ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఫలితాలు విడుదల చేశారు. ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెగ్యూలర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ ఫలితాలను మంత్రి విడుదల చేయగా.. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 50 శాతం మంది పాస్ అయినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.


ఫస్టియర్‌లో 54 శాతం, సెకండియర్‌లో 61 శాతం
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. ఇంటర్‌ ఫస్టియర్​ 4,45,604 మంది రాయగా 2,41,591 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్​లో 4,23,455 మంది పరీక్షకు హాజరుకాగా, 2,58,446 మంది విద్యార్థులు పాసయ్యారు.  ఏపీ ఇంటర్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల పరిస్థితులతో ఇంటర్ రిజల్ట్స్ విషయంలో ఏపీ సర్కార్ జాగ్రత్త తీసుకుంది. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/  వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి బొత్స సూచించారు.


ఏపీ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://telugu.abplive.com/exam-results/ap-board-result-62b2b1aa8d556.html/amp


ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html/amp


ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html/amp


ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-intermediate-first-year-vocational-result-62b2b8e1b5a02.html/amp


ఏపీ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-2nd-year-vocational-result-62b2b9fd5344a.html/amp


ఓవరాల్‌గా ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు శాతాల్లో
అత్యధిక ఉత్తీర్ణత శాతం - ఉమ్మడి కృష్ణా జిల్లా 72 శాతం
అత్యల్ప ఉత్తీర్ణత శాతం - ఉమ్మడి కడప జిల్లా 50 శాతం
బాలుర అత్యధిక ఉత్తీర్ణత శాతం - ఉమ్మడి కృష్ణా జిల్లా 66 శాతం
బాలుర అత్యల్ప ఉత్తీర్ణత శాతం - ఉమ్మడి కడప జిల్లా 34 శాతం
బాలికల అత్యధిక ఉత్తీర్ణత శాతం - ఉమ్మడి కృష్ణా జిల్లా 72 శాతం
బాలికల అత్యల్ప ఉత్తీర్ణత శాతం - ఉమ్మడి కడప జిల్లా 47 శాతం


జూన్ 25వ తేదీ నుంచి జులై 5 వరకు రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 3 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.


ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి


ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి