Daily Horoscope for 29 August 2024 


మేష రాశి


ఈ రోజు మీ వైవాహిక జీవితం బావుంటుంది. మీ ప్రియమైనవారికి మనసులో మాట చెప్పేయండి..వివాహ సంబంధిత విషయాలు మాట్లాడేందుకు మంచి రోజు. మీ మనోబలం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు అవుతారు. 


వృషభ రాశి


ఈ రాశివారు ఇంట్లో పెద్దల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. పాత తప్పిదాలను పునరావృతం చేయవద్దు. మిమ్మల్ని చూసి అసూయపడేవారున్నారు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. 


మిథున రాశి


నూతన కార్యక్రమాలు ప్రారంభించేందకు ఈ రోజు మంచి రోజు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. రాజకీయ నాయకులు మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. మీరు మీ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 


Also Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!


కర్కాటక రాశి


రోజు కుటుంబంలో కొంత ఇబ్బందికర పరిస్థితులుంటాయి. కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలు అంత అనుకూలంగా ఉండవు. మితిమీరిన ఆలోచన ప్రభావం మీ బాధ్యతలను పక్కదారి పట్టించేలా చేస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. 


సింహ రాశి


ఈ రాశి ఉద్యోగులు  పారదర్శకంగా వ్యవహరించండి. సామాజికంగా గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.. సంతోషంగా ఉంటారు. వివాదాస్పద విషయాలపై అతిగా స్పందించవద్దు. వాహనం జాగ్రత్రగా నడపండి. 


కన్యా రాశి 


ఈ రోజు మీరు మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.  కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మీకు సరైన సహకారం అందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. లావాదేవీలకు సంబంధించిన విషయాలు సులభంగా పరిష్కారమవుతాయి.  


తులా రాశి


మీరు చేసే పనిపట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు..ఎవరికీ అప్పగించవద్దు.  చట్టపరమైన వివాదాలలో మీరు విజయం సాధిస్తారు. వ్యాపార పర్యటనలు ప్రయోజనకరంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో ప్రేమ, అంకిత భావాలు పెరుగుతాయి. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. 


Also Read: ఈ ఏడాది వినాయకచవితికి మీరు సందర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాలివే!


వృశ్చిక రాశి


మీపై తప్పుడు ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. మీ పనిని మీ సహోద్యోగులకు వదిలేయడం మీకు మంచిదికాదు. స్థిరాస్తిలో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. ఆహారంలో కొంచెం అజాగ్రత్త కూడా హానికరం. అతిథులను కలుస్తారు. 


ధనస్సు రాశి


మీ పనులు ఈ రోజు సులంభంగా పూర్తవుతాయి. ప్రేమ వివాహం చేసుకున్నవారికి అడ్డంకులు తొలగిపోతాయి. స్నేహితులతో మంచి టైమ్ స్పెండ్ చేస్తారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగం, వ్యాపారాలలో పెద్దగా మార్పులుండవు. 


మకర రాశి


మీరు చట్టవిరుద్ధమైన విషయాలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సీనియర్ అధికారులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి. ఈ రోజు మీరు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.


కుంభ రాశి 


ఈ రోజు మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధవహించండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. ఆరోగ్యం బావుంటుంది. 


మీన రాశి


ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో ఈ రోజు జాగ్రత్తగా ఉండాల. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు తగ్గుతాయి.  


Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.