వేద నన్నేమి అడగాలని అనిపించడం లేదా అని యష్ అడుగుతాడు. మీ నుంచి వచ్చే సమాధానాల కోసం చాలా ప్రశ్నలు ఎదురు చూస్తున్నాయని వేద అంటుంది. అక్కడ ఏమి జరగలేదని యష్ చెప్పిన వేద వినిపించుకోదు.
వేద: మాళవిక మీ మాజీ భార్య, నిన్నటి దాకా ఆమెని అసహ్యించుకున్నారు ఇప్పుడు రహస్యంగా కలుసుకుంటున్నారు. అర్ధరాత్రి ఫోనుల్లో మాట్లాడుకోవడాలు మెసేజులు పెట్టుకోవడాలు, అడిగితే ఫోన్ చేస్తే అబద్ధాలు చెప్తున్నారు. హోటల్ గదుల్లో గడుపుతున్నారు, నేను ఎలా అర్థం చేసుకోవాలి, నాకు అయితే అర్థం కావడం లేదు మీరు చెప్పండి వింటాను
యష్: కంటికి కనిపించేవి అన్నీ నిజాలు కావు
వేద: నిజాలు అయితే నాకెందుకు అబద్ధాలు అయితే నాకెందుకు మన మ్యారేజీ అగ్రిమెంట్లో ఏమి రాసుకోలేదు కదా బాధపెట్టడం భర్త హక్కు, భరించడం భార్య బాధ్యత అని
Also read: రేస్ మొదలు పెట్టిన తులసి- అండగా నిలిచిన సామ్రాట్
యష్: నువ్వు అలా ఫీల్ అవడంలో తప్పు లేదు వేద. ఒప్పుకుంటాను నా వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. నీ దగ్గర కొన్ని నిజాలు చెప్పలేకపోతున్నాం. నేను మాళవిక కలిసి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. అది ఆదిత్యకి సంబంధించినది. ఆది కోసం నేను మాళవికతో కలిసి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంతకమించి ఏమి లేదు. సొంత మనుషుల దగ్గర కూడా దాచి పెట్టాల్సి వస్తుంది. నా పరిస్థితి అదే. ఇది నాకు ఇష్టం కాదు, దీని వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అంతకి పది రెట్లు బాధపడుతున్నా. ఈ నిజం నీకు ఎప్పుడొకప్పుడు తెలియకపోదు. అప్పుడు నేను నీకు చేతులు జోడించి క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకో వేద
వేద: ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నన్ను మీరు నమ్మడం లేదని మొహం మీద చెప్పేస్తున్నారు. సడెన్ గా నేను మీకు పరాయిదాన్ని అయిపోయాను. ఆ మాళవిక మీకు సొంత మనిషి అయిపోయింది. ఎందుకంటే సమస్య మీ కొడుకు ఆదిత్యది కదా. ఇప్పుడు మీకు మాళవికనే కావాలి నేను అక్కర్లేదు
యష్: ప్రతిసారి నువ్వు ఇదే చేస్తున్నావ్ ఆ మాళవికని ఎక్కువ చేసి మాట్లాడి నిన్ను నువ్వు అవమానించుకుంటున్నావ్, నన్ను కూడా అవమానిస్తున్నావ్
వేద: ఖచ్చితంగా మీకు మాళవికనే ఎక్కువ అందుకే మీ సమస్యని మాళవికతో కలిసి సాల్వ్ చేస్తున్నారు. ఇదేనా మీరు మీ భార్య మీద మీరు పెట్టుకున్న నమ్మకం, బంధానికి ఇచ్చే గౌరవం
యష్: నాకు గౌరవం లేదు, భార్య అనే పదానికి గౌరవం లేదు పోయేలా చేసింది ఆ మాళవిక. గాయపడ్డ గుండె నాది, నేను నిన్ను పెళ్లి చేసుకుంది నాకు భార్య కావాలని కాదు నా బిడ్డకి అమ్మ కావాలని. ఖుషికి అమ్మగా వచ్చావ్, అమ్మగానే ఉండు, అక్కడే ఆగిపో అదే మన ఒప్పందం
వేద: అంటే నాకంటూ ఎమోషన్స్ ఉండవా, అవి హర్ట్ అవవా, నేను ఆడగకూడద
యష్: ఆడగకూడదని నేను అనడం లేదు, మన ఇద్దరి పెళ్లి కేవలం ఖుషి కోసం చేసుకున్న ఒప్పందం, మన ఇద్దరి మధ్య ఒక లక్ష్మణ రేఖ ఉంది అది గుర్తు పెట్టుకో అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Also Read: పశ్చాత్తాప్పడిన వసు- పూల వర్షం కురిపించుకున్న ప్రేమపక్షులు, పట్టరాని సంతోషంలో రిషి
ఆ మాటలకి వేద గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తెల్లారగానే యష్ ఏమి జరగనట్టు వేదని కాఫీ ఇవ్వమని అడుగుతాడు. కానీ వేద యష్ ని పట్టించుకోకుండా ఉండటం ఖుషి చూస్తుంది. ఏంటి మళ్ళీ గొడవ అయ్యింద అని ఖుషి అడిగితే కొంచెం అంటాడు. వెళ్ళి సోరి చెప్పు అని ఖుషి అనేసరికి యష్ కిచెన్లోకి వస్తాడు. వేద మాట్లాడకుండా కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టి ఖుషిని పిలిచి తీసుకోమని చెప్తుంది. మాళవికని షాపింగ్ కి తీసుకెళ్తాను అని అభిమన్యు అంటాడు. ఈరోజంతా నువ్వు నాతో ఉండాలని అంటే సరే అంటుంది. అప్పుడే లాయర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, యష్ తో కలిసి బయటకి వెళ్ళాలి అనేసి వెళ్ళిపోతుంది. యాక్సిడెంట్ కి సంబంధించి యష్ మాత్రమే హెల్ప్ చెయ్యగలడు నువ్వు ఇదేమి మైండ్ లో పెట్టుకోకు, యశోధర్ తో ఈ మీటింగ్ చాలా అవసరం, తను నా కోసం వెయిట్ చేస్తున్నాడని మాళవిక వెళ్ళిపోతుంది. మ్యాటర్ చాలా దూరం వెళ్తుంది, తెలిసి తెలిసి ఈ అభికి కోపం తెప్పించి చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ అని అభి కోపంగా అంటాడు.