Naga Chaitanya About His Marriage With Sobhita: ఎన్‌ కన్వెన్షన్‌ (N Convention) కూల్చివేతపై ఆయన కుమారుడు, హీరో అక్కినేని నాగ చైతన్య ఫస్ట్‌టైం స్పందించారు. టాలీవుడ్‌ హీరో నాగార్జున అక్కినేనికి చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ అక్రమ కట్టడంగా పేర్కొంటూ హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని మాదాపూర్ తుమ్మిడికుంట చెరువుకు ఆనుకొని ఆయన ఈ ఫంక్షన్‌ హాల్‌ను నిర్మించారు. మొత్తం 3 ఎకరాల 30 గుంటల తుమ్మికుంట చేరువును ఆక్రమించి నిర్మాణం చేపట్టారని హైడ్రా ఆరోపించింది.

దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆదేశం మేరకు హైడ్రా తక్షణ చర్యలు చేపట్టి ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. ప్రస్తుతం ఈ కూల్చివేతల అంశం తెలంగాణ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై ఇప్పటికే నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా వివరణ కూడా ఇచ్చారు. అంతేకాదు ఈ విషయమై ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హీరో నాగచైతన్యకు కన్వెన్షన్‌ కూల్చివేతపై ప్రశ్న ఎదురైంది.

ఇటీవల నాగ చైతన్య తస్వా అనే పెళ్లి వస్త్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ సంతకం చేశాడు. హిమయత్‌నగర్‌లోని ఈ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన చైకి మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత గురించి అడగ్గా.. ఆ విషయం ఇప్పుడు వద్దని, దానికి సంబంధించి నాన్న ఇప్పటికే అన్ని వివరాలు ట్విట్‌ చేశారు. అన్ని వివరించారు" అన్నాడు. ఇక శోభితతో పెళ్లి గురించి అడగ్గా.. "నా వరకు పెళ్లి అనేది జీవితంలో చాలాముఖ్యమైనది. భావిస్తానని, మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం జరుగుతుంది.

ఇక పెళ్లి ఎప్పుడు, ఎక్కడా? అనేది త్వరలోనే అన్ని వివరాలు చెబుతామని, ప్రస్తుతానికి అయితే డిస్టినేషన్‌ వెడ్డింగ్‌, ప్రైవేట్‌ వెడ్డింగా అనేది ఏం నిర్ణయించుకోలేదు" అని సమాధానం ఇచ్చాడు. ఇక తన సినిమాల గురించి ప్రశ్నించగా... చందూ మొండేటితో తండేల్‌ సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం నా లుక్‌ ఆ సినిమాలోనిదే. ఇందులో నా పాత్ర చాలా ఛాలెంజింగ్‌ ఉంటుంది. ఇది నిజజీవిత సంఘటన ఆధారం వస్తున్న మూవీ. కాబట్టి ఇప్పటి వరకు నేను చేసి పాత్రలన్నింటిలో ఇది అత్యంత సవాల్‌తో కూడుకుంది" అని చెప్పాడు.

Also Read: 'ఖుషీ 2' స్క్రిప్ట్‌ విని చేయనన్న పవన్‌ కళ్యాణ్‌ - కారణమేంటో చెప్పిన ఎస్‌జే సూర్య

ఎన్‌ కన్వెన్సన్‌ పక్కా పట్టా భూమి 

ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం కాదంటూ నాగార్జు ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి తుమ్మిడికుంట చెరువు భూమిలో ఎలాంటి ఆక్రమణ జరగలేదని 24 ఫిబ్రవరి 2014న కోర్టు తీర్పు  (Sr.3943/2011) ఇచ్చింది. హైకోర్టులో ఇదే విషయాన్ని ప్రస్తావించాం. చట్టాలను నేనెప్పుడూ గౌరవిస్తాను. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి అక్రమ కట్టడమని ఆసత్య ప్రచారం చేస్తున్నారు. అవేవి నమ్మకండి. అసలు నిజమేంటనేది చెప్పడానికే నేను ఈ ట్వీట్ చేస్తున్నా. మాది పక్కా పట్టా భూమి. ఒక్క అంగుళం కూడా కబ్జా చేసింది కాదు" అని ఆయన స్పష్టం చేశారు.