శౌర్యని చూడాలని దీప, కార్తీక్ చాలా ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారు. డాక్టర్ బాబు ఎక్కువ సేపు నాతోనే ఉంటున్నారు, మోనితని కొద్ది కొద్దిగా పట్టించుకోవడం మానేస్తున్నారు. సంతోషంగా ఉంది గతం గుర్తుకు రావాలి. శౌర్యని చూడగానే గతం గుర్తుకు రావాలి అని దీప ఆశపడుతుంది. చంద్రమ్మ, ఇంద్రుడు కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే వస్తాడు. జ్వాలమ్మ నీకు దూరం అయిపోతే ఏమై పొతావ్ అని ఇంద్రుడు అంటాడు. ఆ మాటకి చంద్రమ్మ ఎందుకు అలా అంటున్నావ్ నాదగ్గర ఏదో దాస్తున్నావ్ అని అంటుంది. జ్వాలమ్మ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు అని చంద్రమ్మ వెళ్ళిపోతుంది. జ్వాల కోసం కాసేపటిలో వాళ్ళు అక్కడికి వస్తారు నేను వెళ్లను నా బిడ్డని వాళ్ళకి అప్పగించను అని ఇంద్రుడు మనసులో అనుకుంటాడు.


కారులో శౌర్య కోసం వెళ్తు దీప చాలా సంతోషంగా ఉంటుంది. జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు చేసుకుని దీప ఎమోషనల్ అవుతుంది. ఆరోజే శౌర్య కనిపించినప్పుడే వెళ్తే దొరికేది కదా అని కార్తీక్ అంటాడు. మీరు కనిపించారు అప్పుడే ఇక మీ వెంట వచ్చాను అని దీప అంటుంది. నేను ఎక్కడికి వెళ్తాను వస్తాను కదా అని నోరు జారతాడు కానీ మళ్ళీ కవర్ చేసుకుంటాడు. కార్తీక్ మాటలు విన్న దీప డాక్టర్ బాబులో చిన్నగా మార్పు వస్తుంది.. ఈ మార్పు ఇలాగే కొనసాగి గతం గుర్తుకు రావాలి అని దీప దేవుడిని వేడుకుంటుంది. శౌర్య వంటలు జరిగే దగ్గరకి వచ్చి నిలబడి దీపని గుర్తు చేసుకుంటుంది. అమ్మ కూడా ఇలాగే వంటలు చేసుకుంటూ ఉంటుంది తనకి నేను సహాయం చేసేదాన్ని అని బాధపడుతుంది. వంటలు చేసే దగ్గర అమ్మ ఉంది నేను వెళ్ళాలి అని ఏడుస్తుంటే ఇంద్రుడు వచ్చి అక్కడ అమ్మ లేదమ్మా అని అంటాడు. అమ్మ కావాలి బాబాయ్, అమ్మని చూడాలని అనిపిస్తుందని శౌర్య ఏడుస్తుంది.


Also Read: రిషి కన్నీళ్లు చూసి కరిగిపోయిన వసు, ఈగో మాస్టర్ ముందు దేవయానిని బుక్ చేసిన వసుధార


శౌర్య బాధ చూసి ఇంద్రుడు తన మనసు మార్చుకుంటాడు. నువ్వు ఎడవకు నీ కళ్ళలో ఆనందం చూడాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోనిత ఇంట్లో అన్నీ పగలగొడుతూ ఆవేశంతో రగిలిపోతూ ఉంటే శివ వచ్చి ఆపుతాడు. ఏమైంది మేడమ్ అని అడుగుతాడు కానీ మోనిత పట్టించుకోకుండా దీపని తిడుతూ ఉంటుంది. నా కార్తీక్ ని వదలవా నిన్ను చంపేస్తాను అని గన్ తెచ్చి శివ తలకి గురి పెడుతుంది. నువ్వు ఏం చేసినా నిన్ను వదలనే వంటలక్క అనేసరికి శివ బతిమలాడుతూ ఉంటాడు. కార్తీక్, దీప ఇంద్రుడు చెప్పిన చోటుకి వచ్చి తనని వెతుకుతూ ఉంటారు. అక్కడ ఇంద్రుడు ఆటో లేకపోయేసరికి దీప కంగారుపడుతుంది.


అప్పుడే ఇంద్రుడు ఆటో వేసుకుని వస్తాడు. వెంటనే వాళ్ళని తీసుకుని బయల్దేరతాడు. అటు ఇంద్రుడు కోసం శౌర్య, చంద్రమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంద్రుడు శౌర్యతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటాడు. నిన్ను పంపించకూడదనే అనుకున్నా కానీ నువ్వు అమ్మానాన్న కోసం అలా ఏడుస్తుంటే చూసి భరించలేకపోయాను. బిడ్డ కనిపించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అదే బాధ మీ అమ్మానాన్న కి కూడా ఉంటుంది కదా. అందుకే మీ అమ్మానాన్నల్లో మమ్మల్ని చూసుకుని నిన్ను ఇచ్చేస్తున్నా అని ఇంద్రుడు ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ వాళ్ళు ఆటోని ఫాలో అవుతూ ఉంటారు. మనసు చంపుకుని నిన్ను మా దగ్గరే ఉంచుకున్నా నువ్వు అమ్మానాన్నల కోసం ఏడుస్తుంటే  చూసి తట్టుకోలేకపోతున్నా అని బాధపడతాడు.


Also Read: ఆదిత్య గుట్టు బయటపెట్టేందుకు రంగంలోకి దేవుడమ్మ- కన్నతండ్రి మీద ప్రేమ చూపించిన దేవి