దేవి ఆదిత్యకి ఫోన్ చేస్తుంది. ఈరోజు మా నాయన గురించి నాకొక నిజం తెలిసింది. మా నాయన నీకు చెప్పినట్టు చెడ్డోడు కాదు కాస్త మంచోడే అని దేవి చెప్తుంది. అలా అని నీకు ఎవరు చెప్పారు అని ఆదిత్య అడుగుతాడు. ఎంత అడిగినా మాయమ్మ చెప్పడం లేదని ఒక ప్లాన్ వేసి అమ్మ ముందు నాయన్ని తిట్టాను అని జరిగింది అంతా చెప్తుంది. అది విని ఆదిత్య సంతోషిస్తాడు. రుక్మిణి ఆదిత్యని కలుస్తుంది. ఏదో ఆలోచిస్తూ ఉంటుంటే ఏంటి అని అడుగుతుంది. నీ గురించి ఎలా పడితే అలా మాట్లాడింది కోపం వచ్చి కొట్టబోయాను అని చెప్తుంది. తెలిసి తెలియక మాట్లాడితే సర్ది చెప్పాలి కానీ కొట్టాలని అనుకోవడం ఏంటి అని ఆదిత్య అంటాడు. మరి నీ గురించి నా ముందర తిడితే ఎలా తట్టుకుంటానని రుక్మిణి అంటుంది.
నేను మంచోడు అని దేవికి తెలుసు అని దేవి రాత్రి ఫోన్ చేసి మాట్లాడిన విషయం రుక్మిణికి చెప్తాడు. దేవి రోడ్డు మీద వెళ్తుంటే ఒక సోదమ్మ అక్కడ కనిపిస్తుంది. ఒకామెకి సోదమ్మ జాతకం చెప్తుంటే విని దేవి కూడా తన దగ్గరకి వెళ్తుంది. నాకు మా నాయన ఎవరో తెలియదు మా అమ్మని అడిగితే చెప్పడం లేదు నువ్వే నాకు సాయం చెయ్యి అని అడుగుతుంది. మా అమ్మకి వచ్చి సోది చెప్పి మా నాయనతో కలిపేలా చెయ్యి అని అడుగుతుంది. తనని తీసుకుని ఇంటికి వస్తుంది. రుక్మిణి దగ్గరకి వచ్చి సోది చెప్తాను చెయ్యి ఇవ్వు అని అడుగుతుంది. కానీ రుక్మిణి వద్దని అంటుంది. నువ్వు ఉండాల్సిన చోట కాకుండా ఉండకూడని చోట ఉంటున్నావ్ అని సోదమ్మ అనేసరికి రుక్మిణి,, చిన్మయి షాక్ అవుతారు. తను ఏదో నిజం చెప్తుంది ఒకసారి సోది చెప్పించుకోమని చిన్మయి కూడా అంటుంది.
Also Read: చిచ్చు పెట్టేందుకు వేదని కలిసిన అభిమన్యు- మాళవిక వాళ్ళకి షాకింగ్ విషయం చెప్పిన లాయర్
నీ పెనీమీతో కలిసి ఏడు కొండల గుడి దగ్గర దీపాలు పెట్టు నీ కష్టాలు తీరిపోతాయని సోదమ్మ చెప్తుంది. అది నాతో అవదు అని రుక్మిణి అంటుంది. చెప్పిన మాట వినకపోతే కట్టుకున్న వాడికి గండం ఉందని అంటుంది. నీ పసుపు కుంకాలు భద్రంగా ఉండాలంటే నువ్వు ఆ పని చేసి తీరాల్సిందే అని చెప్తుంది. నువ్వు చెప్పేది అంతా నిజమేనా అని చిన్మయి అడుగుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పినా నమ్మి నడిస్తే నీ బతుకు బాగుంటుందని చెప్పి సోదమ్మ వెళ్ళిపోతుంది. ఆ మాటలు అన్నీ దూరం నుంచి దేవి వింటూ ఉంటుంది. వెంటనే రుక్మిణి ఆదిత్యకి ఫోన్ చేసి గుడికి వెళ్ళాలి దీపాలు పెట్టాలి అని చెప్తుంది. చాటు నుంచి దేవి వింటుంది. అమ్మ నాయనకి ఫోన్ చేసింది అంటే నాయన గుడికి వస్తాడు.. ఈ పొద్దు నాయన్ని చూడబోతున్నా అని సంతోషంగా ఉంటుంది దేవి.
దేవి సంతోషంగా ఉండటం ఏంటో చెప్పమని చిన్మయి అడుగుతుంది. ఇప్పుడు కాదు అయినక చెప్తాను అని అంటుంది. ఆదిత్య తన పరిస్థితి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. సమస్యలు అన్నీ తీరాలంటే ఆ దేవుడే తీర్చాలి అని ఆదిత్య అనుకుంటాడు. దీపాలు వెలిగించడానికి వస్తున్నాం మా బాధలు తీర్చి నా బిడ్డని నా దగ్గరకి పంపించు అని కోరుకుంటాడు.
Also read: లాస్యకి వార్నింగ్ ఇచ్చిన నందు- తులసి నుంచి ఇంటిని లాగేసుకునేందుకు అనసూయ స్కెచ్