జులై 28 గురువారం రాశిఫలాలు (Horoscope 28-07-2022)


మేషం
ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పులు తీర్చాలనే ఒత్తిడి మీపై ఉంటుంది. చాకచక్యంగా పనిచేయండి. చిన్న చిన్న విషయాలను అతి చేయవద్దు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.


వృషభం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. వివాహ సంబంధాలు బలంగా ఉంటాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. ధర్మ-కర్మ పట్ల  ఆసక్తి మరింత పెరుగుతుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి బంధువులతో వివాదం పెట్టుకోవద్దు. ఉద్యోగులకు బాగానే ఉంటుంది. 


మిథునం
తలపెట్టిన పనులు పూర్తవుతాయి కానీ కొంత నష్టపోతారు. మార్కెటింగ్ సంబంధిత పనుల్లో ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మీ మనసులో ఎలాంటి సందేహాలు ఉండనివ్వకండి. ఈ రోజు మీ దినచర్యలో మార్పు రావచ్చు.



కర్కాటకం 
మనసులో ఉత్సాహం ఉంటుంది. కొత్తగా నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి. ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉండండి. ఇంజనీరింగ్ లో ఉండేవారు గౌరవం పొందుతారు.


సింహం
సమీపంలోని ప్రదేశానికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు ఇబ్బంది పడతారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. 


కన్యా
కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. అదృష్టం కలిసొస్తుంది. నూతన పెట్టబడులకు ఇదే మంచి సమయం. విద్యార్థులకు ఈరోజు చాలా శుభప్రదమైన రోజు.


తులా
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు వ్యాపారంలో సానుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో ఎవ్వర్నీ నమ్మొద్దు. సాంకేతిక రంగంలో చురుకుగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.


Also Read: వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రాఖీ సహా శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకూ వచ్చే పండుగలు, వాటి విశిష్టతలు


వృశ్చికం
డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సమస్యలపై చర్చించేందుకు ఇదే మంచి సమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి సూచనలు తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి.విదేశాలకు వెళ్లాలనుకునేవారికి అడ్డంకులు తొలగిపోతాయి.


ధనుస్సు
మీ జీవిత భాగస్వామి దగ్గర ఏ విషయాన్ని దాచవద్దు. వ్యాపారంలో లభాలొస్తాయి. వ్యక్తిగత శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడతారు. సోమరితనం వీడండి. అనవసర పనులతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండాలి. 
 
మకరం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. ధనలాభం ఉంటుంది.  ఇంట్లో సమస్యలను చర్చిస్తారు.  వైవాహిక జీవితం బావుంటుంది. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. పనులన్నీ ప్రశాంతంగా పూర్తవుతాయి. విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.


Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!


కుంభం
మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. మీ సర్కిల్ పెరుగుతుంది. కుటుంబంతో కలిసి బయటకు వెళతారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, ఉద్యోగులు , వ్యాపారులకు శుభసమయం. 
 
మీనం
ఉద్యోగులు కార్యాలయంలో లాభపడతారు. నిజాయితీగా వ్యవహరించండి. అనారోగ్యాన్నిచ్చే ఫుడ్ కి దూరంగా ఉండాలి. కొన్ని సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. వ్యాపారం బాగాసాగుతుంది.