వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratam Date, Time 2022)
స్త్రీలకు సర్వసుఖాలు, సౌభాగ్యాన్నిచ్చే వరలక్ష్మీ వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి చెప్పారు.పరమేశ్వరుడు ఒకరోజు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు ఆయన్ను కీర్తిస్తున్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగేందుకు తగిన వ్రతం చెప్పండని కోరింది. అప్పుడు స్పందించిన త్రినేత్రుడు దేవీ నువ్వు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటుంది. అది వరలక్ష్మీవ్రతం అని చెప్పాడు. ప్రతి శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం ఈ వ్రతం చేయాలని చెప్పాడు పరమేశ్వరుడు.
Also Read: ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!
ఏటా శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అయితే ఈ ఏడాది ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. కొందరేమో ఆగస్టు 5న వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి అంటే..మరికొందరు ఆగస్టు 12న వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని చెబుతున్నారు. ఇంకొందరైతే రెండో శుక్రవారం ఆగస్టు 12నే వచ్చిందంటున్నారు. అయితే ఇక్కడ రెండో శుక్రవారం, మూడో శుక్రవారం అన్నది బండగుర్తు మాత్రమే. వాస్తవానికి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వ్రతం చేసుకుంటారు. అంటే ఆగస్టు 12 శుక్రవారం రోజు పౌర్ణమి తిథి సూర్యోదయానికి ఉన్నప్పటికీ ఉదయం 8 గంటలలోపే పౌర్ణమి వెళ్లి పాడ్యమి వచ్చేస్తోంది. ఈ లెక్కన ఆగస్టు 12న వ్రతం చేసుకుంటే అమావాస్య ముందు వచ్చే శుక్రవారం అవుతుంది కానీ పౌర్ణమి కానీ, పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం అవదు.
Also Read: ఇంటి ద్వారం ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి
రెండో శుక్రవారం అనే బండగుర్తు విషయానికొస్తే...ఇలా చూసుకున్నా ఆగస్టు 5న రెండో శుక్రవారం వస్తోంది. ఎందుకంటే జూన్ 29 శుక్రవారం శ్రావణమాసం ప్రారంభమైంది. అంటే ప్రారంభమైన రోజే శుక్రవారం పడింది..మొదటి శుక్రవారం కూడా. ఇక ఆగస్టు 5న వచ్చేది రెండో శుక్రవారం -పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం అవుతుంది. ఎలా చూసుకున్నా ఆగస్టు 5న వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలన్నది పండితుల మాట. వాస్తవానికి వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటే మంచిదే కానీ..ఆ రోజు కుదరని పక్షంలో శ్రావణమాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు. పర్టికులర్ గా వరలక్ష్మీ వ్రతం ఏ రోజు అంటే మాత్రం శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం లేదా పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం అనే చెప్పాలి.
Also Read: భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయా? అయితే ఇంట్లో ఈ మార్పు చేయండి
టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాల్లోనూ ఆగస్టు 5న వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5 న జరిగే వరలక్ష్మీ వ్రతం కోసం 1,001/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుచానూరులోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.