ప్రేమ్ ని ఇంటికి వెళ్ళమని చెప్తుంది. నేను నీ దగ్గర ఉంటే అందరూ మిమ్మల్ని తలా ఒక మాట అంటారు అని తులసి తల్లితో చెప్తుంది. అంటే ఏంటక్కా మాతో ఉండవా అని దీపక్ అడుగుతాడు. లేదు తులసి తులసితోనే ఉంటుంది. మొదటి సారి తన గురించి ఆలోచించుకుంటుందని తులసి తల్లి గొప్పగా చెప్తుంది. కానీ ప్రేమ్ మాత్రం నేను నితోనే ఉంటానమ్మా అని అంటాడు. నీకు సపోర్ట్ గా నిలబడతాను అని అంటాడు. సామ్రాట్ కూడా సాయం చేస్తాను అని చెప్తాడు కానీ తులసి వద్దని అంటుంది.
పరంధామయ్య ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుంటారు కానీ తినకుండా ఆలోచిస్తూ ఉంటారు. నందు మాత్రం ఎంతకాలం ఇలా బాధపడుతూ కూర్చుంటారు, తులసి వెళ్ళాలి అనుకుంది వెళ్ళిపోయింది.. దీపావళి వస్తుంది అందరూ ఇలాగే ఉంటారా అని అంటాడు. నాకు అలాగే అనిపిస్తుంది నందు ఆ తులసి సామ్రాట్ కోసం ఇల్లు వదిలి బాగానే వెళ్లిపోయిందని నోటికి వచ్చినట్టు వాగుతుంది లాస్య. ఆ మాటకి పరంధామయ్య తినకుండా చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోతాడు. ఆ వెనుకాలే శ్రుతి, అంకిత, దివ్య వెళ్లిపోతారు. తిండి మానేసిన తాతయ్యని ఇప్పడిప్పుడే ఒప్పించి కూర్చోబెట్టాము ఇలాంటి టైమ్ లో మామ్ గురించి అలా మాట్లాడటం అవసరమా అని అభి అంటాడు.
Also read: దేవి ప్లాన్ అదుర్స్, అడ్డంగా బుక్కైన రుక్మిణి- ఆదిత్యే తన తండ్రి అని తెలిసిపోతుందా?
తులసి వెళ్తూ వెళ్తూ ఈ ఇంటి సంతోషాన్ని, ఆనందాన్ని, గౌరవాన్నే కాదు మీ తాతయ్యని కూడా లాక్కుని వెళ్లిపోయిందని అనసూయ కూడా బాధగా తినకుండా వెళ్ళిపోతుంది. తులసి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తల్లి వచ్చేసరికి తనతో బాధ పంచుకుంటుంది. 26 ఏళ్ల తర్వాత నా కూతురు నా కూతురులాగా కనిపిస్తుందని సంతోషిస్తుంది. దివ్య తల్లిని తలుచుకుని బాధపడుతూ ఫోన్ చేయబోతుంటే లాస్య వచ్చి ఆపుతుంది. మీరు నా విషయంలో జోక్యం చేసుకోవద్దని దివ్య అంటుంది. మీ అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కానీ తనతో మాట్లాడటం ఎందుకని లాస్య అంటుంది. మాట్లాడే హక్కు లేదని అడ్డు చెప్పే హక్కు అర్హత మీకు లేదని దివ్య లాస్య మీద అరుస్తుంది.
అనసూయ రంగంలోకి వచ్చి ఇక నుంచి ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు తులసికి ఫోన్ చెయ్యడానికి వీల్లేదని చెప్తుంది. ఇద్దరి మధ్య కాసేపు వాదులాట జరుగుతుంది. నన్ను ఎన్నేసి మాటలు అన్నది ఆ తులసి అని చిందులు వేస్తుంది. లాస్య మధ్యలో దూరి దివ్యని వెనకేసుకొచ్చినట్టు నటిస్తుంది. మామ్ ని ఇంట్లో నుంచి తరిమెయ్యగలిగారు ఏమో కానీ మా మనసుల్లో నుంచి కాదు మా సపోర్ట్ ఎప్పుడు అమ్మకే ఉంటుందని దివ్య తెగేసి చెప్తుంది. దివ్య ఏడుస్తున్నట్టు తులసికి కల వచ్చి ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేస్తుంది. ఫోన్ చెయ్యడానికి చూస్తే తులసిని తన తల్లి ఆపుతుంది. తెల్లారినా కూడా తులసి నిద్ర లేవకపోయేసరికి ప్రేమ్ సంతోషపడతాడు.
Also Read: చిచ్చు పెట్టేందుకు వేదని కలిసిన అభిమన్యు- మాళవిక వాళ్ళకి షాకింగ్ విషయం చెప్పిన లాయర్