ఎంజీ ఎయిర్ ఈవీ వచ్చే సంవత్సరం ప్రారంభంలో మనదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని ఎంజీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇది ఎంజీ కంపెనీ మనదేశంలో లాంచ్ చేసే మొట్టమొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కారు కానుంది. ఎంజీ ఎయిర్ ఈవీ షేప్ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఎంజీ జెడ్ఎస్ కంటే తక్కువ ధరతో ఈ ఎలక్ట్రిక్ కారు లాంచ్ కానుంది. పొడవు విషయంలో మాత్రం ఇది చిన్నగా ఉండనుంది. ఫ్యూచరిస్టిక్ సిటీ కారు తరహా డిజైన్‌తో ఇది రానుంది. ఎక్కువ స్పేస్ లేని నగరాల్లో సులభంగా ఎంజీ ఎయిర్ ఈవీని పార్క్ చేయవచ్చు.


దీని స్టైలింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. లైట్ బార్‌ను దీని ముందువైపు చూడవచ్చు. చార్జింగ్ పోర్టు కారు కింది భాగంలో ఉంది. దీని ఫాగ్ ల్యాంప్స్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. ఇందులో ఉన్న పెద్ద హైలెట్ ఏంటంటే పెద్ద డోర్. ఏరియర్ క్యాబిన్ దగ్గర వర్టికల్ విండో కూడా ఉంది.


ఇది మాస్ మార్కెట్ కారు కాబట్టి పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. దీని వీల్ బేస్ కూడా పెద్దగా ఉండనుంది. దీని రేంజ్, బ్యాటరీ ప్యాక్ గురించి పూర్తి స్థాయిలో వివరాలు తెలియరాలేదు.


2023 ఆటో ఎక్స్‌పోలో ఈ ఎయిర్ ఈవీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇది కూడా నిలవనుంది. జీ20 సమ్మిట్‌లో డెలిగేట్స్ కోసం ఈ కారును ఉపయోగించనున్నారు. ప్రస్తుతం కేవలం టియాగో ఈవీ మాత్రమే దీనికి పోటీగా నిలవనుంది. 


మాస్ మార్కెట్ ఈవీ కొనుగోలు దారుల కోసం ఎంజీ దీని చార్జింగ్ కోసం వేర్వేరు సర్వీసులను లాంచ్ చేయనుంది. ఇది ఒక ఇంట్రస్టింగ్ ఎలక్ట్రిక్ వాహనం కానుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.


Read Also: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ సేఫ్టీ కార్ల లిస్టు ఓసారి చూడండి!