KhushbuReact on Hema Committee: హేమ కమిటీ రిపోర్టు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తుంది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఇచ్చిన ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నటీమణులు సినిమా అవకాశాలు కావాలంటే వారు కమిట్‌మెంట్స్ ఇవ్వాల్సిందేనని హేమ కమిటీ తెల్చి చెప్పింది. దీంతో ఇందులోని అంశాలు ఇండస్ట్రీలోని పెద్దలను, నటీనటులను ఆలోచించేలా చేస్తుంది. కేమ కమిటీ రిపోర్టులో స్పందిస్తూ ఒక్కొక్కరుగా తమ గళం విప్పుతున్నారు.


ఇప్పటికే హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు నటీనటులు దీనిపై స్పందించి బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. తాజాగా నటి ఖుష్బూ కూడా హేమ కమిటీ రిపోర్టుపై స్పందించింది. ఈ మేరకు ఆమె ట్విట్‌ పోస్ట్‌ చేసింది.  "మన సినీ పరిశ్రమలో ఆడవాళ్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనడం నిజంగా నిజంగా బాధాకరం. వేధింపులను బయట పెట్టడానికి హేమ కమిటీ ఎంతో ఉపయోగపడింది.  వీటిపై ధైర్యంగా ముందుకు వచ్చి నోరువిప్పిన మహిళలను మెచ్చుకోవాలి. ఆడవాళ్లకు కెరీర్‌లో రాణించాలనుకునే ఆడవాళ్లకు వేధింపులు, కమిట్‌మెంట్స్‌ అనేవి అన్ని రంగల్లోనూ ఉన్నాయి. పురుషులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండోచు.


కానీ, ఎక్కువగా వేధింపులు ఎదుర్కొనేది మాత్రం మహిళలే. ఇలాంటి పరిస్థితులపై నేను నా కూతుళ్లకు చాలా వివరంగా చెప్పాను. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురైన వెంటనే  వచ్చి చెప్పాలి. అప్పుడే దర్యాప్తుకు చాలా సహాయ పడుతుంది. అలాగే బాధితులకు కూడా మన మద్దతు ఎంతో ముఖ్యం. వారి బాధను మనం కూడా వినాలి. మానసికంగా వారికి ధైర్యంగా చెప్పాలి" అని పేర్కొన్నారు. "అయితే కొందరు దీనిపై ప్రశ్నలు వేస్తున్నారు. సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదుని చాలామంది అడుగుతున్నారు. బయటకు వచ్చి చెప్పే ధైర్యం అందరికి ఉండదు. గతంలో నా తండ్రి వల్ల నేను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటకు వచ్చి చెప్పినప్పుడు దీనికి ఎందుకు అంత సమయం తీసుకున్నావు? అని నన్ను చాలా మంది ప్రశ్నించారు.






ఇది నాకు కెరీర్‌ పరంగా జరిగింది కాదు. రక్షణ కల్పించాల్సిన తండ్రే వేధించాడు. అందరికి ఇంట్లో పరిస్థితులు ఒకేలా ఉండవు. సొంత వాళ్ల నుంచి వారికి సరైన మద్దతు ఉండదనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అలాంటి వారు ధైర్యంగా ముందుకు వచ్చి  ఏం చెప్పలేరు" అని అన్నారు.  చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా ఎంతోమంది ఆడవాళ్లు ఇక్కడకు వస్తారు. అలాంటి వారి ఆశలను ఆదిలో తుడిచి వేస్తున్నారు. వారందరి తరపున పురుషులందరికి నేను చెప్పేది ఒక్కటే. బాధిత మహిళలు అండగా నిలవండి. మహిళలపై జరుగుతున్న ఈ సంఘటనలపై మీరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది.



అందరం కలిసి ఈ గాయాలను మానేలా చేయగలం. ఈ నివేదిక అందరిలో మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నా" అని రాసుకొచ్చారు. ఇండస్ట్రీలో స్టార్‌ నటిగా గుర్తింపు పొందిన ఖుష్బూ తన కన్న తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కున్నట్టు గతంలో ఆమె చెప్పడం సంచలనంగా మారింది. 8 ఏళ్ల వయసులోనే తన తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, ఈ విషయాన్ని చెప్పితే తన తల్లి నమ్ముతుందో లేదో అని భయపడ్డాను. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను" అని మరోసారి తనకు ఎదురైన ఈ చేదు అనుభవావాన్ని ఈ ట్వీట్‌లో పేర్కొంది. 


Also Read: ఎన్‌ కన్వెన్షన్‌‌ కూల్చివేత - శోభితతో పెళ్లిపై నాగచైతన్య ఫస్ట్‌ రియాక్షన్‌