జూన్ 19 ఆదివారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 19- 06 - 2022వారం:  ఆదివారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం

తిథి  :  పంచమి  ఆదివారం ఉదయం 5.58 వరకు తదుపరి షష్ఠి రాత్రి తెల్లవారు జామున 3.58 వారం : ఆదివారం నక్షత్రం:  ధనిష్ఠ మధ్యాహ్నం 1.03 వరకు తదుపరి శతభిషంవర్జ్యం : సాయంత్రం 6.41 నుంచి 8.13 వరకు దుర్ముహూర్తం : సాయంత్రం 4.48 నుంచి 5.41 వరకుఅమృతఘడియలు  : తెల్లవారుజామున 4.37 నుంచి సూర్యోదయం వరకు  సూర్యోదయం: 05:30సూర్యాస్తమయం : 06:32

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: అర్థరాత్రి వేణుగానం, గజ్జెల శబ్దాలు…ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతుచిక్కని రహస్యం..ఆ ఆలయంలో చీకటి పడ్డాక ఏం జరుగుతుంది..!

ఆదివారం సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు సూర్యుడిని ప్రార్థించినా, పూజించినా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకోసం సూర్య నారాయణ దండంకం.

శ్రీ సూర్య నారాయణ దండకం (Surya Dandakam)

శ్రీ సూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||ఆత్మరక్షా నమః పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తానమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథామహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా ||

సూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రామహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్యదుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సారగంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి ఏకాకినై చిక్కిఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి ||సూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||

జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు వేగన్మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశుసారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగమార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారాగ్రదోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో ||సూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||

దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీకశూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింపనేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మభేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతుఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంతనెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదునీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా ||సూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||

శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించివిన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవానమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః ||

Also Read : ఉప్పుతో వాస్తు దోషాలను తొలగించవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?