Kaal Bhairav Ashtakam: చాలా శైవ క్షేత్రాల్లో కనిపించే విగ్రహం కాలభైరవుడు. ముఖ్యంగా కాశీ నగరంలోనే కాదు..చాలా దేవాలయాల్లో కాలభైరవుడు క్షేత్ర పాలకుడు. సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. సాక్షాత్తు శివుడే కాల భైరవుడై సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయన్ను పూజిస్తే కాలాన్ని మార్చలేకపోయినా..పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవచ్చని చెబుతారు. శనివారం,మంగళవారాలు కలభైరవుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు.  ఈ రోజుల్లో కాలభైరవుడిని పూజించినా కనీసం కాలభైరవాష్టకం పఠించినా అనారోగ్య బాధలు, అనవసర కలహాలు తొలగిపోతాయని చెబుతారు. 


Also Read:  ఈ రాశివారు దుష్టుల సహవాసానికి దూరంగా ఉండాలి, డిసెంబరు నెల రాశిఫలాలు


కాలభైరవ అష్టకం(Kalabhairava Ashtakam)
దేవరాజసేవ్యమానపావనాంఘ్రి పంకజం 
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం 
నారదాదియోగివృందవందితం దిగంబరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 || 


భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం 
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం 
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 || 


శూలటంకపాశదండపాణిమాదికారణం 
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం 
భీమవిక్రమం ప్రభుం  విచిత్రతాండవప్రియం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 || 


భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం 
భక్తవత్సలంస్థితం సమస్తలోక విగ్రహం 
వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 || 


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం 
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం 
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 || 


రత్నపాదుకా ప్రభాభిరామ పాద యుగ్మకం 
నిత్యమద్వితీయ మిష్ట దైవతం నిరంజనం 
మృత్యుదర్పనాశనం కరాళ దంష్ట్ర మోక్షణం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 || 


అట్టహాసభిన్నపద్మజాండకోశ సంతతిం 
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనం 
అష్టసిద్ధిదాయకంకపాలమాలికంధరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 || 


భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం 
కాశివాస లోకపుణ్యపాపశోధకం విభుం 
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 || 


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం 
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్య వర్ధనం 
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం 
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధృవం 


ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణం || 


Also Read: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు


కాలబైవుడిని అష్టభైరవ రూపాలలోనూ, 64 రూపాలలోనూ కొలిచే సంప్రదాయం కూడా ఉంది. చాలా శైవక్షేత్రాలలో, కాలభైరవుడే క్షేత్రపాలకునిగా ఉంటాడు. వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలలో… ఈ స్వామికి ఉన్న విశిష్టత అంతాఇంతా కాదు. శునకం వాహనంగా, నాగులు చెవిపోగులుగా, పులి చర్మం అంబరంగా కనిపించే ఈ భైరవుడు ఉగ్రమూర్తే కానీ… భక్తుల పాలిట శుభంకరుడు.  కాలభైరవుని పూజిస్తే రుణబాధలు, దారిద్ర్యబాధలు, అనారోగ్యం లాంటి సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం. కాలభైరవాష్టమి రోజు ఉపవాసం ఉండి రాత్రివేళ జాగారం చేస్తారు. కాలభైరవునికి అర్ధరాత్రి ఆరాధన అంటే ప్రీతి అని చెబుతారు. అందుకని కొన్ని క్షేత్రాలలో కాలభైరవుడిని రాత్రివేళ పూజిస్తారు. ఈ రోజున కాలభైరవుడు ఉన్న గుడికి వెళ్లి, అక్కడి స్వామిని నేతి దీపాలు వెలిగించి కలకండను నివేదిస్తే మంచి జరుగుతుందని విశ్వాసం.ఇవేమీ కుదరకపోతే కాలభైరవ స్తోత్రం చదువుకున్నా మంచిదే అంటారు.


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి