దేవి తన తండ్రి చెడ్డవాడు అయినా తనని మార్చుకుంటాను అని చెప్తుంది. ఆ మాట విని ఆదిత్య చాలా సంతోషిస్తాడు. మా నాయన్ని వెతకడానికి సాయం చేస్తావా అని దేవి అడిగితే చేస్తాను అంటాడు. నాన్న అంటే నీకు ఎంత ఇష్టమో తెలిశాక తప్పకుండా సాయం చేస్తాను త్వరలోనే మీ నాన్న నీకు కనిపిస్తాడు అని ఆదిత్య అనేసరికి దేవి సంతోషంగా వెళ్ళి కౌగలించుకుంటుంది. కారులో వెళ్తు కూడా దేవి తనని నాన్న అని పిలిచేది ఎప్పుడు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రుక్మిణి ఫోన్ చేస్తుంది. ఇక్కడ జరిగినదానికి బాధపడుతున్నావా అని అడుగుతుంది. కానీ ఆదిత్య కాదు నీ గురించి బాధపడుతున్న ఇంతకాలం నువ్వు అక్కడ ఎంత నరకం అనుభవించావో నా కళ్ళారా చూశాను, నా భార్యవి అయ్యి ఉండి ఆ విషయం చెప్పుకోలేక ఇంకొకరి భార్యగా బతుకుతూ ఎంత నరకం అనుభవించావో చూశాను. ఇంత బాధపడుతూ కూడా నా బిడ్డని నా దగ్గరకి చేర్చాలని చూస్తున్నావ్ చూడు నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు అని అంటాడు.


Also Read: వేదని మాటలతో చిత్రవధ చేసిన యష్- మాళవికతో కలిసి పిక్నిక్ కి వెళ్తాడా?


నీకు గుడి దగ్గర మాటిచ్చినట్టు దేవమ్మకి నువ్వే తన నాయన అని చెప్పి నీ దగ్గరకి పంపిస్తాను అని రుక్మిణి అంటుంది. ఇప్పటి వరకు దేవి నా దగ్గరకి వస్తే చాలు అనిపించింది. కానీ ఆ రోజు నువ్వు అడిగిన ప్రశ్నే ఈ రోజూ నా మనసు అడుగుతుంది. దేవికి నేనే తన తండ్రి అని చెప్తే ఇన్ని రోజులు ఎందుకు ఆ విషయం చెప్పలేదని అంటే ఏం చెప్తావ్ వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటున్నావ్ అంటే ఏమని చెప్తావ్ అని అడుగుతాడు. నా గతం చెప్పలేను, నా బిడ్డకి కావాల్సింది నాయన, నువ్వే వాళ్ళ నాయన అని చెప్తే చాలు మస్త్ ఖుషి అయ్యి నీ దగ్గరకి వచ్చేస్తుంది, ఈఈ ఆలోచనలు ఏమి రావని రుక్మిణి అంటుంది. బిడ్డని పంపిస్తాను అంటున్నావ్ మరి నువ్వు రావా, రావాలని నీకు లేదా అని అడుగుతాడు.


దేవి స్కూల్ దగ్గర నుంచి వచ్చి తన తండ్రి గురించి మళ్ళీ మాట్లాడుతుంది. నాన్న అసువంటి గలీజోడు అందుకే నువ్వు దూరంగా వచ్చేసావు, మంచి పని చేశావు అసువంటోడు మా నాయన అని దోస్తుల ముందు చెప్పాలంటే నేను పరేషన్ అయ్యేదాన్ని వచ్చేసి మంచి పని చేశావ్, ఇంకెప్పుడు నాయాన్ని రానివ్వకు, ఎప్పుడైనా వస్తాను అంటే నీలాంటి వాడు ఉంటే ఏంది లేకపోతే ఏంది అని చెప్పు అని దేవి అనేసరికి రుక్మిణి కోపంగా అరుస్తూ చెయ్యి ఎత్తుతుంది. ఆ పనికి చిన్మయి, దేవి షాక్ అవుతారు. చెడ్డోడిని చెడ్డోడు అంటే ఎందుకు కోపం వస్తుందని అడుగుతుంది. మీ నాయన్ని ఇలాంటి మాటలు అంటే కళ్ళు పోతాయి మళ్ళీ ఇలాంటివి అనకు గుర్తుపెట్టుకో అని కోపంగా వెళ్ళిపోతుంది.


Also read: రేస్ మొదలు పెట్టిన తులసి- అండగా నిలిచిన సామ్రాట్


నాయన్ని అంటే అమ్మకి అంత కోపం వచ్చిందంటే చెడ్డోడు కాదు చాలా మంచోడు అని దేవి సంతోషపడుతుంది. గదిలోకి వచ్చి రుక్మిణి బాధపడుతుంటే చిన్మయి వస్తుంది. ఆఫీసర్ సార్ మీ నాయన అని చెప్తే ఊరుకుంటుందా నాయనతో కలిసి ఉండాలని అంటది అది అయ్యే పని కాదని రుక్మిణి చెప్తుంది. నా కోసం వెళ్లాలని అనుకోవడం లేదా అని చిన్మయి అడుగుతుంది. కాదు నా చెల్లి సత్య కోసం నేను ఆ ఇంట్లో అడుగుపెడితే నా చెల్లి బతుకు ఆగమైపోతుందని బాధపడుతుంది. నువ్వు లేకుండా చెల్లి వెళ్ళదు కదా అని చిన్మయి అంటుంది. అది ఎలాగో నాకు తెలియదు కానీ పంపించాలని రుక్మిణి ఫీల్ అవుతుంది.