దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) ప్రవేశాలకు ఏటా నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(CAT-2022) నోటిఫికేషన్‌ను ఐఐఎం-బెంగళూరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా నవంబరు 27న నిర్వహించనున్న క్యాట్-2022 పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3నుంచి ప్రారంభంకానుంది. సెప్టెంబరు 14 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 27 నుంచి పరీక్ష రోజు వరకు అడ్మిట్ కార్డులు(హాల్‌టికెట్లు) అందుబాటులో ఉండనున్నాయి.

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ విధానంలో ఫీజు చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఏవైనా ఆరు నగరాలను ప్రాధాన్యాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాతే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు.


Also Read: MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’

ఈ ఏడాది నవంబరు 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 150 నగరాల్లో CAT-2022 పరీక్ష నిర్వహించనున్నారు. దీనిద్వారా దేశంలోని 20 ఐఐఎంలలో ప్రవేశాలు కల్పించనున్నారు.

దేశంలోని ఐఐఎంలు: అహ్మదాబాద్, అమృత్‌సర్‌, బెంగళూరు, బోధ్ గయా, కతకత్తా, ఇండోర్, జమ్మూ, కాశీపూర్, కోజికోడ్, లక్నో, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, రోతక్, సంబల్‌పూర్, షిల్లాంగ్, సిర్మోర్, తిరుచిరాలపల్లి, ఉదయ్‌పూర్, విశాఖపట్నం.

అర్హత: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45% మార్కులు ఉన్నా అర్హులే). డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


Also Read:  ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల - సబ్జెక్టులు, పూర్తి వివరాలు!

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా. పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

పరీక్ష ఇలా..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 గంటలపాటు సాగనుంది. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటి నుంచి 66 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాల సమయం చొప్పున 120 నిమిషాల సమయం ఉంటుంది. దివ్యాంగులకు 13 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. క్యాంట్ స్కోరుకు 2023 డిసెంబరు 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 
*సెక్షన్-1: వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ -  24 ప్రశ్నలు – 72 మార్కులు
* సెక్షన్-2: డేటా ఇంటర్ ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ - 20 ప్రశ్నలు – 60 మార్కులు
* సెక్షన్-3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ - 20 ప్రశ్నలు – 60 మార్కులు.


Also Read: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 200 ఉద్యోగాలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు:  చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తు ఫీజు: రూ.2,300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1,150.

ముఖ్యమైన తేదీలు..



  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం   :  03-08-2022


  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది              : 14-0-2022


  • అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్                            : 27-10-2022


  • పరీక్ష తేది                                                : 27-11-2022


  • ఫలితాల వెల్లడి                                        : 2023, జనవరి రెండోవారంలో.



CAT 2022 Advertisement


Online Registration


CAT 2022 Information Bulletin


Selection Process of IIMs


Important CAT 2022 Disclaimers


CAT 2022 Eligibility


CAT 2022 Media Release 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...