Weekly Horoscope 27 November to 3rd December 2022: నవంబరు 27 నుంచి డిసెంబరు 3 వరకూ మేషం రాశి నుంచి కన్యారాశి వరకూ వారఫలాలు ఇక్కడ తెలుసుకోండి...
మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ వారం మేషరాశివారికి మంచి ఫలితాలున్నాయి. అనుకున్నపనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులుకు శుభసమయం. వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. పెండింగ్ లో ఉన్న మొత్తం అనుకోకుండా చేతికందుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థికపరిస్థితి బావున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటిరి రెండుసార్లు ఆలోచించండి...ఓనిర్ణయం తీసుకున్నాక స్థిరంగా దానిపైనే ఉండండి. కోపం తగ్గించుకుంటే మంచిది. అవనసర మొహమాటం ప్రదర్శంచవద్దు
వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఈ వారం మీరు ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా అధిగమించి పనులు పూర్తిచేస్తారు. చిన్న చిన్న విషయాలకే కుంగిపోవద్దు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. తీసుకున్న అప్పులు చెల్లించగలుగుతారు. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు....ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి
Also Read: మరణం సమీపించే ముందు సంకేతాలివే, స్వయంగా శివుడు పార్వతికి చెప్పినవి!
మిథున రాశి (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఉద్యోగులు, వ్యాపారుల శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అప్పులబాధలు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం. శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి వారం ఆరంభంలో కొంత అటు ఇటుగా ఉన్నా రాను రాను పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువులతో వివాద సూచనలున్నాయి జాగ్రత్త. స్తిరాస్థులు, వాహనం కొనుగోలు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకునేందుకు అనువైన సమయం ఇది.
కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ వారం కర్కాటక రాశివారికి కలిసొస్తుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవడంలో బిజీగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..కొత్తగా వేసే అడుగులు మంచి ఫలితాన్నిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు రావొచ్చు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)
ఈ వారం సింహ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకుండా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. అధిక ఒత్తిడికి గురికాకుండా పనులు పూర్తిచేసుకోవాలి. వ్యాపారులు లాభాలు పొందుతారు...నూతన పెట్టుబడులకు అనుకూలం. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొద్దిగా అనుకోని ఖర్చులుంటాయి...మానసికంగా ఏదో ఆందోళన ఉంటుంది.
Also Read: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు
కన్యా రాశి (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఈ వారం ఈ రాశివారు చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలున్నా పట్టుదలగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకునేందుకు ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొన్ని రోజులుగా వెంటాడుతున్న సమస్యలు తీరిపోయి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా మీరు పరిష్కరించగలగుతారు.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి