Five Weapons of Lord Vishnu : మీరు ధర్మ మార్గంలో ఉండడం కూడా మీకు శత్రువులను పెంచుతుంది. మీకు పెరిగే గౌరవ మర్యాదలు చూసి ఓర్వలేనివారుంటారు. ఎదుటివారు బాగుపడుతున్నారు..తామింకా అక్కడే ఉన్నాం అని గోలపెట్టేవారుంటారు. ఇలాంటి వారినుంచి రక్షణ ఎలా సాధ్యం? ఎదుటివారికి ఎలాంటి హాని చేయకుండా..వారి నుంచి మిమ్మల్ని మీరు సాత్వికంగా రక్షించుకోవాలంటే ఏం చేయాలి? వీటికి సమాధానమే పంచాయుధ స్తోత్రం అంటారు పండితులు. విష్ణువు యొక్క 5 ఆయుధాలు..దురాగతాలు, దుర్మార్గాల నుంచి తన భక్తులను, భూమిని రక్షణగా పరిగణిస్తారు. ఈ ఆయుధాలను పూజించేవారికి జీవితంలో అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. విష్ణుసహస్రనామలలో “సర్వప్రహరణాయుధ” అనే నామం ఉంటుంది.. అంటే రక్షణ కోసం తనని ఆశ్రయించినవారికి సకల కష్టాలను సమూలంగా తొలగించేందుకు ఆయుధాలను ఆభరణాలుగా ధరించినవాడు అని అర్థం. సాధారణంగా విష్ణుసహస్రనామంతోపాటు పంచాయుధస్తోత్రం కూడా పారాయణం చేసేవారు. 


Also Read: వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటరా అంటారా..అసలు పెళ్లెందుకు చేసుకోవాలో తెలుసా!


శ్రీ మహావిష్ణువు 5 ఆయుధాలు - ఈ ఆయుధాలను కీర్తిస్తూ ఉండే శ్లోకాలే పంచాయుధ స్తోత్రం...
 
1. సుదర్శనం - చక్రం


స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యమ్ |
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాఽహం శరణం ప్రపద్యే||  
 
2. పాంచజన్యం - శంఖం  


విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంతా |
తం పాంచజన్యం శశికోటిశుభ్రం శంఖం సదాఽహం శరణం ప్రపద్యే||  


3. కౌ కౌమోదకి -   గద


హిరణ్మయీం మేరుసమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీమ్ |
వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాఽహం శరణం ప్రపద్యే||  


4. నందకము - ఖడ్గం


రక్షోఽసురాణాం కఠినోగ్రకంఠ చ్ఛేదక్షరచ్ఛోణితదిగ్ధధారమ్ |
తంనందకం నామ హరేః ప్రదీప్తం ఖడ్గం సదాఽహం శరణం ప్రపద్యే||  


5.   శార్ఙ్గం -  విల్లు


యజ్జ్యానినాదశ్రవణాత్ సురాణాం చేతాంసి నిర్ముక్తభయాని సద్యః |
భవంతి దైత్యాశనిబాణవర్షి శార్ఙ్గం సదాఽహం శరణం ప్రపద్యే||  


Also Read; శ్రావణమాసంలో బంగారం తప్పనిసరిగా కొంటారు..ఎందుకో తెలుసా!


పంచాయుధ స్తోత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు


ఇమం హరేః పంచమహాయుధానాం స్తవం పఠేద్యోఽనుదినం ప్రభాతే |
సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి|| 


వనే రణే శత్రు జలాగ్నిమధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు |
ఇదం పఠన్ స్తోత్రమనాకులాత్మా సుఖీభవేత్ తత్కృత సర్వరక్షః|| 


యచ్చక్రశంఖం గదఖడ్గశార్ఙ్గిణం పీతాంబరం కౌస్తుభవత్సలాంఛితమ్ |
శ్రియాసమేతోజ్జ్వలశోభితాంగం విష్ణుం సదాఽహం శరణం ప్రపద్యే||


జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః | 
అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః||
 
ఇతి పంచాయుధ స్తోత్రమ్ ||


అయితే ఏ సాధన చేసినా మీకు మంచి జరగాలని చేయాలి కానీ ఎదుటివారికి చెడు జరగాలని, ఎదుటివారి నాశనాన్ని కోరుకంటే  కోర్కె నెరవేరదు, మీరు చేసే సాధనకు ఎలాంటి సానుకూల ఫలితం ఉండదు..


గమనిక: పండితులు సూచించిన విషయాలు, ఆధ్యాత్మిగ గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. పైన సూచించిన నియమాలు అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మీ భక్తివిశ్వాసాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడిఉంటుంది..


Also Read: వరలక్ష్మీ వ్రతం సులువుగా చేసుకునే విధానం - ఈ రోజు చదువుకోవాల్సిన వ్రత కథ!