According to the Zodiac Sign Worship Lord Ganesha Form: వినాయకుడిని పూజిస్తే  జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.  నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అని వేడుకుంటే చాలు ఎంతటి అడ్డంకులను అయినా తొలగించేస్తాడని నమ్ముతారు. అందుకే ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ మంచి పని ప్రారంభించినా, కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టినా ముందుగా గణనాథుడిని భక్తితో ప్రార్థిస్తారు. అయితే మీ రాశి ప్రకారం పూజిస్తే మరిన్ని శుభఫలితాలు పొందుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.  
 
మేష రాశి


ఈ రాశివారు..ఇంట్లో ఎరుపు రంగుతో పెయింట్ చేసిన గణేషుడి విగ్రహాన్ని ఉంచి సింధూరం లేదా ఎర్రటి వస్త్రాలతో అలంకరించాలి. బెల్లం,  ఎండు ఖర్జూరంతో తయారు చేసిన లడ్డూను వినాయకుడికి సమర్పించాలి. మీ రాశికి అధిపతి అంగారకుడు అందుకే పూజ సమయంలో మీరు కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించాలంటారు. మీరు పూజించేందుకు వక్రతుండ  గణపతి రూపాన్ని ఎంచుకోండి. ఓం వక్రతుండాయ హం అనే మంత్రాన్ని పఠించండి.
 
వృషభ రాశి


ఈ రాశివారు ఇంట్లో నీలిరంగు గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి తెల్లటి వస్త్రాలతో అలంకరించాలి. తెల్లటి పూలతో పూజ చేసి మోదకం , కొబ్బరి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి. మీ రాశికి అధిపతి శుక్రుడు..పూజ చేసే సమయంలో తెలుపు లేదా ఎరుపు వస్త్రాలు ధరించాలి.   ఓం హ్రీం గ్రీం హ్రీం  అమే మంత్రాన్ని పఠించాలి. 


Also Read: గణేష్ చతుర్థి 2024: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!
 
మిథున రాశి
 
మీ రాశికి అధిపతి బధుడు..అందుకే వినాయకుడి పూజ చేసే సమయంలో ఆకుపచ్చని రంగు వస్త్రాలు ధరించండి. లడ్డూ, పండ్లు నైవేద్యంగా సమర్పించండి. పూజలో గణనాథుడికి తమలపాకులు సమర్పించండి...ఓం శ్రీం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి.


కర్కాటక రాశి
 
ఈ రాశివారు తెల్లటి వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించాలి. అన్నం పాయసం ప్రసాదంగా సమర్పించాలి, ఎర్రటి పూలతో పూజించాలి. ఈ రాశికి చంద్రుడు అధిపతి కావడంతో తెల్లటి వస్త్రాలు ధరించి పూజ చేయండి.  ఓం ఏకదంతాయ నమః అనే మంత్రం జపించండి. 


సింహ రాశి


ఈ రాశికి అధిపతి సూర్యుడు..అందుకే పూజ సమయంలో ఎరుపురంగు దుస్తుల ధరించాలి. ఎరుపు రంగు గణేషుడి విగ్రహాన్ని తీసుకొచ్చి దానిని ఎర్రటి వస్త్రంపై పెట్టి పూజించండి. గన్నేరు పూలతో పూజ చేసి....బెల్లంతో తయారు చేసిన స్వీట్లు సమర్పించండి. ఈ రోజు వినాయకపూజతో పాటూ లక్ష్మీదేవి పూజ కూడా చేస్తే మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఓం శ్రీ గం సౌభాగ్య గణపతేయ వరవరదం సర్వజనం మేం వశమానాయ నమః అనే మంత్రాన్ని జపించాలి.  


Also Read: ఈ ఏడాది వినాయకచవితికి మీరు సందర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాలివే!


కన్యా రాశి


ఈ రాశివారు పూజకు ఆకుపచ్చరంగు వినాయక విగ్రహం తెచ్చుకోవాలి. ఆకుపచ్చని వస్త్రం పరిచి అలంకరించాలి. పండ్లు, లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి. పూజ సమయంలో ఆకుపచ్చని వస్త్రాలు ధరించండి. నిత్యం 108 సార్లు ఓం గణపతాయే నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకు చాలా ప్రయోజనకరం


తులా రాశి


తులా రాశివారు తెలుపు లేదా నీలం రంగు విగ్రహానికి తెల్లటి వస్త్రాలతో అలంకరించాలి. పూజ చేసేటప్పుడు ఆరెంజ్ కలర్ వస్త్రాలు ధరించాలి. తెల్లటి పూలతో పూజ చేసి అరటిపండ్లు,బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఓ హ్రీ గ్రీ హ్రీ అనే మంత్రాన్ని జపించాలి.


వృశ్చిక రాశి


ఈ రాశివారు ఎరుపు రంగులో ఉన్న వినాయకుడిని ప్రతిష్టించి ఎర్రటి వస్త్రాలతోనే అలంకరించుకోవాలి. మీ రాశికి అధిపతి అంగారకుడు కావడంతో మీరు పూజాసమయంలోనూ ఎరుపు రంగు వస్త్రాలే ధరించాలి. ఎర్రటి పూలతో పూజ చేసి బెల్లం, లడ్డూ, ఎండు ఖర్జూరం సమర్పించాలి. ఓం హ్రీం ఉమాపుత్రాయ నమఃఅనే మంత్రాన్ని పఠించాలి. 
 
ధనుస్సు రాశి
 
ఈ రాశివారు పసుపురంగు విగ్రహాన్ని తీసుకొచ్చి పసుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. పసుపు రంగు పూలతో పూజ చేసి మోదకం సమర్పించాలి. మీ రాశికి అధిపతి బృహస్పతి..అందుకే పూజా సమయంలో పసుపు రంగు వస్త్రాలు ధరించండి. శనగపిండి లడ్డూలు సమర్పిస్తే మీ మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. హరిద్రరూప హుంగం గ్లౌం హరిద్రాగణపతయై వరవరద దుష్ట జనహృదయం స్తమ్భయ స్తమ్భయ  నమః అని ధ్యానించండి. 


Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!


మకర రాశి
 
మీ రాశికి అధిపతి శని అయినప్పటికీ మీరు పూజా సమయంలో ఎర్రటి వస్త్రాలు ధరించాలి. వినాయకుడి విగ్రహానికి మాత్రం నీలిరంగు వస్త్రం ధరింపచేయండి. తెల్లటి పూలతో పూజ చేసి..నువ్వుల లడ్డూ నైవేద్యంగా సమర్పిస్తే వృత్తి ఉద్యోగాలలో పురోగతి పొందుతారు. ప్రతిరోజూ  ఓం లంబోదరాయ నమః అనే మంత్రం జపించాలి


కుంభ రాశి
 
నీలిరంగు వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి నీలి రంగు వస్త్రంతోనే అలంకరించండి. తెల్లటి పూలతో పూజించి..పండ్లతో చేసిన స్వీట్ ను నైవేద్యంగా సమర్పించండి. శనగలు కూడా నైవేద్యం పెట్టొచ్చు. పూజ అనంతరం పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది. ఓ గమపతయే నమః అనే మంత్రాన్ని పఠించండి


మీన రాశి  


మీ రాశికి అధిపతి బృహస్పతి...మీరు వినాయకుడి పూజ చేసే సమయంలో ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించాలి. పసుపు రంగు విగ్రహాన్ని పసుపు రంగు వస్త్రంపై ఉంచి పసుపు రంగు పూలతో పూజ చేయండి. అరటి పండ్లతో పాటూ పసుపు రంగు స్వీట్లను నైవేద్యంగా సమర్పస్తే మీ కెరీర్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఓం సర్వేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించండి...


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.