జులై 29 శుక్రవారం రాశిఫలాలు (Horoscope 29-07-2022)


మేషం
వ్యాపార పరంగా నిలిచిపోయిన పనులు పూర్తిచేసేందుకు వేగం పెంచుతారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు త్వరలోనే శుభవార్త వింటారు. ఈ రాశివారు కొందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దాన్నుంచి బయటపడే ప్రణాళికలు వేసుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అధిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. 


వృషభం
ఈ రోజు మీకు మంచి ఫలితాలున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారం బాగా సాగుతుంది. స్తిరాస్తులు పెంచుకుంటారు. ఉద్యోగులకు శుభసమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.


మిథునం
ఇతరులకు ఎంత ఎక్కువగా సహాయం చేస్తే మీరు అంత ప్రయోజనం పొందుతారు.ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించడానికి ముందు భయపడతారు కానీ ఆ తర్వాత సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయగలుగుతారు. రిస్క్ తీసుకునేందుకు ముందుండండి. 



కర్కాటకం 
విద్యార్థులకు శుభసమయం. పోటీపరీక్షలు రాసిన విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. మీపై మీకున్న విశ్వాసం మరింత పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. 


సింహం
ఈ రోజు మీకు మంచి రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సానుకూల ఆలోచనలతో ఉంటారు. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి.కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను భాగస్వామితో మాట్లాడి పరిష్కరించుకోవాలి. 


కన్యా
మీ రోజు అనుకోకుండా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. తొందరగా అలసిపోతారు. మీ వినయం, విధేయత పెద్దల్ని మెప్పస్తుంది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.


Also Read: వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రాఖీ సహా శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకూ వచ్చే పండుగలు, వాటి విశిష్టతలు


తుల
మీ వ్యాపార భాగస్వామి లేదా సన్నిహితులతో కొన్ని సమస్యలు ఉండొచ్చు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఆశించిన ఫలితాలు ఇవ్వవు. కొత్త ఉద్యోగంలో చేరడానికి, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం కాదు. ఆ ఆలోచన ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి. ఆర్థికంగా అంత అనుకూలత లేదు.


వృశ్చికం
ఈ రోజు మీకు మంచి రోజు. వివాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఉన్న గొడవలు తీరుస్తారు. ఈ రాశికి  చెందిన విద్యార్థులు ఈ రోజు కెరీర్ కోసం వారి గురువుల నుంచి సలహాలు తీసుకుంటారు. కొత్త కోర్సుల గురించి తెలుసుకుంటారు. ఉద్యోగులకు , వ్యాపారులకు శుభసమయం.


ధనుస్సు 
ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సరదా సమయం గడుపుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకోండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. జీవిత భాగస్వామి ఈ రోజు మీ పట్ల సున్నితంగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. 


Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!


మకరం
ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి సహకారం పొందుతారు. మీ పనితీరు మీపై ఉండే గౌరవాన్ని పెంచుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. 


కుంభం
ఈ రోజు మంచి రోజు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈ రోజు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. 


మీనం
మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులతో పరిచయం మీకులాభిస్తుంది. మీరు సహాయం చేయండి కానీ ఎవ్వర్నీ తప్పుతోవ పట్టించవద్దు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు పెద్దగా మార్పులేమీ ఉండవు.