Happy Navratri Day 6 Bhramarambika In Sri Katyayani Devi Alankaram: సింహవాహనంపై కొలువై సేవలందుకునే కాత్యాయనీ మాత అలంకారాన్ని దర్శించుకునేవారికి చతుర్విధ పురుషార్ధాల ఫలం లభిస్తుందని చెబుతారు.
శరన్నవరాత్రుల్లో ఆరో రోజు కాత్యాయని అలంకారంలో దర్శనమిస్తోంది శ్రీశైల భ్రమరాంబిక. నాలుగు చేతులు, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం చేతపట్టుకుని సింహవాహనంపై దర్శనమిస్తోంది.
‘చంద్ర హాజ్జ్వల కరా శార్దూల వరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాత్ దేవీ దానవ ఘాతినీ’
కాత్యాయనుడు అనే మహర్షి...తపస్సు చేసి స్వయంగా అమ్మవారు తన ఇంట జన్మించాలని వరం కోరుకున్నాడు. అలా ఆ మహర్షి ఇంట తానే జన్మించింది శక్తి స్వరూపిణి. కాత్యాయనుడి కుమార్తె కావడంతో కాత్యాయని అని పేరు. అభయవర ముద్రలతో పాటుగా ఖడ్గాన్నీ, పద్మాన్నీ ధరించి కనిపిస్తుంది కాత్యాయని. అజ్ఞానాన్ని దహించే చిహ్నం పద్మం అయితే..ఆపదలు ఎదుర్కొనేందుకు సూచన ఖడ్గం..అలా అజ్ఞానాన్ని, ఆపదలను దూరం చేసే అమ్మవారు కాత్యాయని.
కాత్యాయని అంటే మహాతేజస్సు కలది అని అర్థం. ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిణి అయిన కాత్యాయని మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి సహాయం చేసిందని స్కాంద పురాణంలో ఉంది.
ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత అయిన కాత్యాయని..ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. అందుకే ఈ అమ్మవారిని ఆరాధిస్తే విద్యార్థులకు తెలివితేటలు పెరుగుతాయి. అవివాహితులు పూజిస్తే వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి.
కాత్యాయని అష్టకం
శ్రీగణేశాయ నమః ।
అవర్షిసఞ్జ్ఞం పురమస్తి లోకే కాత్యాయనీ తత్ర విరాజతే యా ।
ప్రసాదదా యా ప్రతిభా తదీయా సా ఛత్రపుర్యాం జయతీహ గేయా ॥
త్వమస్య భిన్నైవ విభాసి తస్యాస్తేజస్వినీ దీపజదీపకల్పా ।
కాత్యాయనీ స్వాశ్రితదుఃఖహర్త్రీ పవిత్రగాత్రీ మతిమానదాత్రీ ॥
బ్రహ్మోరువేతాలకసింహదాఢోసుభైరవైరగ్నిగణాభిధేన ।
సంసేవ్యమానా గణపత్యభిఖ్యా యుజా చ దేవి స్వగణైరిహాసి ॥
గోత్రేషు జాతైర్జమదగ్నిభారద్వాజాఽత్రిసత్కాశ్యపకౌశికానామ్ ।
కౌణ్డిన్యవత్సాన్వయజైశ్చ విప్రైర్నిజైర్నిషేవ్యే వరదే నమస్తే ॥
భజామి గోక్షీరకృతాభిషేకే రక్‍తామ్బరే రక్‍తసుచన్దనాక్‍తే ।
త్వాం బిల్వపత్రీశుభదామశోభే భక్ష్యప్రియే హృత్ప్రియదీపమాలే ॥
ఖడ్గంచ శఙ్ఖం మహిషాసురీయం పుచ్ఛం త్రిశూలం మహిషాసురాస్యే ।
ప్రవేశితందేవి కరైర్దధానే రక్షానిశం మాం మహిషాసురఘ్నే॥
స్వాగ్రస్థబాణేశ్వరనామలిఙ్గం సురత్‍నకం రుక్మమయం కిరీట్మ ।
శీర్షే దధానే జయహే శరణ్యే విద్యుత్ప్రభే మాం జయినంకురూష్వ ॥
నేత్రావతీదక్షిణపార్శ్వసంస్థే విద్యాధరైర్నాగగణైశ్చ సేవ్యే ।
దయాఘనే ప్రాపయ శం సదాస్మాన్మాతర్యశోదే శుభదే శుభాక్షి ॥
ఇదం కాత్యాయనీదేవ్యాః ప్రసాదాష్టకమిష్టదమ్ ।
కుమఠాచార్యజం భక్‍త్యా పఠేద్యః ససుఖీ భవేత్॥
॥ ఇతి శ్రీకాత్యాయన్యష్టకం సమ్పూర్ణమ్ ॥
Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!
దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే