Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఆరు సీజన్లు, ఓటీటీ సీజన్లు కలుపుకుని చూసినా గీతూ లాంటి ప్లేయర్ కనిపించరు. తనకు తానే తోపు, తాను ఏం చేస్తే అదే కరెక్టు అని భావిస్తుంది. ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, పద్దతిగా మాట్లాడడం ఆమె డిక్షనరీలోనే లేవు. సంచాలక్‌గా ఆమె ప్రవర్తించిన తీరుపై నాగార్జున ఎంతగా చీవాట్లు పెట్టినా ఇంకా తలకెక్కలేదు. ఎదుటివారి వీక్‌నెస్‌తో ఆడొద్దు అని చెప్పినా కూడా మళ్లీ అదే తప్పు చేసింది. గతంలో రేవంత్ కోపాన్ని క్యాష్ చేసుకుందామని చెప్పింది గీతూ, ఇప్పుడు బాలాదిత్య సిగరెట్ల వీక్‌నెస్ అడ్డుపెట్టుకుని ఆడదామనుకుంది. అదే ఈ ఎపిసోడ్లో రచ్చ రచ్చయ్యేలా చేసింది.
అసలేమైందంటే...బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు ‘మిషన్ ఇంపాజిబుల్’ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులను రెండు వర్గాలు విడదీశారు. కొంతమంది రెడ్ టీమ్, కొంతమంది బ్లూ టీమ్‌గా విడదీశారు. వారి డ్రెస్సుపై ఉన్న నాలుగు ఎరుపు లేదా నీలం స్ట్రిప్స్ ఉంటాయి. వాటిని లాగేస్తే ఆ వ్యక్తి చనిపోయినట్టే. అలా ఏ టీమ్ సభ్యులు ఎక్కువ మంది చనిపోతారో వారు ఓడిపోయినట్టు. అయితే మొదల రెడ్ టీమ్ కు చెందిన ఫైమా స్ట్రిప్స్ లాగేశారు బ్లూ టీమ్ సభ్యులు. దీంతో ఆమె మరణించింది. వైట్ డ్రెస్సు వేసుకుని తిరిగింది.
ఎందుకోగాని ఇనయా, శ్రీసత్య మళ్లీ వాదులాడుకున్నారు. ఇనయా గట్టిగా ‘గేమ్ ఆడడం నేర్చుకోండి’ అంది. దానికి శ్రీసత్య ‘అది నువ్వు నేర్చుకోవాలమ్మ, నేను ఫ్రెండ్‌ని కాపాడుకున్నా, నీలాగ పొడవలేదు’ అని వెన్నుపోటు పొడిచినట్టు నటించింది.
కన్నీళ్లు పెట్టుకున్న బాలాదిత్య...
బాలాదిత్యకు సిగరెట్లు వీక్‌నెస్ అని అందరికీ తెలుసు. ఇప్పటికే గీతూ ఓసారి అబద్ధం చెప్పి సిగరెట్లను దూరం చేసింది. ఇప్పుడు మళ్లీ లైటర్, సిగరెట్లు దాచేశారు గీత, శ్రీసత్య, శ్రీహాన్ కలిసి. లైటర్ కావాలంటే రెండు బ్లూ స్ట్రిప్‌లు తీసి ఇవ్వాలని అడిగింది. అదే సిగరెట్ కావాలంటే మరో రెండు బ్లూ స్ట్రిప్‌లు ఇవ్వాలని అడిగింది. దీంతో బాలాదిత్య చాలా ఎమోషనల్ అయిపోయాడు. ‘ఎంత దిగజారిపోతున్నావో అర్థమవుతోందా’ అంటూ గీతూపై అరిచాడు. ఏడుస్తూనే అరిచాడు ‘ఊరంతా దాన్ని నమ్మద్దు, అది నాటకాలాడుతోందని చెప్పినా కూడా నేను బంగారం అన్నాను’ అని బాధపడ్డాడు. రేవంత్ కూడా ‘గీతూ నువ్వు చేసింది రాంగ్’ అంటూ అరిచింది. అయినా గీతూ ఎందుకు తప్పు అంటూ వాదించింది. ఇక ఆటలో ఏమైందో ఎపిసోడ్ చూడాల్సిందే.
సిగరెట్, లైటర్ ఆటలో భాగం కాదు, కానీ బిగ్ బాస్ బుధ్ది బలం చూపించమన్నాడంటే ఇలా వస్తువులు దాచి బేరమాడమని కూడా అర్థం కాదు. బుద్ధి బలం అంటే ఇదే అనుకుంటోంది గీతూ. ఒకరి వీక్‌నెస్ పై ఆట గెలుద్దామని అనుకుంటోంది. కానీ ఆ ఆట ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో మాత్రం అర్థం చేసుకోవడం లేదు.
Also read: నామినేషన్స్‌లో ఇంటిసభ్యుల ఓవరాక్షన్, ఎక్కువైన వెటకారం - నామినేషన్స్‌లో ఆ పదిమంది