Bhasm Aarti  Shree Mahakaleshwar Temple in Ujjain: ఈ క్షేత్రాన్ని మహాశ్మసానమని పిలవడం జరుగుతోందని చెప్పే పురాణకథలూ ఉన్నాయ. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువునుంచి రక్షిస్తుంది. 12 సంవత్సరాల కొకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన మరణించినవారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి.
 
శివుడికి అట్టహాసాలు, ఆడంబరాలు అంటే పడవు. శ్మసానాల్లో తిరిగే లయకారుడు. అందుకే ప్రత్యేక పూజలు,అలంకారాలు అవసరం లేదు నీళ్లు, భస్మంతో అభిషేకం చేస్తే చాలు కరుణించేంత భక్త సులభుడు. అందుకే చాలామంది చివరి రోజుల్లో కాశీలోనే తనువు చాలించాలనుకుంటారు. అక్కడే రూమ్స్ తీసుకుని ఉండిపోతారు..మరణించాక దహనానికి ముందే డబ్బులు కట్టి శివుడిలో ఐక్యం పోతారు. ఇదంతా సరే కానీ మరి పూర్తిగా శివుడిలో ఐక్యం ఐపోవాలంటే ఏం చేయాలి? అప్పుడు వెళ్లాల్సింది కాశీకి కాదు..ఉజ్జయినికి. 


Also Read: శివుడు పేరుకు అసలైన అర్థం తెలుసా? ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు


మహాకాళేశ్వర జ్యోతిర్లింగం: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నగరంలో కొలువైంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడని చెబుతారు. ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారనేది మాత్రం  అంతుచిక్కని మిస్టరీ. చారిత్రక కథనాల ప్రకారం దీనిని మొదట ప్రజాపిత బ్రహ్మ స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. మహాకాళ దేవాలయం శాంతిభద్రతల పరిస్థితులను చూసేందుకు 6వ శతాబ్దంలో చండ ప్రద్యోత రాజు యువరాజు కుమారసేనుని నియమించినట్లు ప్రస్తావన ఉంది. బీసీ. 4వ-3వ శతాబ్దానికి చెందిన ఉజ్జయిని శివ మూర్తిని కల్గిన పంచ్-మార్క్ నాణేలు కూడా లభించాయి. అనేక ప్రాచీన భారతీయ కవిత్వ గ్రంథాలలో కూడా మహాకాళ దేవాలయం పేరు ప్రస్తావనకు వచ్చింది. 


దక్షిణం వైపు ఉండే శివలింగం ముఖం:  ఈ ఆలయంలో విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే  ఈ శివలింగం ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఈ లక్షణం మరే శివాలయంలో వుండదు. ఉజ్జయినిలో మొత్తం మూడు లింగాలు దర్శనమిస్తాయి. ఈ మూడు లింగాలు మూడు అంతస్తులలో ప్రతిష్టించి ఉంటాయి. మొదటి అంతస్తులో మహాకాళ లింగం. రెండవ అంతస్తులో ఓంకార లింగం, మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం కొలువై ఉన్నాయి.


Also Read: కార్తీక వనభోజనాలు సరదా కోసం కాదు, వాటివెనుకున్న ఆంతర్యం ఏంటంటే!


భస్మ హారతి ప్రత్యేకం: ఇక్కడ మహాకాళ లింగానికి తెల్లవారుజామున విశిష్టమైన హారతిస్తారు. అదే భస్మహారతి. ఇది రెండు రకాలుగా నిర్వహిస్తారు. గోమయం పిడకల్ని విభూతిగా మార్చి రెండు మూటల్లో నింపి వాటిని ఒకదానితో మరొకటి తాడనం చేస్తూ ఆ విభూతి లింగంపై పడుతూ ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది… మరొకటి శ్మసానంలో మొదట కాలిన శవం బూడిదతో ఇచ్చే హారతి...దీనిని నాగసాధువులు నిర్వర్తిస్తారు. దీన్ని చూసేందుకు మహిళల్ని అనుమతించరు. ఈ హారతి సందర్భంగా మోగే భేరీలు, మృదంగనాదాలు, కమ్ముకునే విభూతి, పంచాక్షరి ధ్వని, భస్మాభిషేకం చేస్తున్నప్పుడు చదివే మంత్రాలు..ఇవన్నీ అక్కడుకున్న వారందర్నీ ఓ అలౌకిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లిపోతుంది.


ఇక్కడ మరో విశేషం ఏంటంటే..శివుడిలో ఐక్యం కావాలనే కోరిక ఉన్నవారు అందుకోసం ముందే ఏర్పాట్లు చేసుకుంటారు. అక్కడే మరణించాలని, శివక్యం చెందాలని భావిస్తారు. అలా వారు మరణించిన తర్వాత చితా భస్మాన్ని తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. దేవుడిలో పరిపూర్ణంగా ఐక్యం కావాలనే వాంఛ రోజుకి ఒకరికి మాత్రమే నెరవేరుతుంది. ఇక భస్మ హారతి చూడాలి అనుకుంటే మాత్రం ముందుగానే ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది...(చితాభస్మ హారతి ఇప్పటికీ కొనసాగుతుందని కొందరు..కేవలం పేడపిడకల భస్మంతోనే అభిషేకం చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు)