December 2022 Horoscope: డిసెంబరు నెలలో  తులా రాశి నుంచి మీన రాశివరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి...


మేషం నుంచి కన్యా రాశివరకూ డిసెంబరు నెల ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి....


తులా రాశి  (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈ నెల మీ గ్రహసంచారం బావుంది. అన్ని రంగాలవారికి ఈ నెల అనుకూల సమయం. ఆదాయానికి లోటుండదు..అనుకున్న పనులు చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ నెరవేరుతాయి. ప్రతివిషయంలోనూ ముందుంటారు. స్నేహితులకు సహాయ సహకారాలు అందిస్తారు. నమ్మినవారివలన మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త. సంగీతం,సాహిత్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది.


వృశ్చిక రాశి (విశాఖ 4 పాదాలు, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ నెల వృశ్చిక రాశివారికి పరిస్థితులు కొంతవరకూ కలిసొస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఏడో స్థానంలో కుజుడి సంచారం వల్ల కోపం అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఉద్రేక పడతారు. చికాకు కలిగించే సంఘటనలు జరుగుతాయి. తీరికలేనంత బీజీగా ఉంటారు. రాని బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రులతో వివాదసూచనలున్నాయి. దుష్టుల సావాసం పెరుగుతుంది. 


ధనస్సు రాశి  (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ధనస్సు రాశివారికి డిసెంబరు నెల మిశ్రమ ఫలితాలున్నాయి.ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం బావుంటుంది. రవి సంచారం ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు...అయినప్పటికీ ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. నమ్మినవారే మోసం చేస్తారు. అనుకోని ప్రమాదం పొంచిఉంది జాగ్రత్తపడండి. 


Also Read: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు


మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
డిసెంబరు నెల మకర రాశివారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేస్తారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.  ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు.గతంలో మధ్యవర్తిత్వం వహించిన విషయాల్లో ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.


కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఈ నెల కుంభరాశివారికి బాగానే ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడతారు. సమస్యలుతొలగి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దేనికీ లోటుండదు..ఆర్థిక పరిస్థితి బావుంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులు,స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది.


మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదాం, ఉత్తరాభాద్ర, రేవతి)
డిసెంబరు నెల  మీన రాశివారికి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనుల్లో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గత నెలతో పోల్చుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అడుగువేస్తారు. కోపం తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.  కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండండి. కొన్ని పనులు స్నేహితుల నుంచి సహాయ సహకారంతో పూర్తవుతాయి.


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి