శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 28 గురువారం పంచాంగం
తేదీ: 28-07 -2022
వారం: గురువారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం
తిథి : అమావాస్య గురువారం రాత్రి 10.06 వరకు తదుపరి శ్రావణ పాడ్యమి
నక్షత్రం: పునర్వసు ఉదయం 7.04 వరకు తదుపరి పుష్యమి
వర్జ్యం : మధ్యాహ్నం 3.53 నుంచి 5.39 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 9.58 నుంచి 10.49 వరకు తిరిగి మధ్యాహ్నం 3.07 నుంచి 3.59 వరకు
అమృతఘడియలు : ఉదయం 6.10 వరకు తిరిగి తెల్లవారుజాము 2.30 నుంచి 4.16 వరకు
సూర్యోదయం: 05:40
సూర్యాస్తమయం : 06:22
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: కృష్ణాష్టమి, పోలాల అమావాస్య సహా శ్రావణ బహుళ పాడ్యమి నుంచి శ్రావణ అమావాస్య వరకూ పండుగలివే
ఆషాఢ అమావాస్య 28 జూన్ 2022: ఈ అమావాస్య గురించి చాలా గ్రంథాలలో వివరించారు. ఈ రోజు చాలా మంది శుభకార్యాల చేయడాన్ని వాయిదా వేస్తారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను తలచుకుని, నది స్నానం చేసి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇలా చేయడం వల్లే పితృ దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని భావిస్తారు. అందుకే ఈ రోజు పితృ కర్మకు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున పితృవులకు తర్పణం చేయడం వల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు.
ఆషాఢ అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తం ముగియకుండా నదిలో స్నానం చేయడం మంచిది. సూర్య భగవానుడికి నీరు అర్పించాలి. ఈ రోజు పూర్వీకులను స్మరించుకోవాలి. పితృఆరాధన చేయడం ఉత్తమం. అన్నదానం చేయడం అత్యుత్తమం. అమావాస్య రోజున రావి చెట్టును పూజించడం శుభప్రదం అని చెబుతారు. ఇది పితృ దోషాన్ని తొలగిస్తుంది. ఆషాఢ అమావాస్య రోజు 108 సార్లు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఆషాఢ అమావాస్యను హలహరి అమావాస్య అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ రోజున రైతులు వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు.
Also Read: వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రాఖీ సహా శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకూ వచ్చే పండుగలు, వాటి విశిష్టతలు
ఈ రోజు శుభకార్యాలు చేయకూడదు. క్షుర కర్మలు చేయరాదు. బూజులు దులుపి, ఇల్లు కడగడం లాంటివి అస్సలు వద్దంటారు పండితులు. కొత్తపనులు ప్రారంభించకూడదు.. పాత పనులు ఆపాల్సిన అవసరం లేదు. అమావాస్య రోజు తలకు నూనె పెట్టుకోవడం, తలంటు పోసుకోవడం చేయరాదు. తలకు స్నానం చేయొచ్చు.