మేషం
ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పని ఒత్తిడి నుంచి బయటపడతారు. బంధువులను కలుస్తారు. ప్రేమ జంటలకు ఈరోజు మంచి రోజు. కుటుంబ సభ్యుల కోరికలు తీరుస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.
వృషభం
ఆరోగ్య సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పని కారణంగా ఒత్తిడికి గురవుతారు. వ్యాపారం పనిపై ప్రయాణం చేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.అనవసర మాటలు కట్టిపెట్టండి. 
మిథునం
ఈరోజు మీ కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. కార్యాలయంలో కొన్ని విభేదాలు ఉండొచ్చు.  యువతకు ఈరోజు మంచి రోజు అవుతుంది. 
Also Read: నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
కర్కాటకం
ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. బదిలీలు జరిగే అవకాశం ఉంది. యువతకు ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి.  లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
సింహం
ఆరోగ్య సంబంధిత సమస్యలు తెరపైకి రావచ్చు.  పనుల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది. ఊహించని ధనలాభం ఉంటుంది.  రిస్క్ తీసుకోవద్దు. 
కన్య
వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వృద్ధులకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండొచ్చు.
Also Read: ఆ సమయంలో కూడా కర్ణుడిని అపార్థం చేసుకోలేదు…దుర్యోధనుడిని మించిన స్నేహితుడుంటాడా?
తుల
ఒకరి మాటలు మీ మనసును గాయపరుస్తాయి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పవు.  కొత్త ఉద్యోగం ప్రారంభించే వారు కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు కొత్త సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభసమయం.
వృశ్చికం
మీరు మీ పనిని సమర్ధవంతంగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మిత్రులను కలుస్తారు.ఈరోజు ఓపికగా ఉండాలి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఎలాంటి వివాదంలో భాగం కావద్దు.


ధనుస్సు
మీకు శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు. యాత్రకు వెళ్ళవచ్చు. ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారమవుతాయి. మీ వ్యక్తిగత విషయాలను కొత్త వ్యక్తులతో పంచుకోవద్దు.  రుణం మొత్తం తిరిగి వస్తుంది. 
Also Read: నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే….!
మకరం
ఈ రోజు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు గౌరవించాలి. విద్యార్థులకు కొత్త సమాచారం అందుతుంది. వ్యాపారం కోసం ప్రయాణం చేయవచ్చు. 
కుంభం
ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ సమాచారాన్ని పొందుతారు. కుటుంబంలో వివాదాలు జరిగే అవకాశం ఉంది.  దూరప్రయాణాలు వాయిదా వేయండి. వైవాహిక జీవితం మధురంగా ​​ఉంటుంది. మీకు స్నేహితుని మద్దతు లభిస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. 
మీనం
కార్యాలయంలో కొన్ని పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఓర్పు, సానుకూల శక్తి కలిగి ఉండడంతో ఇబ్బందులను అధిగమిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. రుణం మొత్తం తిరిగి వస్తుంది.
Also Read:  దీపారాధనకు ఏ కుందులు వాడుతున్నారు... ఎందులో దీపం పెడితే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..
Also Read: అఘోరాలు పూజలు చేసే దేవాలయాలివే....
Also Read:  ద్వారానికి అటు ఇటు ఉండి ఏమీ తీసుకోకూడదంటారు ఎందుకు...
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
Also Read: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి