Vasthu Tips: భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయా? అయితే ఇంట్లో ఈ మార్పు చేయండి

భార్యాభర్తలు మధ్య అధికంగా తగాదాలు అయితే ఆ ఇల్లు నరకంలా మారుతుంది.

Continues below advertisement

ఇల్లంటే భార్యాభర్తలు, పిల్లలతో కూడిన పొదరిల్లు. ఇంట్లో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా, సౌభాగ్యంతో వెల్లివిరుస్తుంది. తల్లిదండ్రులు గొడవపడుతుంటే పిల్లలు కూడా మానసిక ఆందోళనకు గురవుతారు. కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో వాస్తు పరంగా చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. వాస్తు శాస్త్రపరంగా కుటుంబాన్ని సౌఖ్యంగా ఉంచేందుకు ఈ రెమెడిటీలు పనికొస్తాయి. ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు.  వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్ల కోసమే ఇది. భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వాళ్లు అధికం. 

Continues below advertisement

చేయాల్సినవి ఇవే...
1. ఇంట్లో సంబంధ బాంధవ్యాలు బలహీనపడుతున్నట్టు అనిపించినా, నిత్యం గొడవలు అవుతున్నా తెల్ల చందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చి పెట్టండి. ఇది చాలా శక్తివంతమైనది. గొడవలను తగ్గిస్తుంది. ప్రేమను పెంచుతుంది. కుటుంబసభ్యుల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 
2. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను తొలగిస్తుందని నమ్ముతారు. గదిలోని ఒక మూలలో రాళ్ల ఉప్పు లేదా కళ్లుప్పుని వేసి నెల రోజుల పాటూ వదిలేయండి. ఒక నెల తరువాత దాన్ని తీసి కొత్త ఉప్పును వేయండి. ఇలా తరచూ చేస్తుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి. 
3. భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేసారి తినేందుకు ప్రయత్నించండి. వీలైతే వంటగదిలో తినేందుకు ప్రయత్నించండి. వంటగది పెద్దగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇల వంటగదిలో అందరూ కలిసి భోజనం చేయడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. 
4. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యాన్ని సూచిస్తాడు. కాబట్టే ఎక్కువ మంది ఇళ్లల్లో ఇతని విగ్రహం కనిపిస్తుంది. ఈ గదిలో లేదా బాల్కనీలో బుద్ధుని విగ్రహం ఉంచితే చాలా మంచిది. ఇల్లు శాంతంగా ఉంటుంది. 
5. కుటుంబంలో అధికంగా గొడవలు జరుగుతున్నప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవడం మానివేయాలి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న మహిళల మధ్య కలహాలు వచ్చినప్పుడు వారు ఎరుపు రంగు వస్త్రాలను ఒకే సమయంలో ధరించకూడదు. 
6. కుటుంబంలోని మగవారి మధ్య విభేదాలు ఉంటే ఇంట్లో కదంబ చెట్టు కొమ్మను ఉంచాలి. ఇది ఇంట్లో శాంతిని నెలకొనేలా చేస్తుంది. విబేధాలు తగ్గిస్తుంది.

Also read: ప్రపంచంపై దాడికి సిద్ధంగా ఉన్న మరో వైరస్ మహమ్మారి ‘మార్బర్గ్’, ఇది కూడా ఎబోలా లాంటిదే, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Also read: వాకింగ్‌ ఉదయానే చేయాలా? సాయంత్రం చేస్తే మంచి ఫలితాలు రావా?

Continues below advertisement
Sponsored Links by Taboola