Bigg Boss Telugu 6:   వీకెండ్ కన్నా నామినేషన్స్ ఎపిసోడ్ కోసం చూసే వాళ్లే ఎక్కువ. ఈ సీజన్ ఇంటి సభ్యులకు నామినేషన్ విలువ కూడా తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. వెటకారం, ఓవరాక్షన్ ఎక్కువైంది. ఒకరిని నామినేట్ చేస్తున్నప్పుడు మరొకరు వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించేలా ఉన్నారు. నామినేషన్ సీరియస్‌నెస్ వీరికి తెలియదా? అనే సందేహం వస్తుంది. అంతెందుకు గత సీజన్లలో ఎవరూ నామినేషన్స్ జరుగుతున్నప్పుడు వెకిలి నవ్వులు నవ్వుతూ కనిపించలేదు. వారు నామినేషన్స్‌ని చాలా సీరియస్ గా తీసుకునేవారు. ఈ సీజన్ ఇలా ఉండడం వల్లే పాత సీజన్లను పదేపదే గుర్తుకుతెచ్చుకుంటున్నారు ప్రేక్షకులు. 


ఎపిసోడ్ లో ఏమైందంటే... నామినేషన్స్‌లో భాగంగా కుండలు ఇచ్చారు బిగ్ బాస్. ఎవరిని నామినేట్ చేస్తారో వారి ఫోటో ఉన్న కుండను తీసుకుని కారణం చెప్పి పగులగొట్టాలి. మొదటగా గీతూతో మొదలుపెట్టాడు బిగ్‌బాస్. గీతూ రోహిత్ - మెరీనా జంటను టార్గెట్ చేసుకుంది. వారిద్దరూ కలిసి ఆడుతున్నారంటూ ఇద్దిరనీ నామినేట్ చేసింది. కానీ రోహిత్ మాత్రం చాలా పద్దతిగా మాట్లాడుతూనే గీతూకి సరైన సమాధానాలు ఇచ్చాడు. 


మొదలైంది వార్...
తరువాత రేవంత్ ఇనయని నామినేట్ చేశాడు. ‘చేపల టాస్కులో కెప్టెన్సీ కంటెండర్లుగా పోటీ పడే అంశంలో నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. ముందు నువ్వు ఒప్పుకుని తరువాత నన్ను బ్లేమ్ చేశావ్. నేను హర్ట్ అయ్యాను’ అన్నాడు. దానికి ఇనయా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ‘మీ మాటల వల్ల, మీ చేతల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు’ అంటూ రేవంత్ పై ఎదురుదాడి చేసింది. రేవంత్ చాలా ఆవేశం వెళ్లి గట్టిగా కుండ పగుల కొట్టాడు. తరువాత కీర్తిని నామినేట్ చేశాడు రేవంత్


ఎందుకా వెకిలి పనులు?
ఆదిరెడ్డి ఇనయాను నామినేట్ చేస్తూ ఫేకో ఫేకహ ఫేకోబ్యహ... అన్నాడు. విన్నర్ క్వాలిటీస్ ఉండాలి కానీ, పెట్టుకుని రాకూడదు అన్నాడు. ఎప్పుడు ఎవరిని నామినేట్ చేస్తావో తెలియదు అన్నాడు. దానికి ఇనయా ‘నా గురించి రాంగ్ గెస్ చేశారు, అది నా తప్పు కాదు, మీది’ అంది. ఆదిరెడ్డి ‘వెళ్లిపోతే బాధపడతా అనుకున్నప్పుడు సూర్యను ఎందుకు నామినేట్ చేశావ్’ అని అడిగాడు. అది నా ఇష్టం అంది ఇనయా. కుండ పగుల గొట్టాడు ఆదిరెడ్డి. వీరిద్దరి వాగ్వాదం జరుగుతున్నప్పుడు శ్రీసత్య, శ్రీహాన్ రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో, వెకిలి నవ్వులతో చిరాకు తెప్పించారు. సీరియస్ డిస్కషన్‌ను కూడా నవ్వుల పాలు చేశారు. తరువాత రేవంత్‌ని నామినేట్ చేశాడు. 


ఫైమా వెటకారం...
నాగార్జున చెప్పినా కూడా ఫైమా వెటకారం తగ్గలేదు, సరికదా ఇంకా పెరిగింది. పైగా ‘వెటకారం ఎక్కువైతే కట్ చేసుకోండి బిగ్ బాస్’ అంటూ అతి చేసింది. ఆదిత్య ఫైమాను నామినేట్ చేసినప్పుడు ఆమె ప్రవర్తన బాగోలేదు.నామినేషన్ కూడా వెటకారం తీసుకోవడం ఏంటో. ఆదిత్య రీజన్ చెప్పి ఆమె కుండ బద్దలు కొడుతున్నప్పుడు కూడా వెటకారం చేసింది. నాకు వెటకారం వస్తుంది, ఇలా వస్తుంది అంటూ చాలా చికాకుగా ప్రవర్తించింది. 


కీర్తి... గీతూ,రేవంత్‌లను నామినేట్ చేసింది. కీర్తి - రేవంత్ మధ్య వాగ్వాదం, వెటకారం బాగానే సాగాయి. ‘వెళ్లు వెళ్లు కూర్చో, కాళ్లు నొప్పులు పుడతాయి’ అనడంతో కీర్తి ‘వచ్చి నొక్కుతావా’ అంది. అంత ఇంట్రెస్ట్ లేదులే అని  నోరు మూసుకున్నాడు రేవంత్. 


ఇక కెప్టెన్ అయిన శ్రీహాన్ ఇనయా, కీర్తిని నామినేట్ చేశాడు. వారిద్దరితో గట్టిగానే గొడవ అయ్యింది. కీర్తి అయితే రా అనేసింది శ్రీహాన్‌ను. ఇక ఇనయా - శ్రీహాన్ గొడవల ఓ స్థాయిలో జరిగింది. 


ఆదిరెడ్డి కుండ దాచేసి..
ఈ నామినేషన్స్ ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఇనయా నామినేట్ చేయడానికి వస్తే ఆదిరెడ్డి కుండ దాచేశాడు. ఇనయా ఆయన్ను నామినేట్ చేశాక కుండ కొట్టడానికి దగ్గరకు వెళ్లింది, దీంతో ఆదిరెడ్డి కుండ దాచేసి ‘పోవమ్మా గోధుమపిండికి, మరమరాలకు కూడా నామినేట్ చేస్తావ్’ అంటూ కామెడీ చేశాడు. ఎలాగో చివరికి ఆదిరెడ్డి కుండ పగుల గొట్టింది ఇనయా. 


ఈ వారం నామినేషన్స్ లో పదిమంది నిలిచారు. కీర్తి, గీతూ, ఆదిరెడ్డి, ఇనయా, శ్రీసత్య, మెరీనా, రోహిత్, ఆదిత్య, రేవంత్, ఫైమా ఉన్నారు. వీరిలో ఈసారి మెరీనా - రోహిత్ లలో ఒకరు వెళ్లిపోయే అవకాశం ఉంది.


Also read: ఉన్మాదుల్లా మారిపోయిన ఇంటి సభ్యులు - కుండల్ని అంత గట్టిగా కొట్టమని బిగ్‌బాస్ చెప్పారా? ఎవరి కంటికైనా తగిలితే?