Crime News :  ఆంధ్రాకు చెందిన ఓ అబ్బాయి మంచి ఉద్యోగంలో సెటిలైపోయానని పెళ్లి చేసుకుందామని తల ఎత్తి చూసేసరికి 30 ఏళ్లు దాటిపోయాయి. తల్లిదండ్రులు బంధువుల్లో ఎంత మందిని సంప్రదించినా పిల్ల దొరకలేదు. దీంతో మ్యాట్రిమొని సైట్‌లో చూసి స్వప్న అనే అమ్మాయిని సెలక్ట్ చేసుకున్నారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా అయినా వెనక్కి తగ్గలేదు. ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కాపురానికి బెంగళూరు తీసుకెళ్లాడు.  అయితే ఆమె ఎప్పుడూ ఫోన్లలో మాట్లాడుతూనే ఉండేది. ఒక్కోసారి కోర్టు విషయాలు ఎక్కువగా మాట్లాడుతూంటేది. తరచూ హైదరాబాద్ వెళ్లి వస్తూండేది. దీంతో ఆ భర్తకు ఎక్కడో అనుమానం వచ్చింది. మొత్తంగా ఆరా తీశాడు.


తొమ్మిదో పెళ్లితో గుట్టు రట్టు 


మహబూబా బాద్ నుంచి ప్రారంభించి అలా తీస్తూ పోతే.. ఒకటి..రెండు.. మూడు అని లెక్కలేస్తూనే ఉన్నాడు. మొత్తంగా తన వంతు వచ్చే సిరికి తొమ్మిది అని తేలింది. అంటే.. తను తొమ్మిదో భర్త అన్నమాట. స్వప్న ఇంతకు ముందు ఎనిమిది మందిని పెళ్లి చేసుకుందని తెలిసింది. అలా తెలుసుకోవడంతోనే ఆగిపోలేదు..పెళ్లికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించాడు. అన్నీ దగ్గర పెట్టుకుని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ముందు వాలిపోయాడు. తన భార్య తనను మోసం చేసిందని.. తన కంటే ముందే ఎనిమిది మందిని మోసం చేసి పెళ్లి చేసుకుందని ఫిర్యాదు చేశాడు. ఆ ఎనిమిది పెళ్లిళ్ల ఫోటోలు.. ఆధారాలు కూడా సమర్పించాడు.


మొత్తం వివరాలు తెలుసుకుని షాకయ్యానంటున్న వరుడు 


స్వప్న వివరాలు మొత్తం బయటకు లాగిన తర్వతా  షాక్ కు గురయ్యానని అంటున్నాడు. .ఆమె చేసుకున్న పెళ్ళి తతంగాలు అంతా ఇంతా కాదని ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకుని తొమ్మిదో పెళ్ళికి తాను బుక్కయ్యానని తెలుసుకుని విడాకులు కావాలని కోరుతున్నాడు. తనకు అన్ని విషయాలు తెలిసిపోయాయని తెలిసి ఇప్పుడామె తనను హరాస్ చేస్తోందని ఆ భర్త వాపోతున్నాడు. గతంలో పెళ్లిళ్లు చేసుకున్న వారిపైనా ఇలాగే టార్చర్ చేసిందని కొంత మంది చనిపోయారంటున్నాడు. 


వేధిస్తున్నాడని రివర్స్‌లో  స్వప్న ఫిర్యాదు


అయితే స్వప్న తనపై తొమ్మిదో భర్త ఫిర్యాదు చేసిందని తెలియగానే ఆమె కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తన భర్త తనను వేధిస్తున్నాడని గృహహింస కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకపోతే ధర్నా చేస్తాని హెచ్చరించింది. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. ఇప్పుడీ కేసు పోలీసులుకు పెద్దపజిల్‌గా మారింది. తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న స్వప్ను అరెస్ట్ చేయాలా... లేక వేధిస్తున్నాడని కేసు పెట్టినందున ఆమె భర్తను అరెస్ట్ చేయాలా అన్నది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు.