Stock Market Opening Bell 22 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. అమెరికా, ఐరోపా దేశాలు మాంద్యం వైపు పయనిస్తుండటం, సరఫరా కొరత, ధర పెరుగుదలతో బెంచ్‌ మార్క్‌ సూచీలు పతనం అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 132 పాయింట్ల నష్టంతో 15,506, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 381 పాయింట్ల నష్టంతో 52,150 వద్ద ఉన్నాయి. ఆరంభంలోనైతే సెన్సెక్స్‌ ఏకంగా 520 పాయింట్ల మేర పతనమైంది.


BSE Sensex


క్రితం సెషన్లో 52,532  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,186 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 51,879 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,272 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 381 పాయింట్ల నష్టంతో 52,150 వద్ద కదలాడుతోంది. ఎర్లీ ట్రేడ్‌లో సూచీ 520 పాయింట్ల మేర నష్టపోవడం గమనార్హం.


NSE Nifty


మంగళవారం 15,638 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,545 వద్ద ఓపెనైంది. 15,426 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,565 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 132 పాయింట్ల నష్టంతో 15,506 వద్ద చలిస్తోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ నష్టాల్లో ఉంది. ఉదయం 33,051 వద్ద మొదలైంది. 32,761 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,106 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 230 పాయింట్ల నష్టంతో 32,961 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ఉన్నాయి. హీరోమోటో, టీసీఎస్‌, బజాజ్‌ ఆటో, మారుతీ, బీపీసీఎల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, యూపీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు పతనం అవుతున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్, హెల్త్‌కేర్‌, రియాల్టీ, ఫార్మా, మీడియా సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. మెటల్‌ అయితే ఏకంగా 3.64 శాతం పతనమైంది.