వ్యక్తిగత జీవితం గురించి లో ప్రొఫైల్ మైంటైన్ చేసే కథానాయకులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. సమంతతో వివాహ బంధంలో ఉన్నప్పుడూ... ఆమెతో వేరు పడినప్పుడూ... ఇప్పుడూ.... ఎప్పుడూ... సినిమా సంగతులు తప్ప, రూమర్స్ మీద స్పందించిన సందర్భాలు తక్కువ. ఫర్ ద ఫస్ట్ టైమ్... 'లాల్ సింగ్ చడ్డా' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముంబై మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న చైతూకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. ఆయన కూడా చాలా హుందాగా సమాధానాలు ఇస్తున్నారు.
శోభిత రూమర్ గాళ్ ఫ్రెండేనా? నిజమైన ప్రేమా?
సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత 'గూఢచారి', 'మేజర్' చిత్రాల్లో నటించిన తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) తో నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) డేటింగ్ చేస్తున్నారని, ఆమె అతడి గాళ్ ఫ్రెండ్ అని వార్తలు వచ్చాయి. శోభిత గురించి ఆయనకు తొలిసారి ఒక ప్రశ్న ఎదురైంది.
''శోభితా ధూళిపాళ పేరు వినగానే మీకు ఏం గుర్తుకు వస్తుంది? మీ మనసులో ఏం అనిపిస్తుంది?'' అని నాగ చైతన్యను ముంబై ఆర్జే ఒకరు అడిగారు. అప్పుడు అక్కినేని యువ హీరో నవ్వేశారు. ''I'm just gonna smile'' (జస్ట్... స్మైల్ ఇస్తా! /నవ్వుతాను, అంతే) అని సమాధానం ఇచ్చారు.
నాగ చైతన్య నవ్వులో ముంబై మీడియా చాలా అర్థాలు వెతుకుతోంది. ఒక స్మైల్‌తో డేటింగ్ విషయాన్ని కన్ఫర్మ్ చేశారని కొందరు రాస్తే... ప్రేమలో ఉన్నారు కాబట్టి అలా నవ్వారని మరికొందరు రాస్తున్నారు. అదీ సంగతి!
సమంత పుట్టించిన పుకారేనా?
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వచ్చిన వార్తల వెనుక సమంత ఉన్నారని అప్పట్లో కొందరు రాసుకొచ్చారు. అటువంటి రాతలపై సమంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
''ఒక అమ్మాయి మీద పుకార్లు వస్తే... బహుశా నిజమే కావచ్చు.
ఒక అబ్బాయి మీద పుకార్లు వస్తే... ఒక అమ్మాయి కావాలని చేయించింది.
ఇంకెన్ని రోజులు అలాగే ఉంటారు. జీవితంలో పైకి ఎదగండి.
ఇద్దరూ దాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు వెళుతున్నారు. మీరూ మర్చిపోండి. మీ పని మీద దృష్టి పెట్టండి. మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి'' అని అప్పట్లో సమంత ట్వీట్ చేశారు.
Also Read : స్టార్స్ సెక్స్ లైఫ్ గురించి అడిగితే మీ అమ్మ ఏమీ అనుకోరా? - కరణ్ జోహార్‌ను ఆటాడుకున్న ఆమిర్ ఖాన్
నాగ చైతన్య ముంబైలో... శోభిత స్కాట్లాండ్‌లో!
'లాల్ సింగ్ చడ్డా' ప్రమోషన్స్ కోసం అక్కినేని నాగ చైతన్య ముంబై వెళితే... మామూలుగా ముంబైలో ఉండే శోభితా ధూళిపాళ ఇప్పుడు స్కాట్లాండ్‌లో ఉన్నారని సమాచారం. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా విదేశాల ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. ముంబైలో ఉంటే మళ్ళీ లేనిపోని రూమర్స్ వస్తాయని ముందు జాగ్రత్తగా ఆమె విదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
Also Read : ఫొటోగ్రాఫర్‌గా మారిన మహేష్ కొడుకు - రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్!