జగతి మహేంద్రకి తినిపిస్తుంది. ఏంటి మహేంద్ర నీకు ఈ బాధ తీర్పు నువ్వే చెప్పి నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావ్ అని జగతి అంటుంది. నేను ఏమైనా తప్పు చేశానా అని అడుగుతాడు. రిషి తలుచుకుంటున్నాడేమో కదా అని అంటే ప్రతిక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటున్నాడు, నాతో ఉంటున్నావ్ అనే కానీ రిషి కనిపిస్తే మనసు అదుపులో ఉంచుకోలేవు కదా అని జగతి అడుగుతుంది. అదే ప్రేమలో ఉన్న మ్యాజిక్ రిషి కనిపిస్తే మనం ఏం చేయలేము అని మహేంద్ర అంటాడు. తర్వాత తనకి టిఫిన్ తినిపిస్తాడు. ఇద్దరు రిషి గురించి చాలా బాధపడతారు. రిషిని అమ్మవారి గుడికి తీసుకుని వస్తుంది. ఇక్కడికి తీసుకుని వచ్చావ్ ఏంటి అని రిషి అడుగుతాడు. మీతో అమ్మవారితో మాట్లాడాలి అని అంటుంది.


వసు: రిషి చేతులు పట్టుకుని నన్ను క్షమించండి సర్..


రిషి: ఏయ్ వసుధార క్షమించడం ఏంటి


వసు: నా ఆలోచనలు, నా అభిప్రాయాలు, నా ఆశలు అన్నీ బలవంతంగా మీ మీద రుద్ది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. జగతి మేడమ్ ని అమ్మా అని పిలవమని మిమ్మల్ని బాధపెట్టాను


రిషి: వసుధార అవన్నీ ఇప్పుడు ఎందుకు


వసు: నా మొండితనం పంతంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఒక సందర్భంలో ఈ ఒప్పందం మన బంధాన్ని దూరం చేస్తుందా అని కూడా చాలా భయపడ్డాను. ఈ విషయంలో మీకు కోపం వచ్చినా, బాధ కలిగిన సహనం చూపించారు. మీ సహనం ముందు నా పట్టుదల చిన్నబోయింది సర్. నేను ఎంత మొండిగా ఉన్న మీ ప్రేమ అణువంత అయిన తగ్గలేదు మీ ప్రేమ గొప్పది.. మీ చెయ్యి పట్టుకుని జీవితాంతం నడవాల్సిన దాన్ని మిమ్మల్ని బాధపెట్టాను.. ఆ విషయంలో నేను మీకు సోరి చెప్పాలి


Also read: ఆగ్రహంతో ఊగిపోతున్న మోనిత, మనసు మార్చుకున్న ఇంద్రుడు- శౌర్యని దీప, కార్తీక్ చూస్తారా?


రిషి: మనకి మనకి సోరిలు ఏంటి


వసు: మీరు ఆ రోజు చీర కట్టుకోమన్నారు.. కాదని అందరినీ బాధపెట్టాను. మార్పు అనేది సహజంగా కాలక్రమేణా రావాలి. మచ్చలేని చంద్రుడిగా మిమ్మల్ని చూడాలని అనుకున్నా. కానీ చందమామని మార్చాలని ఆశించడం తప్పని తెలుసుకున్న, నా పంతంతో మహేంద్ర సర్ దూరం అయిపోయారని బాధగా ఉంది.. తల్లి ప్రేమ కోసం తండ్రి ప్రేమని దూరం చేసిన దాన్ని అని బాధగా ఉంది.. మీరు నన్ను క్షమించాలి.. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏ విషయంలోను ఇబ్బంది పెట్టను


రిషి: మన మధ్య ఎలాంటి అడ్డంకులు లేనట్టేనా


వసు: ఉండవు అని మాట ఇస్తున్నా.. మీ మనసు చెప్పింది మీరు వినండి, మిమ్మల్ని మారమని చెప్పే హక్కు నాకు లేదు మారితే సంతోషపడే క్షణాన్ని నేను ఆస్వాదిస్తాను


రిషి: నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది.. ఇన్నాళ్ళు పక్క పక్కన ఉన్నా ఏదో అడ్డుతెర ఉన్నట్టు ఉంది కానీ అది ఇప్పుడు తొలగిపోయింది. ఇక మన మధ్య ఏ విషయంలోనూ అభిప్రాయబేధాలు రావని ఆశిస్తున్నా


Also Read: ఆదిత్య గుట్టు బయటపెట్టేందుకు రంగంలోకి దేవుడమ్మ- కన్నతండ్రి మీద ప్రేమ చూపించిన దేవి


వసు రావని మాట ఇస్తుంది. ఆ మాటకి రిషి చాలా సంతోషంగా తన మీద పూల వర్షం కురిపిస్తాడు. ఇచ్చిన మాట వదులుకోలేను అలాగని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని మనసులో వసుధార అనుకుంటుంది. వసు కూడా రిషి మీద పూలు వేస్తూ సంబరపడుతుంది. కాలేజీలో లెక్చరర్లు మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ జగతి మేడమ్ తో మాట్లాడదామని దేవయాని ఇంటికి ఫోన్ చేస్తారు. ధరణి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. జగతి మేడమ్ తో మాట్లాడాలి అని అడుగుతారు. అప్పుడే దేవయాని వచ్చి ఫోన్ లాక్కుంటుంది. జగతి మేడమ్ ఇంట్లో లేరు ఎప్పుడు వస్తారో ఎక్కడికి వెళ్లారో అసలు వస్తారో రారో కూడా తెలియదు ఇంకోసారి మీరు ఫోన్ చేయకండి అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది.