తులసి తల్లి దగ్గరకి వస్తుంది. తనని చూసి దీపక్ ఎమోషనల్ అవుతాడు. ప్రేమ్ జరిగింది అంతా చెప్పాడని తులసి తల్లి చెప్తుంది. నేను జరగకూడదు అనుకున్నాది జరిగింది, నా వాళ్ళని వదిలేసి రావాల్సి వచ్చింది అని తులసి బాధపడుతుంది. ఇల్లు వదిలి వచ్చినందుకు తల్లి మెచ్చుకుంటుంది. ఆ ఇల్లు నీకు కోడలిగా, కూతురుగా గౌరవం ఇవ్వలేకపోయిందని అంటుంది. నువ్వు ఓడిపోయి గెలిచావు అని తులసికి ధైర్యం చెప్తుంది. అటు ప్రేమ్ కూడా సామ్రాట్ కి నచ్చజెప్పి ఇంట్లోకి తీసుకుని వెళతాడు.


పరంధామయ్య తినకుండా ఉంటే శ్రుతి బతిమలాడుతుంది. నందు, లాస్య అక్కడికి వస్తారు. అందరి బాధలు గురించి ఆలోచించే గొప్ప మనసు మీ ఆంటీకి ఉందేమో కానీ నాకు లేదు, మీరెవరు నావైపు చూడకండి, ఈ సామ్రాజ్యం కూలిపోయిందని బాధపడుతూ ఉంటాడు. ఇప్పటి వరకు ఫోన్ చేయని తులసి కోసం ఎందుకు ఆయన బాధపడటం అని లాస్య అంటుంది. అదంతా కాదు కానీ దివ్య ఈ ట్యాబ్లెట్ తాతయ్య వేసుకునేలా చూడు అని చెప్పి ఇస్తాడు. దివ్య కూడా శ్రుతితో కలిసి బతిమలాడి తినేలా చేస్తుంది. మీరు కూడా నన్ను అనుమానిస్తే చెప్పండి ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అనేసరికి నా కూతురు మీద నాకు నమ్మకం ఉందని చెప్తుంది. ఎవ్వరైనా తప్పులు చేస్తారు కానీ నా కూతురు చెయ్యదు అని అంటుంది. అప్పుడే ప్రేమ్ సామ్రాట్ ని తీసుకుని ఇంట్లోకి వస్తాడు.


Also Read: దేవి మీద చెయ్యెత్తిన రుక్మిణి- ఆదిత్యని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు


నేనే కాల్ చేసి సామ్రాట్ గారికి జరిగింది అంతా చెప్పాను, నేనే రమ్మని చెప్పాను అని ప్రేమ్ చెప్తాడు. అమ్మ దగ్గరకి వచ్చాను కదా నేను బాగానే ఉన్నాను అని అంటుంది. ఇదంతా నా వల్లే జరిగిందని సామ్రాట్ క్షమాపణ చెప్తాడు. మీ వల్ల కాదని తులసి అంటుంది. ఎందుకు ఇంత సరదా, ఎందుకు మంచితనం తప్పు ఎందుకు మీమీద వేసుకుంటున్నారు. నేను గతంలో ఇలాగే చేశాను, నెమ్మదిగా వాళ్ళే అర్థం చేసుకుంటారు అని ఆశపడ్డాను. కానీ నా మంచితనానికి ఎలాంటి ఫలితం వచ్చిందో చూశారు కదా. మాటలతో గుచ్చి గుచ్చి గుండెలకి గాయం చేశారు అని చాలా బాధపడుతుంది. ఇంతమంది నా ముందు ఉన్నప్పుడు నేను ఎందుకు బాధపడాలి అని తనకి తాను ధైర్యం చెప్పుకుంటుంది.


నందు జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే లాస్య వచ్చి మాట్లాడుతుంది. సామ్రాట్, తులసి ఒక రాత్రి అంతా గడిపిన తర్వాతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్ వేసి ఉంటారు. చాలా తెలివైన వాళ్ళు అసలు తక్కువ అంచనా వేయకూడదు. అవకాశం వచ్చింది ఎగిరిపోయారు నువ్వు ఎందుకు దాని గురించి ఆలోచిస్తావు అని లాస్య అంటుంది. నాకు ఇవన్నీ వద్దు నాకు ఒక విషయం హ్యాపీగా అనిపిస్తుంది నా కుటుంబానికి నేను దగ్గర అవుతున్నా, ఇక నుంచి వాళ్ళ బాధ్యత నాదే అని నందు చెప్తాడు. ఇప్పుడు మన బతుకులే భారం అయినప్పుడు ఇప్పుడు మరొకటి నెత్తి మీద పెట్టాడు మనం ఇప్పుడు ఖచ్చితంగా జాబ్ వెతుక్కోవాలి. తులసి లేని లోటు వాళ్ళకి నువ్వే తీర్చాలి, ఎలా చేస్తావో నీ ఇష్టం అని నందు లాస్యని హెచ్చరిస్తాడు.


Also Read: వేదని మాటలతో చిత్రవధ చేసిన యష్- మాళవికతో కలిసి పిక్నిక్ కి వెళ్తాడా?


కోపంగా బయటకి వెళ్ళి ఈ ఇంటి బయట ఉన్న తులసి నిలయం బోర్డ్ పీకి పడేస్తాడు. తులసికి ఈ ఇంట్లోనే కాదు నా ఫ్యామిలీలో కూడా చోటు లేదు. తులసి నా ముందుకు వచ్చి బిక్షం అడిగినా ఈ ఇంట్లోకి అడుగుపెట్టనివ్వను అని నందు అంటాడు. సామ్రాట్ తులసికి ధైర్యం చెప్తూ ఉంటాడు. తర్వాత ప్రేమ్ తన వెంటే ఉన్నందుకు తులసి మురిసిపోతుంది.