ఆగస్టు 4 రాశిఫలాలు (Horoscope 4th August 2022)


మేషం
ఈ రోజు కుటుంబ జీవితంలో అస్థిరత  ఉంటుంది. మీ తల్లిదండ్రులతో మీకు కొన్ని విభేదాలు ఉండొచ్చు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన సమయం. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. సిన్సియర్ గా పనిచేస్తే రానున్న రోజుల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు.


వృషభం
ఈ రోజు మీకు మంచి రోజు. మీరు తలపెట్టిన పనలుకు  కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.  తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. ఈ రోజు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తారు.


మిథునం
కొత్త పని, కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సమస్యలను ఎదుర్కోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తలపెట్టిన పని తెలివిగా చేయండి. రోజువారీ పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఉండవు.


Also Read: పునీతులం అయ్యాం అనే మాట వినే ఉంటారు, ఇంతకీ పునీతం అంటే ఏంటి!


కర్కాటకం 
కొనసాగుతున్న ప్రాజెక్టులు, పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. ఎవ్వరితోనూ వాదన పెట్టుకోవద్దు. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. ఏదైనా ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేసే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి. 


సింహం
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా పెద్ద పనిని ప్రారంభించే ముందు, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. హోల్‌సేల్‌ సేల్స్‌ వ్యాపారం ఉన్న వారికి పనులు సాధారణంగా సాగుతాయి.


కన్య 
వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికలపై పనులు ప్రారంభించవచ్చు. భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి. ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తవుతాయ. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.


తుల
విద్యార్థులు సక్సెస్ అవుతారు. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. మీపై విశ్వాసస్థాయి గణనీయంగా పెరుగుతుంది. వృత్తిపరమైన రంగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది.


Also Read: రక్షా బంధన్ కుడిచేతికి కట్టడం వెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు


వృశ్చికం 
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ మాటతీరు మార్చుకుంటే ఇంకా మంచిది. మీ నోటి నుంచి వచ్చిన ఓ తప్పు పదం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఈరోజు బంధువు ఇంటికి రావచ్చు. మీరు వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.


ధనుస్సు
ఆర్థిక విషయాలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో రాజీ పడితే అతి కష్టమైన సమస్యలు కూడా తీరిపోతాయి.అప్పు తీసుకోవాలన్న ఆలోచన విరమిచుకుంటారు.మీకున్న ఇబ్బందులు తగ్గుతాయి.


మకరం
వ్యాపార భాగస్వామి లేదా సన్నిహితులతో ఇబ్బందులు ఉండవచ్చు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. కొత్త కార్యాలయంలో చేరడానికి లేదా కొత్త ప్రాజెక్ట్‌లు, అండర్‌టేకింగ్‌లను ప్రారంభించాలి అనుకుంటే ఆ పనులు వాయిదా వేసుకోండి.


Also Read: శ్రావణమాసం ప్రారంభమైంది, వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1


కుంభం
ఈ రోజు మీ రోజు మునుపటి కంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళిక ఏదైనా ఈరోజు పూర్తవుతుంది. మీరు కొత్త పనిని ప్రారంభించడం గురించి కూడా ఆలోచించవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.


మీనం 
వ్యాపారంలో చేసే కొత్త ప్రయోగాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి.మనసులో ఏదో అలజడి ఉంటుంది. ఈ రోజు ఉద్యోగ, వ్యాపారాల్లో తొందరపడకండి. రిస్క్ తీసుకోవద్దు.


Also Read: పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ