తెలంగాణలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ అండ్ పుడ్(హెల్త్) అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 31న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకూ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
TSPSC FSO పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
హాల్‌టికెట్‌లో పరీక్ష తేది, పరీక్ష కేంద్రం, అభ్యర్థికి సంబంధించిన వివరాలు, పరీక్ష సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఉంటాయి. అభ్యర్థులు తప్పనిసరిగా సూచించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేనిదే పరీక్ష రాయడానికి అనుమతించరు. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును వెంటతీసుకెళ్లడం మంచిది.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 7న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష నిర్వహించనున్నారు. నవంబరు 7న ఉదయం. మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష విధానం:
మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) నుంచి 150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్-2 (సంబంధిత సబ్జెక్ట్) నుంచి 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ప్రశ్నలు ఇంగ్లిష్‌లో మాత్రమే అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.
నోటిఫికేషన్, పరీక్ష విధానం సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
CBSE CTET 2022: సీటెట్-2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - పరీక్ష విధానం, ముఖ్య తేదిలివే!
కేంద్రీయ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే 'సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్)-2022' దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 31న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఫీజు చెల్లించడానికి నవంబరు 25 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. సీటెట్ ఆన్‌లైన్ టెస్టును డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి మధ్య నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
అణుశక్తి విభాగంలో 321 ఉద్యోగాలు, దరఖాస్తుచేసుకోండి!
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రిసెర్చ్ దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా జేటీఓ, ఏఎస్ఓ, సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పదవతరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత గల అభ్యర్ధులు అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 17 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..