ప్రతి సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్లు, ఇంకా టెక్నీషియన్లు తాము మంచి సినిమా చేశామని, ప్రేక్షకులు అందరికీ నచ్చుతుందని చెప్పడం సహజం. కానీ, న్యాచురల్ స్టార్ నాని రూటు సపరేటు. 'సరిపోదా శనివారం' విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఎలా ఉంటుందో? ఎవరెవరు ఎలా చేశారో? చక్కగా, చాలా పద్ధతిగా చెప్పారు. ఆ మాటలు వింటే... ఆయనలో అసిస్టెంట్ దర్శకుడు మాత్రమే కాదు, రివ్యూ రైటర్ కూడా ఉన్నారని అనిపిస్తుంది. 'సరిపోదా శనివారం' సినిమాకు నాని ఇచ్చిన రివ్యూ ఏంటో తెలుసా?


మూడు గంటల ఇంట్రడక్షన్ సాంగ్ లెక్క!
'సరిపోదా శనివారం' సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు. ప్రతి ప్రెస్ మీట్, ఇంటర్వ్యూలో ఆయన గురించి నాని గొప్పగా చెబుతూ వస్తున్నారు. తాను ఈ సినిమాకు జేక్స్ ఎటువంటి నేపథ్య సంగీతం అందిస్తాడోనని చూశానని ఆయన అన్నారు. ఇంకా మాట్లాడుతూ... ''సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ హై ఇస్తాయి. సినిమా చూశాక... మూడు గంటల పాటు హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌కు మ్యూజిక్ కొట్టినట్టు కొట్టాడు జేక్స్. అదరగొట్టాడు. 'సరిపోదా శనివారం' విడుదల తర్వాత అతని సంగీతం గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడతారు. నాకు అంత హై ఇచ్చింది'' అని చెప్పారు నాని.


మూడు గంటల నిడివి... కానీ రేసీగా ఉంటుంది!
'సరిపోదా శనివారం' రన్ టైమ్ ఆల్మోస్ట్ మూడు గంటలు. అయితే, థియటర్లలో అంత సేపు ఉన్న సంగతి ప్రేక్షకులకు తెలియదని నాని అంటున్నారు. రేసీ స్క్రీన్ ప్లేతో సినిమా ముందుకు సాగుతుందని ఆయన వివరించారు. యాక్షన్ సినిమాలకు అది పెద్ద రన్ టైమ్ కాదని నాని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన యాక్షన్ సినిమాలతో కంపేర్ చేస్తే... ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుందని, పాయింట్ లాక్ చేశాక మరో ఆలోచన లేకుండా ముందుకు వెళ్లామని ఆయన తెలిపారు. 


బరువు బాధ్యతలు ఈసారి నా ఒక్కడి మీద లేవు!
సాధారణంగా తన సినిమాల్లో తనకే తెలియని బరువు బాధ్యతలు మోస్తానని, కానీ ఈసారి ఆ బరువును మిగతావాళ్లు మోశారని నాని చెప్పారు. ''సరిపోదా శనివారం'లో సెంటరాఫ్ అట్రాక్షన్ ఒక్కరు అని చెప్పలేం. ఎస్.జె. సూర్య గారు కొంత బరువు, దర్శకుడు వివేక్ ఆత్రేయ మీద కొంత, ప్రియాంక మోహన్ కొంత తీసుకున్నారు. ఈ సినిమా వరకు నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నా. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరిపై భారం ఉంది'' అని నాని చెప్పారు.


Also Read: అన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌



యాక్షన్ 20 శాతమే... యాక్షన్ మోడ్ 80 శాతం!
'సరిపోదా శనివారం' సినిమాలో యాక్షన్ పార్ట్ 20 శాతం అయినప్పటికీ... యాక్షన్ మూడ్ క్రియేట్ చేసే సన్నివేశాలు 80 శాతం ఉన్నాయని నాని చెప్పారు. ''నా వరకు యాక్షన్ అంటే కొట్టడం కాదు... ఆ కొట్టే ముందు యాక్షన్ మూడ్ క్రియేట్ చేసే సీన్లు సైతం కీలకం. అటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కువ ఉన్నాయి'' అని నాని తెలిపారు. సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Also Readఆహా ఓటీటీలో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్... రొమాంటిక్ హారర్ నుంచి ప్యూర్ హారర్ వరకూ... వీటిని అస్సలు మిస్ కావొద్దు