Bigg Boss Telugu 6: ఇనయా మళ్లీ టార్గెట్ అయింది. ఇంట్లోకి మొదటి రెండు వారాల్లో ఆమె ఎంతగా టార్గెట్ అయిందో అదే స్థాయిలో ఈ వారం  అందరూ టార్గెట్ చేశారు. అలా టార్గెట్ కావడానికి ఇనయా చేసిన కొన్ని తప్పులే కారణమని చెప్పచ్చు. ఆట జోరు మీదున్నప్పుడు ఆటను ఆపేసి సూర్య చుట్టూ తిరగడం, నాగార్జున పొద్దు తిరుగుడు పువ్వు అనడంతో తిరిగి ఆట మొదలుపెట్టేందుకు ప్రయత్నించింది. మధ్యలో శ్రీహాన్‌ను పొగిడింది. కొన్ని రోజులు శ్రీహాన్‌తో స్నేహం చేసింది. మళ్లీ అతనికి కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో కత్తి పొడిచి విబేధించింది. ఆమె ప్రవర్తన చిత్రవిచిత్రంగా మారడంతో ఇంటి సభ్యులకే కాదు, ప్రేక్షకులకు కూడా కాస్త చిరాకును తెప్పింది. అందులోనూ ఆమె, వాసంతి ఇద్దరే గతవారం సూర్యను నామినేట్ చేశారు. సూర్య ఇంటి నుంచి వెళ్లపోవడంతో అందరూ ఇనయాను తప్పుబట్టారు. స్నేహంగా ఉండి వెన్నుపోటు పొడిచావంటూ ఎన్నో మాటలు అన్నారు. ఈ నామినేషన్లలో ఇనయా ఒంటరిపోరు చేసింది. 


శ్రీహాన్ ఓవరాక్షన్
గీతూ నుంచి కాస్త యాటిట్యూడ్, ఓవరాక్షన్ నేర్చుకున్నట్టున్నాడు శ్రీహాన్. అందుకే ఈ ప్రోమో మొత్తం యాటిట్యూట్ చూపిస్తూనే ఉన్నాడు. మొదట కీర్తిని నామినేట్ చేశాడు. కాస్త వెటకారంగా ప్రవర్తించడంతో కీర్తికి కోపం వచ్చింది. ‘నీట్‌గా నిల్చుని మాట్లాడుతున్నప్పుడు నీ వెటకారం ఏంట్రా’ అంది. నన్న రా అనకు అంటూ అరిచాడు శ్రీహాన్. ఇక ఇనయా గురించి మాట్లాడుతూ ‘వారానికో రంగు మార్చే ఊసరవెల్లి, నాకు ఊసరవెల్లి ట్యాగ్ వేసింది, ఫ్రెండ్షిప్ లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఇంకెవరు పొడిచి ఉండరు. నిన్ను ఈ రోజు నన్ను నామినేట్ చేయలేవు’ అంటూ చాలా విసురుగా కుండ బద్దలు కొట్టాడు. అంతగా కొట్టాల్సిన అవసరం లేదు.



అందరూ ఉన్మాదులేనా?
గతవారం ఉన్మాదిలా ఆడుతున్నావ్ అంటూ రేవంత్‌ని అన్నారు నాగార్జున. నిజానికి ఈ కుండలు బద్దలు కొట్టే విధానం చూస్తే అందరూ ఉన్మాదుల్లానే ఉన్నారు. 
 గత సీజన్లలో కూడా కుండల నామినేషన్ ఉంది. కానీ అందరూ జాగ్రత్తగా కుండలు బద్దలు కొట్టారు. ఎదుటివారికి ఏం కాకుండా కొట్టారు. ఈ సీజన్లో మాత్రం కుండ పెంకులు ఎవరికైనా తగులుతాయేమో అన్న భయం కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు కొట్టారు. ఈ విషయం బిగ్ బాస్ ఎందుకు ఊరుకున్నాడో అర్థం కాలేదు. ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీ సత్య, రేవంత్, ఫైమా, గీతూ... ఎవరూ తక్కువ కాదు. ఆ కుండపెంకులు ఎవరి కంటికైనా తగిలి గాయం అయితే అప్పుడు ఏం చేసేవారో? 


సూర్యకు వెన్నుపోటు
ఇనయా ఆదిరెడ్డి కూడా వాదించుకున్నారు. నామినేట్ చేశాక ఇనయా కుండ బద్దలు కొట్టేందుకు వెళితే ఆదిరెడ్డి కుండ తీసి దాచాడు. దీంతో ఇనయా కొట్టలేకపోయింది. శ్రీ సత్య కూడా ఇనయాతోనే వాదిస్తూ కనిపించింది. సూర్య వెళ్లిపోవడానికి కారణం ఇనయానే అన్నట్టు మాట్లాడారు చాలా మంది. దీంతో ఇనయా సూర్య వెళ్లిపోవడానికి కారణం నేను కాదంటూ వాదిస్తూ కనిపించింది. ఎవరైనా ఎప్పుడైనా వెళ్లాల్సిందే, ఆడే వాళ్లే నిలుస్తారు... ఈ విషయం మాత్రం ఇంకా ఇంటి సభ్యులు తెలుసుకోలేకపోతున్నారు. సూర్యకు ఓట్లు పడలేదు కాబట్టి వెళ్లాడు, కానీ ఇనయా నామినేట్ చేసినందుకు వెళ్లలేదు అని ఎప్పుడు తెలుసుకుంటారో ఈ తెలివైన ఇంటి సభ్యులు. 


Also read: బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ నేనే - ఇనయా తెగింపు మామూలుగా లేదు, ఎంత కోపంగా కుండలు బద్దలు కొట్టారో చూడండి