శ్రావణమాసం ప్రారంభమైంది.  ఈ నెలలో హిందువుల లోగిళ్లన్నీ ఆలయాన్ని తలపిస్తాయి. ఈనెలలో చేపట్టే ఎలాంటి కార్యక్రమానికి అయినా పవిత్రత ఉంటుందంటారు పండితులు. ముఖ్యంగా శ్రావణమాసంలో మంగళగౌరీ పూజ, వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వాస్తవానికి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు కానీ..ఆ వారం కుదరని పక్షంలో శ్రావణమాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా వ్రతం చేసుకోవచ్చు. 


అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు పండితులు. మిగిలిన లక్ష్మీ పూజలకన్నా వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీ మహావిష్ణువికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలుంటాయి.  సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.


Also Read:  కృష్ణాష్టమి, పోలాల అమావాస్య సహా శ్రావణ బహుళ పాడ్యమి నుంచి శ్రావణ అమావాస్య వరకూ పండుగలివే


వరలక్ష్మీ వ్రత విధానం 
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం పెట్టి అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రి, తోరణాలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి.


కావాల్సిన వస్తువులు
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు,కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపం కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం,శనగలు…ఇంకా ఎవరి శక్తికి తగిన వస్తువులు వాళ్లు సమకూర్చుకోవచ్చు..


తోరాలు ఎలా తయారుచేసుకోవాలంటే
తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఆ తోరాలను పీఠం వద్ద ఉంచి పూజకు సిద్ధంకావాలి.


గణపతి పూజ
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి.
యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః , ఓం ఏకదంతాయ నమః , ఓం కపిలాయ నమః ,ఓం గజకర్ణికాయ నమః ,ఓంలంబోదరాయ నమః
ఓం వికటాయ నమః,ఓం విఘ్నరాజాయ నమః,ఓం గణాధిపాయ నమః,ఓంధూమకేతవే నమః,ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,ఓం ఫాలచంద్రాయ నమః,ఓం గజాననాయ నమః,ఓం శూర్పకర్ణాయ నమః,ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ... నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.


Also Read: వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రాఖీ సహా శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకూ వచ్చే పండుగలు, వాటి విశిష్టతలు


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి …ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!
నీటిని నివేదన చుట్టూ జల్లుతూ ... సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి).


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!


వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.


Alos Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2