జరిగిన దానికి తులసిని దోషిని చేయాలని లాస్య ట్రై చేస్తుంది. మావయ్య పుట్టినరోజు నాడు కావాలని అందరినీ ఇంటికి రప్పించుకుని అత్తయ్యని రెచ్చగొట్టేలా చేశావ్ నీవల్ల తను బలి పశువైంది అని లాస్య నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలకి తులసి లాస్యకి గట్టిగానే కౌంటర్ వేస్తుంది. జరిగిన దాన్ని నీకు అనుకూలంగా నాకు వ్యతిరేకంగా బాగానే చెప్తున్నావ్ నీలో మంచి రచయిత్రి ఉంది, మంచిగా కథ అల్లావ్ అని అంటుంది. లోకంలో ఏది జరిగినా దానికి కారణం నన్నే చూపిస్తావ్ లె అని అంటుంది. అత్తయ్య, మావయ్య మధ్య జరిగిన గొడవకి కారణం నువ్వే అని తులసిని లాస్య అంటుంటే అబద్ధం చెప్పకు దీనికి కారణం తను కాదని అనసూయ చెప్తుంది.


అనసూయ: మీ నాన్న ఇంటికి రాకపోవడంలో తులసి ప్రమేయం ఏమి లేదు తప్పంతా నాదే


నందు: నీ తప్పు నువ్వు తెలుసుకున్నావ్, ఆ తప్పు సరి చేయాల్సిన బాధ్యత కూడా నీదే, నాన్నని ఇంటికి తీసుకురావాల్సింది నువ్వే


అనసూయ: ఆయన రానని మొండికేస్తే


నందు: నాకు వాటితో సంబంధం లేదు నువ్వే దగ్గర ఉండి నాన్నని తిరిగి తీసుకురావాలి


తులసి: మావయ్య కోపం మామూలుగా లేదు మొండిగా ఉన్నారు, ఆయనకి కొద్దిగా సమయం ఇస్తే కోపం తగ్గిపోతుంది. అప్పుడు మీరు పిల్లలు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్లవచ్చు


Also Read: నిజం తెలిసి గౌతమ్ ని ఛీ కొట్టిన రిషి- దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర


లాస్య: సమయం ఇస్తే మావయ్య మనసులో విషం నింపి మరింత దూరం చేద్దామని చూస్తున్నావా, అర్థం అవుతోందా నందు తియ్యగా మాట్లాడుతూనే మన వెనుక గోతులు తవ్వుతుంది


నందు: షటప్ లాస్య.. అక్కడ పుట్టినరోజు సంబరాలు జరుగుతుంటే అమ్మ గొడవ చేస్తుంటే ఎందుకు తనని కన్వీన్స్ చేసి ఆపలేదు నీసంగతి నాకు బాగా తెలుసు గొడవలు అవుతుంటే ఆపవు ఎందుకంటే అందరూ ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదు అందుకే గొడవ జరగడానికి మరింత ఆజ్యం పోసి ఉంటావ్ అప్పుడే నీకు ప్రశాంతంగా ఉంటావ్. నాకు మీ మాటలు ఏమి వద్దు మా నాన్న మాత్రమే రావడం కావాలి. మా నాన్న ఇంటికి వచ్చేవరకి నీకు కొడుకు ఉన్నాడని మర్చిపో, మా నాన్నని ఇంటికి తీసుకొచ్చే వరకి ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదమ్మా అని తలుపులు మూసేయడానికి చూస్తాడు. కానీ తులసి తలుపులు వెయ్యకుండా అడ్డుకునేందుకు ట్రై చేస్తుంది.


తులసి: తండ్రి మీద మీకు ఉన్న ప్రేమ అమ్మని అవమానించేలా చెయ్యొద్దు, తల్లిని చేసిన తప్పు క్షమించండి. అత్తయ్య మొహం మీద తలుపులు వేయడానికి వీల్లేదు. మొహం మీద తలుపు వేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు దయచేసి తలుపులు ముయ్యకండి


నందు: చివరిసారి చెప్తున్న చేతులు తియ్యి


సామ్రాట్ పరంధామయ్యని తులసి నిలయంకి తీసుకుని వస్తాడు. ఆయన్ని చూసి నందు తలుపులు తీసి తండ్రి దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకుని ఎమోషనల్ అవుతాడు. లోపలికి రమ్మని నందు అడుగుతాడు. కానీ పరంధామయ్య మాత్రం రావడానికి ఒప్పుకోడు. ఇక్కడిదాకా వచ్చింది లోపలికి తిరిగి రావడానికి కాదు ఈ ఇల్లు ఇప్పటికే చాలా పోగొట్టుకుంది, ఇకనైనా ఉన్నవి జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పడానికి వచ్చాను. నువ్వు ముక్కలైన నా బంధాన్ని ఒక దగ్గరకి చేర్చుకో, నేను ముక్కలైన గౌరవాన్ని దగ్గరకి చేర్చుకోవడానికి ట్రై చేస్తాను అని పరంధామయ్య అంటాడు. తప్పులు దిద్దుకోవడానికి అవకాశం ఇవ్వమని నందు బతిమలాడతాడు. లోపలికి రమ్మని కన్నీటితో వేడుకుంటాడు. అనసూయ వెళ్ళి ఏడుస్తూ కాళ్ళ మీద పడబోతుంటే వెనక్కి జరుగుతాడు. లాస్య రెచ్చగొట్టేసరికి మనసు అదుపు తప్పింది, తులసి మీద చాడీలు చెప్తూ నన్ను రెచ్చగొట్టింది దాంతో మంచి చెడు మర్చిపోయి ప్రవర్తించాను అని అనసూయ అంటుంది. తప్పు మీరు చేసి నామీద వేస్తున్నారు ఏంటి మర్యాదగా ఉండమని అనసూయని అంటుంది. ఆ మాటకి నందు లాస్య మీద అరుస్తాడు.


Also read: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ


నువ్వు ఈ ఇంటి కోడలివి తులసి కాదు అమ్మ దగ్గర ఉంది నువ్వు కానీ తులసి కాదు, తను ఆవేశంలో ఉన్నప్పుడు ఆపాల్సింది నువ్వు తులసి కాదు అని అరుస్తాడు. ఈ ఇల్లు ఇలా అవడానికి కారణం తులసి, సామ్రాట్ అని మళ్ళీ రెచ్చగొట్టేందుకు చూస్తుంది. కానీ నందు మాత్రం లాస్యని ఏకిపారేస్తాడు. నీకు నా వాళ్ళు పడరని అర్థం అయ్యింది ఇష్టం లేని వాళ్ళతో కలిసి ఉండటం ఎందుకు వెళ్లిపోదాం పద కనీసం వాళ్ళు అయినా ప్రశాంతంగా ఉంటారని నందు కోపంగా అనేసరికి లాస్య షాక్ అవుతుంది. మీరందరూ నన్ను పరాయిదాన్ని చేస్తారని నాకు తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నా అని ఇల్లు రాయించుకున్న పేపర్స్ తీసుకొచ్చి నందు చేతిలో పెడుతుంది. అవి చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు.