సీనియర్ హీరో రాజశేఖర్ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన లిస్ట్ లో చాలా హిట్టు సినిమాలున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన జోరు కాస్త తగ్గింది. అప్పుడప్పుడు ఒకట్రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఆయన నటించిన 'గరుడ వేగ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ తరువాత 'కల్కి' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. 


ఇటీవల జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన 'శేఖర్' అనే సినిమాలో నటించారు. విడుదలకు ముందు ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది. దీంతో చిత్రబృందం జోరుగా ప్రమోట్ చేసింది. కానీ థియేటర్లలో ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా రాజశేఖర్ ఓ సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. 


యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని చెప్పిన కథ రాజశేఖర్ కి నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మర్కాపురం శివకుమార్ నిర్మించబోతున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. దర్శకుడిగా పవన్ సాధినేని చాలా సెలెక్టివ్ గా ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. ఆయన నుంచి చివరిగా వచ్చిన సినిమా 'సేనాపతి'. 'ఆహా'లో విడుదలైన ఈ సినిమాకి మంచి పేరొచ్చింది. ఈ సినిమా తరువాత శ్రీవిష్ణుతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు పవన్ సాధినేని. ఇంతలో రాజశేఖర్ సినిమా కూడా ఓకే అయింది. మరి ముందుగా ఏది మొదలుపెడతారో చూడాలి!


Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'


Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?