మేషం
వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. సమీప ప్రదేశాలు సందర్శిస్తారు. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వివాదాలను ప్రోత్సహించవద్దు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. యువకుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
వృషభం
ఈరోజు కొన్ని పనుల్లో నష్టపోవచ్చు. శత్రువులు చురుకుగా ఉంటారు. కుటుంబంలో కలహాలు రావచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలుంటాయి. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, అమ్మడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు. వ్యాపారం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. స్నేహితుల మద్దతు పొందుతారు.
మిథునం
ఆరోగ్యం పట్ల ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. శత్రువు వల్ల నష్టం జరగొచ్చు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. నిలిచిపోయిన పనుల్లో వేగం ఉంటుంది. ఎవరికీ సలహా ఇవ్వకండి.
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
కర్కాటకం
గుర్తుతెలియని వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో ఎవరితోనైనా వాగ్వాదం ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. విలువైన వస్తువులను మీ దగ్గర ఉంచుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. ఏదైనా పెద్ద పని చేయడానికి ప్రణాళిక వేసుకోండి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితాలు ఇప్పుడు అందుతాయి.
సింహం
డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో అజాగ్రత్త వల్ల నష్టం కలుగుతుంది. పాత వ్యాధి తిరిగి రావచ్చు. అనవసర మాటలు కట్టిపెట్టండి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగొచ్చు. భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం బాగానే ఉంటుంది. మీరు కొత్త పనిలో లాభపడతారు. కార్యాలయంలో శుభవార్తలు అందుతాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.
కన్య
గౌరవం పెరుగుతుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. సామాజిక సేవ చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో సంతోషం ఉంటుంది. తెలియని అడ్డంకిని అధిగమిస్తారు.
Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
తుల
ఈరోజు సాధారణంగా ఉంటుంది. పనిలో కొన్ని పొరపాట్లు జరగొచ్చు. వ్యాపారం బాగానే ఉంటుంది. ప్రమాదకర పనిని నివారించండి, ఓపికపట్టండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ప్రణాళికల విషయంలో తొందరపడకండి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆహారాన్ని నియంత్రించండి. రుణ మొత్తాన్ని తిరిగి పొందుతారు.
వృశ్చికం
టెన్షన్ తగ్గుతుంది. పనిలో తొందరపాటు వద్దు. బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం విజయవంతమవుతుంది. ఒకరి ప్రవర్తన బాధించవచ్చు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉంటుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. సంఘర్షణ పరిస్థితులకు దూరంగా ఉండండి.
ధనుస్సు
ఖర్చులు పెరుగుతాయి. పాత వ్యాధి తిరిగి రావొచ్చు. అనవసర ప్రసంగాన్ని నియంత్రించండి. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి. కొన్ని పనుల్లో జాప్యం ఉంటుంది. ఆదాయం కొనసాగుతుంది. సోమరితనం వద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రాజకీయ అడ్డంకులు తొలగిపోతాయి. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. చాలారోజులుగా రావాల్సిన మొత్తం చేతికందుతుంది.
Also Read: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!
మకరం
వ్యాపార యాత్ర విజయవంతమవుతుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. భాగస్వాముల మద్దతు లభిస్తుంది. లావాదేవీల విషయంలో తొందరపడకండి. స్నేహితులను కలుస్తారు. విచారకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ఎవరితోనైనా వివాదం ఏర్పడే అవకాశం ఉంది.
కుంభం
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెట్టుబడి బాగానే ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు.
మీనం
మీ మాటల పట్ల సంయమనం పాటించండి. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. వివాదాలను ప్రోత్సహించవద్దు. ఇతరుల నుంచి సహాయం ఆశించవద్దు. వ్యాపారం బాగానే ఉంటుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో విభేదాలు రావొచ్చు. వ్యసనాలకు దూరంగా ఉండండి.
Also Read:పూజకు పనికిరాని పూలు ఏవి...ఎందుకు?
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
Also Read: ఈ చోటి కర్మ ఈ చోటే...ఈనాటి కర్మ మరునాడే అంటాం....మరి కర్మల నుంచి తప్పించుకోవాలంటే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు
Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి