లాస్య ఇల్లు తన పేరు మీద రాయించుకున్న పేపర్స్ తీసుకొచ్చి నందు చేతిలో పెడుతుంది. అవి చూసి షాక్ అవుతుంది. ఈ ఇంటిని తులసి తన పేరు మీద స్వచ్చందంగా సైన్ చేసి ఇచ్చినట్టు ఉన్న డాక్యుమెంట్స్ అని లాస్య చెప్పి అందరికీ షాక్ ఇస్తుంది.


తులసి: అది నేను అత్తయ్య పేరు మీదకి కదా రాసింది


లాస్య: అని నువ్వు అనుకున్నావ్ చెబితే నమ్మేశావ్ డాక్యుమెంట్ చదవలేదు కదా మీ ఎమోషన్స్ తో నేను ఆడుకున్నా


అనసూయ: ఇది అన్యాయం


లాస్య: నేను ఎవరిని చీట్ చెయ్యలేదు నా జాగ్రత్తలో నేను ఉన్నా, నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ నువ్వెప్పుడు నా వాడిగా నేను ఫీల్ అవలేకపోయాను, అందుకే తెలివిగా ఈ ఇంటిని నా పేరు మీదకి రాయించేసుకున్నా. సోరి నందు ఈ ఇల్లు నాది అవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఇంతక ముందు తులసి ఇంట్లో ఉన్నారు ఇప్పుడు నా ఇంట్లో ఉంటున్నారు అంతే కాకపోతే అందరూ నేను చెప్పింది వినాలి, నేనే ఈ ఇంటి గృహలక్ష్మిని


తులసి: సిగ్గు లేకపోతే సరి మోసం చేసి ఇల్లు రాయించుకున్నాదే కాక మాట్లాడుతున్నావ్ ప్రేమగా అడుక్కోవాల్సింది భిక్షగా వేసేదాన్ని. దొంగతనం చేయడం నీ స్వభావం అది మొగుడు అయినా సరే ఇల్లు అయినా సరే


లాస్య: నేను నా మొగుడ్ని ప్రేమిస్తున్నా


Also read: యాక్సిడెంట్ టైమ్ లో మాళవిక తనతోనే ఉందని అబద్ధం చెప్పిన యష్- ప్రశ్నలతో ఆటాడుకున్న ఝాన్సీ


తులసి: నిజంగా ప్రేమిస్తే ఇలా చెయ్యవు, నీలో నిజాయితీ ఉంటే నందగోపాల్ గారితో కలిసి ఈ ఇంటిని గుడిగా మార్చేదానివి


లాస్య: నా సెక్యూరిటీ కోసం నేను చేశాను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. మీరంతా నా వాళ్ళు


నందు: ఛీ ఎప్పుడైతే నువ్వు మా అమ్మానాన్నని అవమానించావో అప్పుడే పరాయి దానివి అయ్యావు


లాస్య: మీరందరూ ఇంట్లోకి రావొచ్చు లేదు తులసితో ఉంటామని అంటే మీ ఇష్టం


శ్రుతి, దివ్య, అంకిత అందరూ తులసి దగ్గరే ఉంటామని చెప్పేస్తారు. నా వాళ్ళని తీసుకుని వెళ్లిపోతాను ఏమంటారు అని తులసి అడుగుతుంది. ఎవరు ఎక్కడికి వెళ్లొద్దు పరిస్థితులు నేను సరి చేస్తాను నా పేరెంట్స్, నా పిల్లలు నాకు కావాలి అని నందు బతిమలాడతాడు. తులసి నువ్వు చెప్పు చెప్తే వింటారని నందు అడుగుతాడు. ఇంత జరిగినా కూడా మీ అబ్బాయి మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవడం లేదు, ఇప్పుడు మీరు కాదంటే మీ అబ్బాయి గుండె ముక్కలు అవుతుంది అని తులసి చెప్తుంది. ఆమాటకి ప్రేమ్, అంకిత, దివ్య అందరూ ఇంట్లోకి వెళ్లిపోతారు. తులసి దణ్ణం పెట్టి బయటకి వెళ్ళిపోతుంది. పరంధామయ్య బాధగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు.


Also Read: లాస్య నిజస్వరూపం తెలుసుకున్న నందు- పరంధామయ్యని ఇంటికి తీసుకొచ్చిన సామ్రాట్


తులసి సామ్రాట్ వెళ్లిపోతారు. నందు బిహేవియర్ లో మార్పు వచ్చిందని ఇద్దరు అనుకుంటారు. ఇక నుంచి అయినా మీ గురించి ఆలోచించుకోండి అని సామ్రాట్ తులసితో అంటాడు. ఇద్దరూ కారులో వెళ్తుండగా అది చెడిపోతుంది. తులసి, సామ్రాట్ ఇద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా పాటలు వినిపిస్తాయి. అవి వింటూ తెగ ఓవర్ యాక్షన్ చేసేస్తారు. రోడ్డు మీద నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. 


తరువాయి భాగంలో..


అనసూయ పరంధామయ్యని బతిమలాడుతుంది కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే అనసూయ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే తులసి ఇంటికి వస్తుంది. ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండమని అనసూయ తులసిని కోరుతుంది.