏడాది కార్తీక పౌర్ణమి విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు..నవంబరు 15 శుక్రవారం రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ పౌర్ణమి ఘడియలున్నాయి. అందుకే పున్నమి నోములు చేసుకోవాలన్నా, 365 వత్తులు వెలిగించుకోవాలన్నా, పున్నమి పూజ చేయాలన్నా శుక్రవారమే. 
 
పౌర్ణమి పూజ చేయాలి అనుకునేవారు రోజంతా ఉపవాసం ఉండాలి. ఇంటిని శుభ్రం చేసుకుని దేవుడి మందిరాన్ని, తులసి కోటను అందంగా అలంకిరంచుకోవాలి. ఎన్ని వత్తులు వెలిగించాలి అనుకుంటున్నారో వాటిని ముందుగానే ఆవు నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకోవాలి.  సాయంత్రం చంద్రోదయం సమయానికి పూజ ప్రారంభించాలి. 


పూజా సామగ్రి, నైవేద్యం సిద్ధం చేసుకుని తులసికోట దగ్గర ముగ్గువేసుకుని దీపాలు వెలిగించాలి. ఏ పూజ ప్రారంభించినా ముందుగా గణపతి పూజ చేయాల్సిందే.. ( గణపతి పూజ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి). 


వినాయకుడి పూజ పూర్తైన తర్వాత గౌరీదేవికి షోడసోపచార పూజ చేయాలి. గౌరీ అష్టోత్తరం, చంద్రుడి అష్టోత్తరం చదువుకోవాలి. మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయాలి. 


365 వత్తులు వెలిగించాలి అనుకున్న వారు ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం, ఉసిరిచెట్టు దగ్గర అయినా వెలిగించవచ్చు లేదంటే ఇంట్లో తులసి కోట దగ్గర పౌర్ణమి పూజ పూర్తైన తర్వాత అయినా వెలిగించవచ్చు... 


ఉపవాసం ఉండేవారు పూజ పూర్తైన తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదం , పండ్లు తీసుకోవచ్చు. మరే ఇతర ఆహార పదార్థాలు తీసుకోరాదు. పౌర్ణమి మర్నాడు వచ్చే కార్తీక బహుళ పాడ్యమి రోజు కార్తీకదామోదరుడికి పూజ చేసి నైవేద్యం సమర్పించి అప్పుడు ఉపవాసం విరమించాలి.


Also Read: కార్తీక పౌర్ణమి రోజు అరుదైన యోగం ..ఈ రాశులవారికి రాజయోగమే!


శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి 


ఓం గౌర్యై నమః  ఓం గణేశజనన్యై నమః  ఓం గుహాంబికాయై నమః ఓం జగన్నేత్రే నమః  ఓం గిరితనూభవాయై నమః ఓం వీరభధ్రప్రసవే నమః  ఓం విశ్వవ్యాపిణ్యై నమః  ఓం విశ్వరూపిణ్యై నమః ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః  ఓం శివాయై నమః ఓం శాంభవ్యై నమః  ఓం శాంకర్యై నమః ఓం బాలాయై నమః  ఓం భవాన్యై నమః  ఓం హెమవత్యై నమః ఓం పార్వత్యై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం మాంగల్యధాయిన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం మంజుభాషిణ్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహామాయాయై నమః  ఓం మంత్రారాధ్యాయై నమః ఓం మహాబలాయై నమః  ఓం సత్యై నమః  ఓం సర్వమయై నమః ఓం సౌభాగ్యదాయై నమః  ఓం కామకలనాయై నమః ఓం కాంక్షితార్ధప్రదాయై నమః  ఓం చంద్రార్కయుత తాటంకాయై నమః ఓం చిదంబరశరీరిణ్యై నమః ఓం శ్రీ చక్రవాసిన్యై నమః  ఓం దేవ్యై నమః ఓం కామేశ్వరపత్న్యై నమః ఓం పాపనాశిన్యై నమః ఓం నరాయణాంశజాయై నమః ఓం నిత్యాయై నమః ఓం నిర్మలాయై నమః  ఓం అంబికాయై నమః  ఓం హిమాద్రిజాయై నమః  ఓం వేదాంతలక్షణాయై నమః ఓం కర్మబ్రహ్మామయై నమః  ఓం గంగాధరకుటుంబిన్యై నమః ఓం మృడాయై నమః ఓం మునిసంసేవ్యాయై నమః ఓం మాలిన్యై నమః  ఓం మేనకాత్మజాయై నమః ఓం కుమార్యై నమః ఓం కన్యకాయై నమః  ఓం దుర్గాయై నమః ఓం కలిదోషవిఘ్నాతిన్యై నమః  ఓం కమలాయై నమః ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః  ఓం పుణ్యాయై నమః  ఓం కృపాపూర్ణాయై నమః ఓం కల్యాణ్యై నమః  ఓం కమలాయై  నమః ఓం అచింత్యాయై నమః ఓం త్రిపురాయై నమః ఓం త్రిగుణాంబికాయై నమః  ఓం పురుషార్ధప్రదాయై నమః ఓం సత్యధర్మరతాయై నమః ఓం సర్వరక్షిణ్యై నమః ఓం శశాంకరూపిణ్యై నమః  ఓం సరస్వత్యై నమః ఓం విరజాయై నమః  ఓం స్వాహాయ్యై నమః  ఓం స్వధాయై నమః  ఓం ప్రత్యంగిరాంబికాయైనమః  ఓం ఆర్యాయై నమః ఓం దాక్షాయిణ్యై నమః ఓం దీక్షాయై నమః ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః ఓం శివాభినామధేయాయై నమః ఓం శ్రీవిద్యాయై నమః ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః ఓం హ్రీంకార్త్యె నమః ఓం నాదరూపాయై నమః ఓం సుందర్యై నమః  ఓం షోడాశాక్షరదీపికాయై నమః ఓం మహాగౌర్యై నమః  ఓం శ్యామలాయై నమః ఓం చండ్యై నమః  ఓం భగమాళిన్యై నమః ఓం భగళాయై నమః ఓం మాతృకాయై నమః  ఓం శూలిన్యై నమః ఓం అమలాయై నమః  ఓం అన్నపూర్ణాయై నమః ఓం అఖిలాగమసంస్తుతాయై నమః ఓం అంబాయై నమః  ఓం భానుకోటిసముద్యతాయై నమః ఓం వరాయై నమః  ఓం శీతాంశుకృతశేఖరాయై నమః ఓం సర్వకాలసుమంగళ్యై నమః  ఓం సోమశేఖర్యై నమః ఓం సుఖసచ్చిత్పుధారసాయై నమః ఓం బాలారాధిత భూతిదాయై నమః  ఓం హిరణ్యాయై నమః ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః  ఓం సర్వభోగప్రదాయై నమః  ఓం మార్కండేయవర ప్రదాయై నమః  ఓం అమరసంసేవ్యాయై నమః ఓం అమరైశ్వర్యై నమః ఓం సూక్ష్మాయై నమః  ఓం భద్రదాయిన్యై నమః  


Also Read: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఏ సమయంలో వెలిగించాలి , ఎక్కడ వెలిగిస్తే మంచిది!


చంద్ర అష్టోత్తర శతనామావళి 


ఓం శ్రీమతే నమః , ఓం శశధరాయ నమః ఓం చంద్రాయ నమః ఓం తారాధీశాయ నమః ఓం నిశాకరాయ నమః ఓం సుధానిధయే నమః ఓం సదారాధ్యాయ నమఃఓం సత్పతయే నమఃఓం సాధుపూజితాయ నమః  ఓం జితేంద్రియాయ నమః ఓం జగద్యోనయే నమః ఓం జ్యోతిశ్చక్రప్రవర్తకాయ నమః ఓం వికర్తనానుజాయ నమః ఓం వీరాయ నమః ఓం విశ్వేశాయ నమః ఓం విదుషాం పతయే నమః ఓం దోషాకరాయ నమః ఓం దుష్టదూరాయ నమః  ఓం పుష్టిమతే నమః ఓం శిష్టపాలకాయ నమః ఓం అష్టమూర్తిప్రియాయ నమః ఓం అనంతకష్టదారుకుఠారకాయ నమఃఓం స్వప్రకాశాయ నమః ఓం ప్రకాశాత్మనే నమఃఓం ద్యుచరాయ నమః ఓం దేవభోజనాయ నమః ఓం కళాధరాయ నమః  ఓం కాలహేతవే నమః ఓం కామకృతే నమః ఓం కామదాయకాయ నమః ఓం మృత్యుసంహారకాయ నమః ఓం అమర్త్యాయ నమః ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః  ఓం క్షపాకరాయ నమః ఓం క్షీణపాపాయ నమః ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః ఓం జైవాతృకాయ నమః ఓం శుచయే నమః ఓం శుభ్రాయ నమః ఓం జయినే నమః ఓం జయఫలప్రదాయ నమః ఓం సుధామయాయ నమః ఓం సురస్వామినే నమః ఓం భక్తానామిష్టదాయకాయ నమః ఓం భుక్తిదాయ నమః ఓం ముక్తిదాయ నమఃఓం భద్రాయ నమః ఓం భక్తదారిద్ర్యభంజకాయ నమః ఓం సామగానప్రియాయ నమః ఓం సర్వరక్షకాయ నమః ఓం సాగరోద్భవాయ నమః ఓం భయాంతకృతే నమః ఓం భక్తిగమ్యాయ నమః ఓం భవబంధవిమోచకాయ నమః ఓం జగత్ప్రకాశకిరణాయ నమః ఓం జగదానందకారణాయ నమః ఓం నిస్సపత్నాయ నమః ఓం నిరాహారాయ నమః ఓం నిర్వికారాయ నమః ఓం నిరామయాయ నమః ఓం భూచ్ఛాయాఽఽచ్ఛాదితాయ నమః ఓం భవ్యాయ నమః ఓం భువనప్రతిపాలకాయ నమః ఓం సకలార్తిహరాయ నమః ఓం సౌమ్యజనకాయ నమః ఓం సాధువందితాయ నమః ఓం సర్వాగమజ్ఞాయ నమః  ఓం సర్వజ్ఞాయ నమః ఓం సనకాదిమునిస్తుతాయ నమః ఓం సితచ్ఛత్రధ్వజోపేతాయ నమః ఓం సితాంగాయ నమః ఓం సితభూషణాయ నమః  ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః ఓం శ్వేతగంధానులేపనాయ నమః ఓం దశాశ్వరథసంరూఢాయ నమః ఓం దండపాణయే నమః ఓం ధనుర్ధరాయ నమః ఓం కుందపుష్పోజ్జ్వలాకారాయ నమః ఓం నయనాబ్జసముద్భవాయ నమః ఓం ఆత్రేయగోత్రజాయ నమః ఓం అత్యంతవినయాయ నమః ఓం ప్రియదాయకాయ నమః ఓం కరుణారససంపూర్ణాయ నమః ఓం కర్కటప్రభవే నమః ఓం అవ్యయాయ నమః ఓం చతురశ్రాసనారూఢాయ నమః ఓం చతురాయ నమః ఓందివ్యవాహనాయ నమః ఓం వివస్వన్మండలాగ్నేయవాససే నమః ఓం వసుసమృద్ధిదాయ నమః ఓం మహేశ్వరప్రియాయ నమః ఓం దాంతాయ నమః ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః ఓం గ్రసితార్కాయ నమః ఓం గ్రహాధిపాయ నమఃఓం ద్విజరాజాయ నమః ఓం ద్యుతిలకాయ నమః ఓం ద్విభుజాయ నమః ఓం ద్విజపూజితాయ నమః ఓం ఔదుంబరనగావాసాయ నమః ఓం ఉదారాయ నమః ఓం రోహిణీపతయే నమః ఓం నిత్యోదయాయ నమః ఓం మునిస్తుత్యాయ నమః ఓంనిత్యానందఫలప్రదాయ నమః ఓం సకలాహ్లాదనకరాయ నమః  ఓం పలాశసమిధప్రియాయ నమః


Also Read: కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఎందుకు దాటాలి.. విశిష్టత ఏంటి.. కాలిన గడ్డి తీసుకొచ్చి ఏం చేయాలి!