Bigg Boss 6 Telugu: మొదట్నుంచి ఇంటి సభ్యుల్లో కొంతమంది ఎందుకో ఇనయా విషయంలో చాలా తేలికగా మాటలు అంటున్నారు. ముఖ్యంగా నామినేషన్ టైమ్‌లో శ్రీహాన్, గీతూ, ఆదిరెడ్డి ఇనయాకు కనీస మర్యాద కూడా ఇవ్వరు. ఈ నామినేషనే కాదు, పాత నామినేషన్లలో కొన్నింటిని చూస్తే అర్థమవుతుంది. ఆ అమ్మాయిని అంతగా తేలిక చేసిన మాట్లాడేంత తప్పు ఏం చేసింది.
సూర్య అంత గేమరా?
కేవలం ఇనయానే సూర్యను బయటికి పంపినట్టు మాట్లాడుతున్నారు ఇంటి సభ్యులు. నామినేషన్లోకి తక్కువగా వచ్చిన వాళ్లు ఎప్పటికైనా త్వరగా వెళ్లిపోతారు. నిత్యం నామినేషన్లో ఉన్నవారికి ఓటు బ్యాంకు పెరుగుతుంది. సూర్యకు ఓటు బ్యాంకే లేదు. ఎందుకంటే ఆయన కేవలం రెండుసార్లే వచ్చాడు నామినేషన్లోకి. ఇనయా నామినేట్ చేయకపోతే ఆయన వెళ్లడా? ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళతాడు. అతను అంత గొప్ప గేమర్ అయితే ప్రేక్షకులే కాపాడుకునేవారు. కానీ సూర్య వెళ్లడం ఇనయా తప్పే అన్నట్టు ఇంటి సభ్యులంతా టార్గెట్ చేశారు. ఆమెను ఒంటరిని చేసి దాడి చేశారు.
శ్రీసత్య చేసింది తప్పు కాదా?
ఇనయా సూర్యను వాడుకుంది అన్న మాటలు అన్నారు చాలా మంది ఇంటి సభ్యులు. మరీ శ్రీసత్య అర్జున్ ఉన్నంత కాలం ఆయన్ను వాడుకోలేదా? హోటల్ టాస్కులో తన చుట్టు తిప్పుకుని మరీ ఆయన వీక్ నెస్‌ను తన బలంగా మార్చుకుంది. డబ్బులు సంపాదించి కెప్టెన్సీ కంటెండర్ అయింది. మరి అది కూడా ఫ్రెండ్ వాడుకోవడమే కదా. నిజం చెప్పాలంటే శ్రీసత్య హైలైట్ అవ్వడానికి అర్జునే కారణం. ఆమె చుట్టూ ఆయన తిరగకపోతే మరోలా ఉండేది శ్రీసత్య కథ.
గీతూ కన్నా చాలా బెటర్
నిజం చెప్పాలంటే ఆటలో గీతూ కన్నా ఇనయా చాలా బెటర్. కన్నింగ్ ఆటలు, ఒకరి వీక్‌నెస్ తో ఆటలు ఆడదు. గీతూ ఒకరి ఎమోషన్‌కు కూడా విలువివ్వదు. మాట్లాడే తీరు ఎంత ఛండాలంగా ఉంటుందో ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆదిరెడ్డి అయితే ఈమె వెనుక బౌన్సర్‌లా తిరుగుతూనే ఉన్నాడు.
ఇనయా వల్ల బయటకు వెళ్లిన సూర్య కూడా అంత ఫీలవ్వడం లేదు, కానీ మిగతా వాళ్లు ఎక్కువ ఫీలైపోతున్నారు. నిజానికి ఇనయాను టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతోనే సూర్య టాపిక్‌ను పదే పదే తీస్తున్నారు. పెద్దగా ఆటే ఆడని సూర్య అంటే వీరికి ఎందుకంత ఇష్టమో మరి.
ఇక ప్రోమోలో ఏముందంటే... నామినేషన్ ప్రక్రియ ముగిశాక అందరూ గుంపుగుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. గీతూ, ఆదిరెడ్డి, శ్రీ సత్య, శ్రీహాన్, ఫైమా ఒక గ్రూపుగా ఏర్పడి మాట్లాడుకుంటున్నారు. ఈలోపు ఇనయా బాత్రూమ్ లోకి వెళ్లిపోయి ఏడ్వడం మొదలుపెట్టింది. దీంతో అందరూ వెళ్లి బయటికి రమ్మని పిలిచారు. అయినా ఇనయా రానని ఏడ్వడం మొదలుపెట్టింది. దీంతో తలుపు బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇంటి సభ్యులు. ఏమవుతుందో ఎపిసోడ్లో చూడాలి.
Also read: గీతూ ఇక మారదా? ఎదుటివారి వీక్‌నెస్‌తోనే ఆడుతుందా - బుద్ధిబలం అంటే ఇదేనా?