Indira Ekadashi 2024 Significance:  ఏటా ఆశ్వీయుజమాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది ఇందిరా ఏకాదశి సెప్టెంబరు 28 శనివారం వచ్చింది. పితృ పక్షంలో వచ్చే ఏకాదశి కాబాట్టి..దీనికి మరింత ప్రాముఖ్యత ఉందంటారు పండితులు. ఈ రోజు ఉపవాసం ఉండి పితృదేవతలను, శ్రీ మహావిష్ణువును పూజిస్తే కుటుంబంలో కలతలు మాయమవుతాయని..పెద్దల ఆశీర్వచనం ఉంటుందని చెబుతారు. 


Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!
 
పితృ పక్షాల్లో వచ్చే ఈ ఏకాదశికి నియమాలు పాటిస్తే మోక్షానికి మార్గం సుగమం అవుతుందని విశ్వాసం.  


శుభ ముహుర్తం..



  • ఇందిరా ఏకాదశి తిథి ప్రారంభం : సెప్టెంబరు 27 శుక్రవారం సాయంత్రం 4 గంటల 17 నిముషాలకు

  • ఏకాదశి తిథి ముగింపు :  సెప్టెంబరు 28 శనివారం సాయంత్రం 4 గంటల 40 నిముషాల వరకు

  • ద్వాదశి తిథి : సెప్టెంబరు 28 శనివారం సాయంత్రం 4 గంటల 41 నిముషాల నుంచి సెప్టెంబరు 29 ఆదివారం  సాయంత్రం 5 గంటల 36 నిముషాల వరకు.


ఏకాదశి తిథి సూర్యోదయానికి ఉండడమే ప్రధానం..అందుకే సెప్టెంబరు 28 శనివారం ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఏకాదశి వ్రతం చేసేవారు దశమి ఘడియలు ఉన్నప్పటి నుంచీ నియమాలు పాటించడం ప్రారంభించి...ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాత ఉపవాసం విరమించి దాన ధర్మాలు చేసి ఆహారం తీసుకోవాలి.  


Also Read: వేంకటేశ్వరుడికి శనివారం ప్రత్యేకం కదా.. మరి తిరుమలలో అభిషేకం శుక్రవారం ఎందుకు!


ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి..పితృదేవతలకు ఆ పుణ్యాన్ని ధారపోస్తే వారికి మోక్షం లభిస్తుందని పురాణాల్లో ఉంది. ఈ రోజు పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణాలు విడిచేవారు, శ్రాద్ధ కర్మలు నిర్వహించేవారికి పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.


ఈ ఉపవాస విధానాన్ని స్వయంగా నారద మహర్షి ఇంద్రుడికి వివరించాడు.  ఇంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన పితృదేవతలకు చెడుకర్మలనుంచి విముక్తి కల్పించి మోక్షానికి చేరువ చేశాడని పురాణ కథనం. 


ఏకాదశికి ఓరోజు ముందు... దశమి రోజు ఒకపూట భోజనం చేసి నేలపై నిద్రించాలి. ఏకాదశి ఉపవాసం ఉండి..అపరాన్న వేళలో పితృదేవతలకు తర్పణాలు విడవాలి. అనంతరం బ్రాహ్మణుడికి బోజనం పెట్టి..దాన ధర్మాలు చేయాలి. గోమాత సేవ చేయాలి.  


పితృ దోషాలు వెంటాడే ఇంట్లో మనశ్సాంతి ఉండదు. నిత్యం లేనిపోని తగాదాలు జరుగుతుంటాయి. పిల్లలు లేకపోవడం, పుట్టిన పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడడం లాంటి సమస్యలుంటాయి. వీటినుంచి విముక్తికోసమే పితృదేవతర ఆరాధన చేయాలి


Also Read: ముస్లిం భక్తుడు సమర్పించిన బంగారు పూలతోనే దశాబ్ధాలుగా శ్రీవారికి అష్టదళ పద్మారాధన సేవ!


ఇందిరా ఏకాదశి రోజు వేకువజామునే స్నానమాచరించి..భగవంతుడి ముందు దీపం వెలిగింది విష్ణు సహస్రనామం, భగవద్గీత చదవడం లేదంటే వినడం చేయాలి. బ్రహ్మదేవుడు సూచించిన స్తుతి చదువుకోవాలి. సాయంత్రం వేళ తులసిమొక్క దగ్గర నేతితో దీపం వెలిగించి నమస్కరించాలి.  
 
ఓం నమో నారాయాణాయ


ఓం నమో భాగవత వాసుదేవాయ నమః


 ఓం నారాయణాయ విద్మహే 
వాసుదేవాయ ధీమహి 
తన్నో విష్ణు ప్రచోదయాత్


ఈ శ్లోకాలతో పాటూ విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి..మీరు చేపట్టే పనుల్లో విజయం మీ సొంతమవుతుంది...


Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!