జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలయికను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. జూన్ 1నుంచి బుధుడు వృషభరాశిలో సంచరిస్తుండగా ఇప్పుడు శుక్రుడు కూడా అదే రాశిలో వచ్చి చేరాడు. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల అన్నిరాశులపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. ప్రస్తుతం బుధుడు వృషభరాశిలో ఉన్నాడు. జూన్ 1 న వృషభరాశిలో అడుగుపెట్టిన బుధుడు ఈ నెలాఖరు వరకూ అదే రాశిలో ఉంటాడు. జూన్ 18 శనివారం రోజున శుక్రుడు కూడా ఇదే రాశిలో చేరాడు..జూలై 12 వరకూ ఇదే రాశిలో ఉండనున్నాడు. అంటే ఈ నెలాఖరు వరకూ బుధుడు-శుక్రుడు ఒకే రాశిలో కలసి ఉంటారు. జ్యోతిష్యశాస్త్రం  ప్రకారం ఈ రెండు గ్రహాల కలయిక వల్ల 4 రాశులవారికి పూర్తిస్థాయి అనుకూల ఫలితాలనిస్తున్నాయి. 


Also Read: ఫెంగ్ షుయ్‌ ప్రకారం ఈ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుదట


ఒకే రాశిలో బుధుడు-శుక్రుడు సంచారం ఏ రాశులవారికి అదృష్టం అంటే..
మేషం (Aries)
బుధ-శుక్ర సంచారం ఈ రాశివారికి ఉత్తమ ఫలితాలనిస్తుంది. ఆర్థికంగా మరో మెట్టు పైకెక్కుతారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆదాయాన్ని పొందే మార్గాలు మరిన్ని కనిపిస్తాయి. 


కన్య (Virgo)
ఎప్పటి నుంచో వెంటాడుతున్న కుటంబ సమస్యలు పరిష్కారమవుతాయి. అనారోగ్య సమస్యలు, చికాకులు తగ్గి ఆనందంగా ఉంటారు. తలపెట్టిన ప్రతిపనీ పూర్తవుతుంది. పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి శుభసమయం. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.


వృశ్చికం (Scorpio)
ఏలినాటి శని కష్టాల నుంచి బయట పడిన వృశ్చికరాశివారికి గడిచిన నాలుగైదు ఏళ్లతో పోలిస్తే గడిచిన ఉగాది నుంచి మంచి రోజులు మొదలయ్యాయి. అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటి తీరుతున్నాయి, ఆర్థిక పరిస్థితి మెరుగపడుతోంది. స్థిరాస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు మంచి రోజు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.


కుంభం (Aquarius)
కుంభ రాశివారికి దాదాపు 15 రోజుల పాటూ అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం బావుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. గతంలో కన్నా ఖర్చులు తగ్గుతాయి. ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. 


Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి