అమెరికాలో 'సరిపోదా శనివారం' ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఓవర్సీస్ టాక్ ఎలా ఉంది? 'ఆర్ఆర్ఆర్' తర్వాత డీవీవీ దానయ్య మరొక హిట్ కొట్టారా? సోషల్ మీడియాలో ఆడియన్స్ ఏమంటున్నారు? ట్విట్టర్ రివ్యూలో చూడండి.


నాని అవుట్ అండ్ అవుట్ మాస్... 
ఇది పక్కా కమర్షియల్ సినిమా బాసూ!
'సరిపోదా శనివారం' ప్రీమియర్స్ చూసి ట్వీట్స్ చేసిన మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే... నాని యాక్టింగ్ మీద ఎక్కువ మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే... 'సరిపోదా శనివారం' అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా అని, ఇది పక్కా కమర్షియల్ సినిమా అని పేర్కొంటున్నారు.



ఊచకోత... రాసి పెట్టుకోండి... బ్లాక్ బస్టర్!
ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బావుందని ఎక్కువ మంది ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత విజిల్ వేసే మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయట. వివేక్ ఆత్రేయ ఇప్పటి వరకు రాసిన సినిమాలతో పోలిస్తే... 'సరిపోదా శనివారం' బెస్ట్ వర్క్ అని అతనికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.


Also Read: 'సరిపోదా శనివారం' సినిమాకు నాని రివ్యూ - మూడు గంటలు ఇంట్రడక్షన్ సాంగ్ లెక్క కొడితే!














ఎస్జే సూర్య తక్కువేం తినలేదు... ఇరగదీశాడు!
'సరిపోదా శనివారం'లో విలన్ రోల్ ఎస్జే సూర్య చేశాడు. నాని ఎప్పటిలా యాక్టింగ్ అదరగొట్టాడని ఫ్యాన్స్ చెబుతుంటే కామన్ ఆడియన్స్ ఎస్జే సూర్య గురించి ట్వీట్స్ చేస్తున్నారు. ఆయన కుమ్మేశారని చెబుతున్నారు. జేక్స్ బిజాయ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అంటున్నారు. దాంతో అభిమానులు బ్లాక్ బస్టర్ కొట్టేశామని సంబరాలు మొదలెట్టారు. నాని, సూర్య మధ్య సీన్లు కూడా సూపర్ వచ్చాయట.



అదొక్కటే 'సరిపోదా శనివారం' కొంప ముంచిందా?
'సరిపోదా శనివారం' సినిమాకు మెజారిటీ ఆడియన్స్ నుంచి వినబడుతున్న కామన్ కంప్లైంట్ రన్ టైం. 2.50 గంటల సినిమాలో ఈజీగా 15 మినిట్స్ ట్రిమ్ చేసే ఛాన్స్ వుందని కొన్ని ట్వీట్స్ పడ్డాయి. 'సరిపోదా శనివారం' ఒక శాటిస్‌ఫ్యాక్టరీ యాక్షన్ డ్రామా అని, ఇందులో ఎక్సలెంట్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయని, ఎట్ ద సేమ్ టైం బాగా సాగదీశారని, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించే విధంగా ఉందని ఓవర్సీస్ నెటిజన్స్ చెబుతున్నారు. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా సరే ఒక్కసారి ట్రై చేయవచ్చని సలహా ఇస్తున్నారు.


Also Readఅన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌






























నెగిటివ్ రివ్యూలు కూడా ఉన్నాయండోయ్!
సోషల్ మీడియా అంతా 'సరిపోదా శనివారం' పాజిటివ్ రివ్యూలతో హోరెత్తుతుంటే, అక్కడక్కడా నెగిటివ్ రివ్యూలు సైతం కనబడుతున్నాయి. రొటీన్ కథ, ఫ్లాట్ నేరేషన్, సాగదీసిన స్క్రీన్ ప్లే ఉండటంతో సినిమా బాలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బోరింగ్ మూవీ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సెకండాఫ్ బావుందని పలువురు ట్వీట్స్ చేస్తుంటే... ఫస్టాఫ్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ సెకండాఫ్ మీద పెట్టి ఉంటే వంద కోట్ల మూవీ అయ్యేదని మరొకరు పేర్కొనడం గమనార్హం.