జూన్ 23 గురువారం రాశిఫలాలు (Horoscope Today 23-06-2022)
మేషం
ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, బదిలీ కానీ ఉండొచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.మీరు ప్లాన్ చేసుకున్నట్టే పనులన్నీ పూర్తవుతాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. వివాహసంబంధమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే మంచిసమయం. గృహావసరాలు కొనుగోలు చేస్తారు. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించేందుకు సందేహించకండి.
వృషభం
స్నేహితుల సహాయంలో సక్సెస్ అందుకుంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్త. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని విమర్శలు ఎదుర్కోకతప్పదు. ఆరోగ్యం అంత బాగోదు. టైమ్ కి పనులు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోండి.
మిథునం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. పూర్వీకుల నుంచి వస్తోన్న సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన రోజు. మీ నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉంటారు. మీపనిలో నైపుణ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యాన్ని ఆశ్రద్ధ చేయవద్దు.
Also Read: వృషభ రాశిలోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారికి అస్సలు బాలేదు
కర్కాటకం
ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. తెలియని విషయాల్లో, వ్యవహారాల్లో వేలు పెట్టొద్దు. ఓ పెద్ద ఒప్పందంలో భాగం అవుతారు. ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.
సింహం
ఒకరిని మోసం చేసే ఆలోచన చేయకండి. వ్యాపారులకు లాభాలు తగ్గొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవలడం నేర్చుకోండి. ఆరోగ్యం అంతబావోదు. శ్రద్ధగా పనిచేస్తేనే సక్సెస్ అవుతారు. మీ కోపం కారణంగా నష్టపోతారు.
కన్య
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఏ పనీ చేయకపోవడం వల్ల చికాకుగా ఉంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పనికిరాని పనులకోసం టైం వేస్టే చేసుకోకండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. తప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తులకు దూరంగా ఉండాలి. సోమరితనం వీడండి.
తులా
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. క్షేత్రస్థాయి పురోగతిపై ఉత్సాహంగా ఉంటారు. మీ శక్తి, సామర్థ్యాలను మీరు నమ్మండి. ప్రేమ వివాహాలకు కుటుంబాల నంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు.
Also Read: ఒకే రాశిలో బుధుడు-శుక్రుడు, ఈ 4 రాశులవారికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది
వృశ్చికం
ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ పూర్తిచేయడం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్త పనులు మొదలెట్టేందుకు ఇదే మంచిరోజు. మంచి వ్యక్తుల మధ్య ఉన్నట్టు భావిస్తారు. ఆదాయవనరులు పెరుగుతాయి. మీపై చాలా పని ఒత్తిడి ఉంటుంది. పిల్ల పురోగతి మీకు సంతోషాన్నిస్తుంది. కళారంగానికి చెందిన వ్యక్తులకు గౌరవం పెరుగుతుంది.
ధనుస్సు
ఆఫీసు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ వ్యక్తిగత విషయాలను పబ్లిక్ చేయకండి. అవసరం అయిన పనులు పెండింగ్ పెట్టొద్దు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రం
మకరం
ఏ పని పూర్తి చేయకపోవడం వల్ల ప్రతికూలత ఉంటుంది. లావాదేవీల పరంగా నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరితోనైనా వివాదం రావొచ్చు. క్రయవిక్రయాల్లో గందరగోళం నెలకొంటుంది. భర్తతో వాగ్వాదం ఉంటుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
కుంభం
భూమి లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు మీకు ఇదే మంచి సమయం. మీ టైమ్ చాలాబావుంది. మీ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. వ్యాపారంలో లాభాలుంటాయి. మీ పని మీద నమ్మకం ఉంచినప్పుడే మీ ప్రత్యర్థిపై విజయం సాధిస్తారు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి.
మీనం
వ్యాపారంలో లాభపడతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఎవరితోనూ వ్యర్థంగా వాదించవద్దు. పిల్లల పురోగతిని చూసి ఉత్సాహంగా ఉంటారు. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట్లో ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి.
Also Read: ఆరుద్ర కార్తెలో వచ్చే ఎర్రటి పురుగులకు-వానలకు ఏంటి సంబంధం!