అంధకారం- అఙ్ఙానానికి,నిరాశకు నిదర్శనం
కాంతి-ఙ్ఞానానికి.,ఆనందానికి నిదర్శనం
అఙ్ఞానమనే చీకటి నుంచి...ఙ్ఞానమనే వెలుగులోకి ప్రయాణించడమే దీప కాంతుల వెనుక ముఖ్య ఉద్దేశం.  ‘దీపం’ త్రిమూర్తిస్వరూపం. ఇందులో మూడు రంగుల కాంతులు ఉంటాయి. ‘ఎర్రని’ కాంతి బ్రహ్మదేవునికి..‘నీలి’ కాంతి శ్రీమహావిష్ణువుకి..,‘తెల్లని’ కాంతి పరమేశ్వరుడికి ప్రతీకలు.


సాజ్యం త్రివర్తి సంయుక్తం - వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం - త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి - దేవాయ పరమాత్మనే
త్రాహిమాన్నరకాద్ఘోరాత్ - దివ్య జ్యోతిర్నమోస్తుతే 


ఏ దీపమైనా మూడువత్తులు వేసి వెలిగించాలి. ఒంటి దీపం,రెండు వత్తుల దీపాలు వెలిగించరాదు. ‘మూడు వత్తుల దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది. ముల్లోకాల్లోని అంథకారాన్ని పారద్రోలి లక్ష్మీనిలయంలా మారుస్తుందని అర్థం. అయితే దీపం వెలిగించే నూనె, నెయ్యి మాత్రమే కాదు ప్రమిదను బట్టి కూడా ఫలితం మారుతుందంటారు పండితులు. 


ఏ ప్రమిదలో వెలిగిస్తే ఎలాంటి ఫలితం



  • బంగారు ప్రమిదను గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి, ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా వెలిగించాలి. ఇలా చేస్తే ధనసమృద్ధి, విశేష బుద్ధి లభిస్తుంది.

  • వెండి ప్రమిదను బియ్యంపై ఉంచి తెలుపు రంగు పూలతో అలంకరించి, ఆవునెయ్యితో తూర్పు ముఖంగా వెలిగిస్తే సంపద వృద్ధి చెందుతుంది.

  • రాగి ప్రమిదని ఎర్రని కందిపప్పుపై ఉంచి ఎరుపు రంగు పూలతో అలంకరించి, నువ్వుల నూనెతో దక్షిణాభిముఖంగా వెలిగిస్తే మనోబలం కలుగుతుందని చెబుతారు.

  • కంచు / ఇత్తడి ప్రమిదను శనగపప్పుపై పెట్టి చుట్టూ పసుపురంగు పూలతో అలంకరించి, ఉత్తరాభిముఖంగా నువ్వుల నూనెతో వెలిగిస్తే ధనానిని స్థిరత్వం ఉంటుంది.

  • మట్టిప్రమిదలో ఆవు నెయ్యి పోసి తులసి మొక్క వద్ద వెలిగిస్తే దుష్టశక్తుల నాశనమై, సకలపాపాలు నశిస్తాయని చెబుతారు. పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే నాలుగువిధాలా లాభం చేకూరుతుంది.

  • అమావాస్య  రోజు రాత్రి ఆవు నేతితో రావిచెట్టు కింద దీపం పెడితే పితృదేవతలు సంతోషిస్తారట

  • ఆవనూనెతో రావిచెట్టు క్రింద 41 రోజులు దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు

  • నువ్వుల నూనెతో 41 రోజులు దీపం వెలిగిస్తే సమస్త రోగాలు నశించి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి

  • గురువారం రోజు అరటిచెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే అవివాహితులకు వివాహ ప్రాప్తి కలుగుతుంది


దేవుడికి దీపారాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ ప్రమిదలో వెలిగించినా, ఏ ముఖంగా వెలిగించినా దైవ పూజ వల్ల మంచే జరుగుతుంది. అందుకే ఎవరి శక్తిమేర వారు దీపం వెలిగించుకోవచ్చంటారు పండితులు.


Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…
Also Read: ఈ రాశుల వారు నోటికి గ్యాప్ తీసుకుంటే మంచిది.. మీరు అందులో ఉన్నారా ఇక్కడ తెలుసుకోండి....
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
Also Read: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: యమలోకంలో మొదట పడే శిక్ష ఇదే.. తప్పించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి